వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
వాణిజ్యంపై భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య జాయింట్ వర్కింగ్ గ్రూప్ 15వ సమావేశం
Posted On:
01 OCT 2023 10:22AM by PIB Hyderabad
వాణిజ్య అంశాలపై భారతదేశం, బంగ్లాదేశ్ సంయుక్త వర్కింగ్ 2023 సెప్టెంబర్ 27,27 తేదీల్లో సమావేశం అయ్యింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో సమావేశం జరిగింది.
సమావేశానికి భారత ప్రభుత్వ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, వాణిజ్య శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ విపుల్ బన్సల్, బంగ్లాదేశ్ వాణిజ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ నూర్ ఎండి. మహబుబుల్ హక్ సహ అధ్యక్షత వహించారు. .
ఓడరేవు పరిమితుల తొలగింపు, సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం రూపకల్పన, ప్రమాణాల సమన్వయం, ప్రమాణాల పరస్పర గుర్తింపు, బంగ్లాదేశ్‌కు అవసరమైన నిత్యావసరాల సరఫరా, రహదారి అభివృద్ధి, రైలు సౌకర్యం, బహుళ-మోడల్ రవాణా ద్వారా రెండు దేశాల మధ్య రవాణా సౌకర్యం, కస్టమ్స్ స్టేషన్లు/ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులను పటిష్టం చేయడం , సరిహద్దు సమస్యలు వంటి ద్వైపాక్షిక అంశాలు సమావేశంలో చర్చకు వచ్చాయి.
రెండు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలు మెరుగు పరచడానికి కృషి చేయాలని , ప్రాంతీయ సహకారం, స్థిరమైన అభివృద్ధికి కృషి చేయాలని రెండు దేశాలు సమావేశంలో నిర్ణయించాయి. భవిష్యత్తులో మరింత మెరుగైన వాణిజ్య సంబంధాలు, పరస్పర ప్రయోజనం కలిగించే రంగాలపై ద్రుష్టి సారించి పని చేయాలని సమావేశంలో రెండు దేశాల ప్రతినిధులు అంగీకరించారు.
ఆర్థిక, వాణిజ్య రంగాలకు సంబంధించి రెండు దేశాలకు ప్రయోజనం కలిగించడానికి ఏర్పాటైన భారతదేశం-బంగ్లాదేశ్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఆన్ ట్రేడ్ (JWG) ఏడాదికి ఒకసారి సమావేశం అవుతుంది. కీలకమైన వాణిజ్య సంబంధిత సమస్యలు, ఆర్థిక, సాంకేతిక సహకారం, వాణిజ్య సంబంధాల విస్తరణ , రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత ఎక్కువ చేయడానికి అందుబాటులో ఉన్న వైవిధ్యభరితమైన అవకాశాలను సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. వాణిజ్య అడ్డంకులను తొలగించడం, కస్టమ్స్ విధానాలను సులభతరం చేయడం, మౌలిక సదుపాయాల మెరుగుదల, రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా ద్వైపాక్షిక సమస్యలను త్వరగా పరిష్కరించడంలో ఈ సమావేశాలు కీలక పాత్ర పోషిస్తాయి.
రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి భారతదేశం, బంగ్లాదేశ్ అనేక వాణిజ్య సులభతర చర్యలు చేపట్టాయి. ఏదైనా ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపో (ICD)లో కస్టమ్స్ క్లియరెన్స్ సౌకర్యంతో మూసివేసిన కంటైనర్‌లలో బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి రైలు ద్వారా ఎగుమతులు చేయడానికి అనుమతి ఇస్తూ భారతదేశం 2022 మే 17వ తేదీ సర్క్యులర్‌లో జారీచేసింది. చట్టోగ్రామ్, మోంగ్లా పోర్ట్ (ACMP) ద్వారా కార్యకలాపాలు ప్రారంభించి ఒప్పందాన్ని విజయవంతంగా అమలు చేయడం ప్రారంభించామని బంగ్లాదేశ్ తెలియజేసింది. వివిధ ల్యాండ్ కస్టమ్ స్టేషన్ (LCS) ద్వారా వస్తువుల సంఖ్య పెరిగిందని కూడా బంగ్లాదేశ్ తెలిపింది.
***
(Release ID: 1962956)