సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రభుత్వ ఉద్యోగుల కోసం కెపాసిటీ బిల్డింగ్ ప్లాన్ (సిబిపి)ని ప్రారంభించిన డాక్టర్ జితేంద్ర సింగ్


సిబిపి అనేది అధికారులకు శిక్షణ ఇవ్వడానికి మరియు నైపుణ్యాలు మరియు సామర్థ్యాలను బట్టి అధికారులు మరియు సిబ్బందిని హేతుబద్ధీకరించడానికి ప్రధాని మోదీ చేపట్టిన కొత్త చొరవ అని తెలిపిన డాక్టర్ జితేంద్ర సింగ్

"ప్రభుత్వంలో సులభమైన ఆర్థిక మరియు పర్యావరణ అనుకూలమైన పనితీరుకు దారితీసే ఈ-గవర్నెన్స్‌పై ప్రధాని మోదీ ఉద్ఘాటించారు": డాక్టర్ జితేంద్ర సింగ్

మన జీవితాలను సమూలంగా మార్చడానికి ఏఐ సిద్ధంగా ఉన్నందున శిక్షణ మాడ్యూళ్లను నిరంతరం అప్‌డేట్ చేయాలని సిబిసికి పిలుపునిచ్చిన డిఒపిటి మంత్రి

Posted On: 27 SEP 2023 3:10PM by PIB Hyderabad

కేంద్ర సైన్స్ & టెక్నాలజీ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ఎంఓఎస్ పిఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్ డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ ప్రభుత్వ ఉద్యోగుల కోసం కెపాసిటీ బిల్డింగ్ ప్లాన్ (సిబిపి)ని ఈరోజు న్యూ ఢిల్లీలోని డిఒపిటి ప్రధాన కార్యాలయంలో డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు.

డిఓపిటితో సంప్రదించి కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ (సిబిసి) ఈ ప్రణాళికను రూపొందించింది.

 

image.png


ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు మరియు నైపుణ్యాలు మరియు సంపాదించిన సామర్థ్యాలను బట్టి అధికారులు మరియు సిబ్బందిని హేతుబద్ధీకరించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేపట్టిన కొత్త చొరవ సిబిపి అని అన్నారు. ఇది ప్రభుత్వ కార్యాలయాల పరివర్తనకు ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు.

“ప్రభుత్వంలో సులభమైన ఆర్థిక మరియు పర్యావరణ అనుకూల పనితీరుకు దారితీసే ఈ-గవర్నెన్స్‌పై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇది సులువు విశదీకరణను సూచిస్తుంది. ఇఆఫీస్‌ ఆర్థిక వ్యవస్థకు దారి తీస్తుంది. ఇది ఫైల్ పనిని తొలగించడం వలన సమయం మాత్రమే కాకుండా పర్యావరణ అనుకూలమైనది.ప్రధాని మోదీ ప్రారంభించిన పరిపాలనా సంస్కరణలు సమర్థవంతమైన, పారదర్శకమైన మరియు అవినీతి రహిత పరిపాలనను సృష్టించే లక్ష్యంతో ఉన్నాయి” అని  అన్నారు.

 

image.png


డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ కర్మయోగి ప్రారంభం మాడ్యూల్‌ను ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇండక్షన్ ట్రైనింగ్‌లో భాగంగా చేశామని రోజ్‌గార్ మేళా కింద ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన కొత్త రిక్రూట్‌లకు కూడా అదే అమలు చేశామని చెప్పారు. దీనికి 6వ సీక్వెల్‌గా నిన్న 51,000 మంది యువతకు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ లెటర్‌లను అందజేశారని తెలిపారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన అభ్యాసం మరియు పని సంస్కృతిని విస్తృతం చేయబోతున్నందున వివిధ శిక్షణా మాడ్యూళ్లను నిరంతరం నవీకరించాలని మరియు సవరించాలని సిబిసికి డిఒపిటి మంత్రి  పిలుపునిచ్చారు.

"ఈ సాంకేతికత యుగంలో రెట్టింపు సమయం ఐదు సంవత్సరాల నుండి ఒక సంవత్సరం కంటే తక్కువకు కుదించబడింది" అని మంత్రి తెలిపారు.

 

image.png


ఏఎస్‌ఓ స్థాయి నుండి జెఎస్‌ వరకు అన్ని స్థాయిల ప్రభుత్వ ఉద్యోగులకు ఐగాట్ శిక్షణా మాడ్యూల్స్ మరియు సెక్రటరీల కోసం కూడా కొన్ని ఎంపిక చేసిన కోర్సులను రూపకల్పన చేసినందుకు సిబిపిని ప్రశంసిస్తూ, మంత్రుల కోసం కూడా ఇదే విధమైన శిక్షణా మాడ్యూల్‌ను రూపొందించాలని డాక్టర్ జితేంద్ర సింగ్ సిబిసి ఛైర్మన్ శ్రీ ఆదిల్ జైనుల్‌భాయ్‌ను కోరారు.
 

image.png


ఐగాట్ ప్లాట్‌ఫామ్‌లో 700 కోర్సులను ప్రవేశపెట్టినట్లు సీబీసీ చైర్మన్ మంత్రికి తెలియజేశారు. దాదాపు 3 మిలియన్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలో, 1 మిలియన్ సిబ్బంది రైల్వేలో, మరో 1 మిలియన్ మంది సిఏపిఎఫ్‌లలో మరియు మిగిలిన 1 మిలియన్ మంది మినిస్ట్రీలు మరియు డిపార్ట్‌మెంట్లలో ఉన్నారని ఆయన చెప్పారు. 80% నైపుణ్యాలు క్రియాత్మక మరియు ప్రవర్తనా నైపుణ్యాలకు సంబంధించినవి అయితే కేవలం 20% నిర్దిష్ట పనులు మరియు పాత్రలకు సంబంధించిన డొమైన్ ఆధారితవి.మిషన్ కర్మయోగి మరియు ఐగాట్ 'కరంచారి'లను 'కరమయోగులు'గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని ఆయన చెప్పారు.
 

***


(Release ID: 1961543) Visitor Counter : 112


Read this release in: English , Urdu , Hindi , Tamil