జల శక్తి మంత్రిత్వ శాఖ

సేంద్రీయ వ్యర్థాలను రెండు నెలల్లో ఎరువుగా మార్చే ఒక ప్రత్యేక మార్గం: అస్సాం పైప్ కంపోస్టింగ్‌ను ప్రోత్సహిస్తుంది:

Posted On: 28 SEP 2023 2:12PM by PIB Hyderabad

స్వచ్ఛతా హి సేవా ప్రచారం సందర్భంగా గృహాలలో సేంద్రీయ వ్యర్థాలను పారవేయడానికి సులభమైన మరియు ప్రభావవంతమైన సాంకేతికత  పద్దతి అయిన పైపు కంపోస్ట్‌ ను అస్సాం గ్రామాలలో చురుకుగా ప్రోత్సహిస్తోంది. అస్సాంలోని బిస్వనాథ్ జిల్లాకు చెందిన జిల్లా జల మరియు పారిశుద్ధ్య కమిటీ చాలా కాలంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో ఉత్పన్నమయ్యే సేంద్రీయ వ్యర్థాల నిర్వహణ కోసం  పైపు కంపోస్టింగ్‌ని ప్రోత్సహిస్తోంది. స్వచ్ఛతా హి సేవా 2023 కార్యక్రమం కింద జిల్లా అధికారులు చారియాలి మజలియా ఎం ఈ స్కూల్‌లో రెండు పైపులను ఏర్పాటు చేశారు.

 

పైప్ కంపోస్టింగ్ సాంకేతికత అనేది 8 - 10 అంగుళాల వ్యాసం మరియు 1.25 మీటర్ల పొడవు కలిగిన పీ వీ సీ పైపులను ఉపయోగించి సేంద్రీయ వ్యర్థాలను కంపోస్ట్‌గా మార్చే పద్ధతి. పైపులు నిలువుగా నేల లోపల 25-30 సెం.మీ. వరకు దించుతారు. మిగిలిపోయిన ఆహారం, పండ్లు మరియు కూరగాయల తొక్కలు, పువ్వులు, పేడ, వ్యవసాయ వ్యర్థాలు మొదలైన వాటితో సహా క్షీణించే వ్యర్థాలను మాత్రమే పైపులలోకి పారవేయవచ్చు. రెండు వారాలకు ఒకసారి కొద్దిగా ఆవు పేడ మరియు పొడి ఆకులను నీటిలో కలిపి లోపల పోస్తే వానపాముల పెరుగుదల వేగవంతం అవుతుంది. వర్షపు నీరు పైపులలోకి ప్రవేశించకుండా ఇది మూసివేయబడాలి. 2 నెలల తర్వాత పైపు పైకి లేపి కంపోస్ట్ ఎరువును తొలగించవచ్చు.

 

పైపు కంపోస్టింగ్ వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఏమిటంటే - పర్యావరణానికి హాని కలిగించకుండా సేంద్రీయ చెందే వ్యర్థాలను తక్కువ సమయంలోనే ఎరువుగా మారుస్తుంది. ఇది పాఠశాల క్యాంపస్‌లో పరిశుభ్రమైన వాతావరణాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది వాసన దోమలు కీటకాలు లేకుండా చేస్తుంది. ఇది స్థలాన్ని కూడా సమర్థవంతం గా ఆదా చేస్తుంది. అంతేకాకుండా, అదే పైపులను మళ్లీ మళ్లీ ఉపయోగించగలగడం వల్ల వ్యవస్థ స్థిరంగా ఉంటుంది. ఇంకా, విద్యార్థులు సేంద్రీయ జీవ శాస్త్రం మరియు జీవావరణ శాస్త్రం, సూక్ష్మజీవులు మరియు అకశేరుకాల పాత్ర మరియు వ్యర్థాల నిర్వహణ మరియు స్థిరత్వం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడానికి ఇది అవకాశాన్ని అందిస్తుంది.

 

 

***



(Release ID: 1962546) Visitor Counter : 54


Read this release in: English , Urdu , Hindi , Assamese