జల శక్తి మంత్రిత్వ శాఖ
కర్నాటక: సముద్ర జలాలవల్ల ఏర్పడిన ఉప్పునీటి కయ్యల (బ్యాక్ వాటర్స్) నుంచి సేకరిస్తున్న ప్లాస్టిక్ వ్యర్ధాలు అలలు సృష్టిస్తున్నాయి. ఉడిపి జిల్లాలో నిర్వహిస్తున్న స్వచ్ఛత హి సేవ కార్యక్రమం ద్వారా 500 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు.
Posted On:
30 SEP 2023 5:00PM by PIB Hyderabad
కర్నాటక రాష్ట్రంలో ‘స్వచ్ఛత హి సేవా’ ప్రచార కార్యక్రమం కింద సాలిగ్రామ కయాకింగ్ పాయింట్‌తో పాటు, ఉడిపి జిల్లా పంచాయతీ , కోటతట్టు మరియు కోడి గ్రామ పంచాయతీల సహకారంతో సాలిగ్రామ కోడి బ్యాక్ వాటర్ పాయింట్ వద్ద ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఉప్పునీటి కయ్యలు ఉన్నచోట చెత్త పేరుకుపోవడంతో ఈ ప్రత్యేక స్థలాన్ని శుభ్రపరిచేందుకు జిల్లా పంచాయతీతో పాటు జిల్లా యంత్రాంగం ఎంపిక చేసింది. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు మరియు సామాజిక వర్గాలు పాల్గొనడం విశేషం. ఇది పరిశుభ్రత మరియు పర్యావరణ అవగాహనను పెంపొందించడానికి తోడ్పడే గణనీయమైన యత్నంగా భావిస్తున్నారు.
ఈ కార్యక్రమం జాతీయ జెండాను ఎగురవేసిన తరువాత పరిశుభ్రత మరియు పర్యావరణ పరిరక్షణ పట్ల నిబద్ధతను నొక్కిచెప్పే స్వచ్ఛత ప్రమాణ స్వీకారంతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఉప్పునీటి కయ్యల నుంచి నుంచి 500 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను, ఇతర చెత్తను సేకరించారు. ఈ విధంగా సేకరించిన వ్యర్థాలను ఘన వ్యర్ధాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (SWM) కేంద్రానికి సరైన రీతిలో, శాస్త్రీయపద్ధతిలో పారవేయడం కోసం పంపారు.
ఈ కార్యక్రమం యొక్క ప్రాథమిక లక్ష్యం నీటి కాలుష్యాన్ని నివారించడానికి గల ప్రాముఖ్యత గురించి పర్యాటకులు మరియు స్థానిక సమాజంలో అవగాహన పెంచడం. భిన్న వర్గాలకు చెందినవారు పాల్గొన్న ఈ ఉపక్రమణ గణనీయమైన మొత్తంలో వ్యర్థాలను సేకరించడం ద్వారా పర్యావరణాన్ని, ముఖ్యంగా బ్యాక్‌వాటర్ పర్యావరణ వ్యవస్థను రక్షించడానికి, సహజసిద్ధంగా ఏర్పడిన మన పరిసరాల పట్ల బాధ్యత భావాన్ని పెంపొందించడానికి బలమైన నిబద్ధతను ప్రదర్శించింది. ఈ ప్రాంతంలో స్థిరమైన పర్యావరణ నిరంతరతను మరియు బాధ్యతాయుతమైన పర్యాటక పద్ధతులను ప్రోత్సహించడంలో ఇటువంటి ఉపక్రమణలు కీలకమైనవి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులలో ఉడిపి డిప్యూటీ కమిషనర్ శ్రీమతి విద్యా కుమారి, ఉడిపి జిల్లా పంచాయతీ సీఈవో ప్రసన్న హెచ్, రష్మి, ఏసీ కుందాపుర, ఉడిపి ఎస్‌బీఎం-జీ నోడల్ అధికారి ఎ శ్రీనివాసరావు, పీఆర్‌ఐ (పంచాయతీ రాజ్ సంస్థ), జీపీ (గ్రామ పంచాయతీ) ) కోడి మరియు కోటతట్టు గ్రామ పంచాయతీ అధికారులు, స్థానిక విద్యార్థులు, SHG (స్వయం-సహాయక బృందాల) సభ్యులు, పారిశుధ్య సిబ్బంది. మొత్తం 70 మంది ఉపయుక్తమైన ఈ కార్యక్రమం కోసం చేతులు కలిపారు.
***
(Release ID: 1962964)
Visitor Counter : 106