రక్షణ మంత్రిత్వ శాఖ
ఢిల్లీ, ఎన్‌సిఆర్ ప్రాంతంలోని పాఠశాలల్లో భారత నౌకాదళం ప్రేరణాత్మక కార్యక్రమం
Posted On:
01 OCT 2023 4:24PM by PIB Hyderabad
నౌకాదళం దినోత్సవం-2023ని పురస్కరించుకుని భారత నౌకాదళం ఢిల్లీ, ఎన్‌సిఆర్ ప్రాంతంలోని పాఠశాలల్లో ప్రేరణాత్మక చర్చలను నిర్వహిస్తోంది. ఈ చర్చలు నౌకాదళం ప్రధాన కార్యాలయంలోని వివిధ విభాగాలు/ ప్రత్యేకతలలోని అధికారులతో పరస్పరం సమన్వయం చేయబడుతున్నాయి. ఈ కార్యక్రమంలో అధికారులు భారత నౌకాదళం కార్యక్రమాలను గురించి అలాగే ఈ రంగంలో ఉపాధి అవకాశాల గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఒక ఏవియేటర్, సబ్‌మెరైనర్, ఒక మహిళా అధికారి ఉన్నారు. ఈ బృందం తొమ్మిది వివిధ పాఠశాలలను సందర్శించారు. సీఆర్పీఎఫ్ పబ్లిక్ స్కూల్ (ద్వారక), మోడరన్ పబ్లిక్ స్కూల్ (షాలిమార్ బాగ్), సచ్‌దేవ పబ్లిక్ స్కూల్ (రోహిణి), డాఫోడిల్ పబ్లిక్ స్కూల్ (నరేలా) , జీడీ గోయెంకా పబ్లిక్ స్కూల్ (సరితా విహార్), మహారాజా అగ్రసేన్ మోడల్ స్కూల్ (పితాంపురా), ఎన్.కే. బగ్రోడియా పబ్లిక్ స్కూల్ (రోహిణి), డీఎల్ డీఏబీ మోడల్ స్కూల్ (షాలిమార్ బాగ్), గవర్నమెంట్ కోఎడ్ సీనియర్ స్కూల్ (ద్వారక) పాఠశాలలో ఈ ప్రేరణాత్మక కార్యక్రమం నిర్వహించారు. దీనికి అదనంగా బృందం న్యూ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్‌లోని ఎన్.సి.సి. వార్షిక శిక్షణా శిబిరాన్ని కూడా సందర్శించింది. పాఠశాల పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం మరియు నౌకాదళం, నావికా దళం జీవన విధానం మరియు ఇండియన్ నేవీలో రిక్రూట్‌మెంట్ కోసం అందుబాటులో ఉన్న వివిధ మార్గాల గురించి అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యం.
***
(Release ID: 1963043)
Visitor Counter : 66