శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

శాంతి స్వరూప్ భట్నాగర్ జాతీయ అవార్డులు అందజేశారు


82వ సీ ఎస్ ఐ ఆర్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని సందేశం పంపారు

Posted On: 26 SEP 2023 7:54PM by PIB Hyderabad

45 ఏళ్లలోపు ప్రముఖ శాస్త్రవేత్తలకు శాంతి స్వరూప్ భట్నాగర్ జాతీయ అవార్డులను కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) సైన్స్ & టెక్నాలజీ; పీఎంవో, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్లు, అణుశక్తి మరియు అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూ ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేశారు.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందేశంలో శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతి విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 82వ సీ ఎస్ ఐ ఆర్ వ్యవస్థాపక దినోత్సవాన్ని విజయవంతం చేసినందుకు సీ ఎస్ ఐ ఆర్ సిబ్బంది కి  తన అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలిపారు.

 

డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రధానమంత్రి  సందేశాన్ని చదివి వినిపించారు.

 

సమాజం, పరిశ్రమలు మరియు దేశానికి సేవ చేయడంలో సీ ఎస్ ఐ ఆర్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నందుకు ముఖ్యంగా, అరోమా మిషన్, పూల పెంపకంలో పురోగతి, జమ్మూ మరియు కాశ్మీర్‌లో లావెండర్ సాగు ద్వారా ఊదా విప్లవం, దేశ సరిహద్దు ప్రాంతాలలో స్టీల్ స్లాగ్ రోడ్లు వేయడం వంటివి జాతీయ ఆకాంక్షలను నెరవేర్చడంలో సీ ఎస్ ఐ ఆర్ యొక్క సహకారానికి కొన్ని ఉదాహరణలు అని  ప్రధాన మంత్రి  ప్రశంసించారు.

 

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి దూరదృష్టితో కూడిన నాయకత్వంలో, భారతదేశాన్ని విశ్వ సాంకేతిక కేంద్రం గా మార్చడానికి అమృత్‌కాల్‌లోని ఎస్ టీ ఐ ప్రయాణానికి సీ ఎస్ ఐ ఆర్ ప్రధాన ఆధారం కాగలదని మరియు 2042లో సీ ఎస్ ఐ ఆర్ యొక్క 100వ సంవత్సరం 2047లో భారతదేశం స్వాతంత్ర్యం యొక్క 100వ సంవత్సరపు కీర్తిని ప్రేరేపిస్తుందని  అన్నారు.

 

2047 వరకు మన స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే కాలం, బలమైన, అందరినీ కలుపుకొని, స్వావలంబనతో కూడిన భారతదేశాన్ని నిర్మించాలనే దృక్పథాన్ని సాకారం చేసే ఒక అవకాశం అని ఈ సందర్భంలోనే సీ ఎస్ ఐ ఆర్ వంటి సంస్థల పాత్ర మరింత ఔచిత్యాన్ని పొందుతుందని సీ ఎస్ ఐ ఆర్ అధ్యక్షుడు కూడా అయిన ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. 

 

చంద్రయాన్-3 విజయవంతమైన తర్వాత సీ ఎస్ ఐ ఆర్ 82వ వ్యవస్థాపక దినోత్సవానికి ప్రత్యేక ఔచిత్యం ఉంది, ఎందుకంటే ఈ మిషన్‌ కోసం గణనీయమైన కృషి చేసిన అనేక సంస్థలలో సీ ఎస్ ఐ ఆర్ కూడా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. మన అంతరిక్షం మరియు సైన్స్ ఆవరణం యొక్క అలుపెరగని ప్రయత్నాలు ఆకాశం కూడా మనకు హద్దు కాదని ప్రపంచానికి చాటిచెప్పాయని ఆయన అన్నారు. అన్ని వనరులను అందించడం ద్వారా మరియు చురుకైన మరియు అనుకూలమైన పరిశోధన పర్యావరణ వ్యవస్థను పెంపొందించడం ద్వారా శాస్త్రవేత్తల ప్రయత్నాలను పూర్తి చేయడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ మ‌న దేశం మరియు మన ప్ర‌జ‌లు ఎప్పుడూ వైజ్ఞానిక ధోర‌ణితో, వివేచించే మ‌న‌స్సుతో ఆశీర్వదించబడ్డారు. ముఖ్యంగా మహమ్మారి సమయంలో  ప్రపంచ హితం కోసం పని చేయడానికి మన శాస్త్రవేత్తలు మరియు సాంకేతిక నిపుణులు చేసిన పరిశోధన మరియు ఆవిష్కరణల వేగం మరియు స్థాయి మన అపరిమిత సామర్థ్యాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని ఒప్పించాయని ఆయన అన్నారు.

