బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

తొమ్మిది రాష్ట్రాలలోని 981 గ్రామాలకు నీటి సౌకర్యం అందిస్తున్న ప్రభుత్వ రంగంలోని బొగ్గు సంస్థలు


వ్యవసాయ, తాగునీటి సరఫరా వల్ల దాదాపు 18 లక్షల మంది ప్రజలకు ప్రయోజనం

సుస్థిర తవ్వకాలు సాగిస్తూనే ప్రజల అవసరాలు తీరుస్తున్న ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థలు

Posted On: 27 SEP 2023 12:51PM by PIB Hyderabad

బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగంలో  నడుస్తున్న బొగ్గు సంస్థలు జల వనరులను తమ అవసరాలకు మాత్రమే కాకుండా ప్రజలకు అవసరమైన తాగు, సాగు నీరు  సరఫరా చేస్తున్నాయి. బొగ్గు ఉత్పత్తి సంస్థలు అమలు చేస్తున్న కార్యక్రమాల వల్ల   తొమ్మిది రాష్ట్రాల్లో  981 గ్రామాలకు చెందిన  17.7 లక్షల మంది ప్రజలు ప్రయోజనం పొందుతున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న బొగ్గు ఉత్పత్తి సంస్థలు దాదాపు  8130 లక్షల క్యూబిక్ మీటర్ల  గని నీటిని విడుదల చేశాయి. మొత్తం విడుదల అవుతున్న  నీరులో 46% గృహ, నీటిపారుదల అవసరాల కోసం, 49% అంతర్గత గృహ,పారిశ్రామిక అవసరాల కోసం మిగిలిన  6% నీరును భూగర్భ జలాల రీఛార్జ్ కార్యక్రమాల కోసం కేటాయించారు. గనిలో ఉపయోగించిన నీరు తాగడానికి, వ్యవసాయ కార్యక్రమాల కోసం వినియోగించడానికి అనువుగా వివిధ విధానాల ద్వారా శుద్ధి చేస్తున్నారు. ఏడాది పొడవునా ప్రజలకు  సురక్షితమైన,స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయడానికి  అనేక చర్యలు అమలు జరుగుతున్నాయి. 

బొగ్గు గనుల కార్యకలాపాల సమయంలో గని సంప్‌లలో గణనీయమైన పరిమాణంలో  నీరు చేరుతుంది.భూమి  పొరల నుంచి వచ్చిన నీటిని నిల్వ చేయడమే కాకుండా పరిసర పరీవాహక ప్రాంతం ఉపరితల ప్రవాహ నీరు కూడా వీటిలో చేరుతుంది. గని సంపులు నీటి సేకరణ, భూగర్భ జలాల రీఛార్జ్ వ్యవస్థలుగా  సమర్థవంతంగా పనిచేస్తాయి. నిల్వ అయిన గని నీరు గృహ, త్రాగునీటి సరఫరా, వ్యవసాయ కార్యక్రమాలు, భూగర్భ జలాల పునరుద్ధరణ, ధూళి ఎగిసి పడకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. భారీ యంత్రాలు కడగడం వంటి అనేక పారిశ్రామిక అవసరాలకు కూడా నీరు ఉపయోగపడుతుంది. 

 నింగా బొగ్గు గనిలో రివర్స్ ఆస్మోసిస్ (RO) ఫిల్టర్ ప్లాంట్ : 

పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ్ బర్ధమాన్ జిల్లాలో ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌కు చెందిన నింగా బొగ్గు గనిలో  గంటకు 5000 లీటర్ల సామర్థ్యంతో పనిచేసే  అత్యాధునిక రివర్స్ ఆస్మాసిస్ (RO) ఫిల్టర్ ప్లాంట్ ఏర్పాటయింది. బొగ్గు గని నుంచి వెలువడే నీటిని  ఈ ప్లాంట్  శుద్ధి చేస్తుంది,.  శుద్ధి చేసిన నీటిని  సమీపంలోని గ్రామాలు, కాలనీలకు  తాగునీరు, గృహ అవసరాల కోసం  సరఫరా చేస్తున్నారు. రివర్స్ ఆస్మాసిస్ ప్లాంట్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి   నీటి నుండి మలినాలు,వ్యర్థాలను పూర్తిగా  తొలగిస్తుంది, వ్యర్థాలతో నిండిన నీటిని కాకుండా  స్వచ్ఛమైన నీరు మాత్రమే ప్లాంట్ ద్వారా విడుదల అవుతుంది.  ఈ విధానం వల్ల శుద్ధి చేసిన నీరు ప్రజల  అవసరాలను తీరుస్తుంది.

. తూర్పు కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లోని శ్రీపూర్ ఏరియాలో ఏర్పాటైన ఆర్ ఓ  ఫిల్టర్ ప్లాంట్ (120 KLD) 

మధ్యప్రదేశ్‌లోని షాడోల్,  అనుప్పూర్ జిల్లాలలో ఎస్ఈసిఎల్ అమలు చేస్తున్న  నీటి సరఫరా కార్యక్రమాలు:

మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్ , అనుప్పూర్ జిల్లాలలో ఉన్న  దామిని, ఖైరాహా, రాజేంద్ర, నవ్‌గావ్ భూగర్భ గనుల నుండి భూగర్భ జలాలు సరాఫా నదిలోకి విడుదల చేస్తున్నారు. నదిలోకి విడుదల చేసే ముందు గని నుంచి వెలువడిన నీటిని  సరాఫా ఆనకట్ట వద్ద దశల వారీ వడపోత ప్రక్రియల ద్వారా శుద్ధి చేస్తున్నారు. శుద్ధి చేసిన నీటిని గనుల పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ అవసరాలకు ఉపయోగిస్తున్నారు. . అదనంగా, తొమ్మిది లక్షల లీటర్ల స్థూల సామర్థ్యంతో రెండు ఫిల్ట్రేషన్ ప్లాంట్లు కూడా ఏర్పాటు అయ్యాయి. ఈ కార్యక్రమాల వల్ల  పొరుగు గ్రామాలైన ఖన్నాత్, చిర్హితిలో 5000 మంది నివాసితులకు ప్రయోజనం చేకూరుతుంది.

ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థలు బాధ్యతాయుతమైన , స్థిరమైన మైనింగ్ పద్ధతులు అమలు చేస్తున్నాయి.గనిలో ఉపయోగించిన నీటిని శుద్ధి  చేసి ప్రజల తాగు నీటి అవసరాలు తీర్చిడంతో పాటు  పర్యావరణ పరిరక్షణకు సంస్థలు కృషి చేస్తున్నాయి. 

 

***

 



(Release ID: 1961211) Visitor Counter : 92