 

శతాబ్దాలుగా అంతర్లీనంగా అనిపించే సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో మరియు కొత్త సామర్థ్యాన్ని వెలికితీయడంలో సైన్స్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. వైద్యం, కమ్యూనికేషన్, అంతరిక్షం, రవాణా, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం లేదా విజ్ఞానం వంటి ప్రతి  రంగాన్ని మార్చేందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయపడిందని ఆయన అన్నారు. గత పదేళ్లలో సాధించిన సాంకేతిక విజయాలను ప్రదర్శించే సీ ఎస్ ఐ ఆర్ యొక్క మెగా-ఎగ్జిబిషన్ అందరికి స్ఫూర్తినిస్తుందని ఆయన అన్నారు.

 

శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతి విజేతలందరికీ ప్రధాన మంత్రి తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు మరియు 82వ సీ ఎస్ ఐ ఆర్ వ్యవస్థాపక దినోత్సవాన్ని విజయవంతం చేసినందుకు సీ ఎస్ ఐ ఆర్ తో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ తన అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.

 

సీ ఎస్ ఐ ఆర్ ఉపాధ్యక్షుడు కూడా అయిన డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, భారతదేశం ఎస్ & టీ సారథ్యం వహించే విధానం మరియు సామాజిక ఆర్థిక వృద్ధికి సంబంధించిన జాతీయ ఆకాంక్షలను మాత్రమే కాకుండా ప్రపంచ సమస్యలను కూడా పరిష్కరించే విధానంలో సమూల మార్పులను చూస్తోందని అన్నారు.

 

సీ ఎస్ ఐ ఆర్ యొక్క కొన్ని అద్భుతమైన విజయాలు మరియు చొరవలను ప్రస్తావిస్తూ, డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, కార్బన్ క్యాప్చర్, యుటిలైజేషన్ మరియు స్టోరేజ్ మిషన్ అనేది కార్బన్ ఉద్గారాలను తగ్గించడం మరియు వాతావరణ మార్పులను తగ్గించడం అనే  ప్రపంచ తీవ్ర సవాలును పరిష్కరించడానికి సీ ఎస్ ఐ ఆర్ చేపట్టిన మార్గదర్శక కార్యక్రమం. సీ ఓ 2 క్యాప్చర్, వినియోగం మరియు నిల్వకు సంబంధించిన వినూత్న సాంకేతికతలు మరియు పరిష్కారాలను అభివృద్ధి చేయడంపై మిషన్ దృష్టి సారిస్తుందని ఆయన అన్నారు. "సిఎస్ఐఆర్ ఈ మిషన్ గురించి చర్చిస్తున్న ముఖ్య వాటాదారులలో అదానీ, రిలయన్స్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్‌టిపిసి, జెఎస్‌డబ్ల్యు స్టీల్ తదితరాలు ఉన్నాయి" అని మంత్రి తెలిపారు.

 

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, గత సంవత్సరం ప్రారంభించిన సీ ఎస్ ఐ ఆర్ హైడ్రోజన్ టెక్నాలజీ మిషన్ పరిశ్రమ నిపుణులతో సంప్రదించి హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ మరియు వినియోగాన్ని  లక్ష్యంగా పెట్టుకుంది. గ్రీన్ ఎనర్జీ క్యారియర్‌గా హైడ్రోజన్ యొక్క పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం మరియు పరిశుభ్రమైన మరియు మరింత స్థిరమైన భవిష్యత్తుకు దోహదం చేయడం సీ ఎస్ ఐ ఆర్ లక్ష్యం.

 

సిఎస్‌ఐఆర్ యొక్క మరొక ముఖ్యమైన చొరవ సికిల్ సెల్ అనీమియాపై మిషన్ మోడ్ ప్రాజెక్ట్ అని, ఇది సమగ్ర వ్యాధి నిర్వహణ అనే సుదూర లక్ష్యాన్ని కలిగి ఉందని, భవిష్యత్తులో వ్యాధి భారాన్ని తగ్గించడం మరియు రోగుల జీవన నాణ్యతను పెంచడం అనే విస్తృత లక్ష్యంతో పనిచేస్తోందని మంత్రి చెప్పారు.

 

ఫైటోఫార్మాస్యూటికల్ మిషన్, యాంటీవైరల్ మిషన్, లి-అయాన్ బ్యాటరీలను రీసైక్లింగ్ చేయడం మరియు కీలకమైన రసాయనాలు మరియు లోహాలను తిరిగి పొందడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్ మెటీరియల్స్ వంటి కొత్త కార్యక్రమాలు ప్రశంసనీయమని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. "ఈ ప్రయత్నాలలో సీ ఎస్ ఐ ఆర్ చాలా ఉత్తమంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అమృత్ కాల్ సమయంలో అన్ని సవాళ్లను అద్భుతమైన అవకాశాలుగా సీ ఎస్ ఐ ఆర్ చూస్తుందని నేను విశ్వసిస్తున్నాను" అని ఆయన అన్నారు.

 

డాక్టర్ జితేంద్ర సింగ్ సీ ఎస్ ఐ ఆర్ ప్రయోగశాలల సహకారం చాలా మరియు వైవిధ్యంగా ఉందని, అయితే చాలా కొద్దిమందికి మాత్రమే దీని గురించి తెలుసునని మరియు ఈ కారణంగానే గత సీ ఎస్ ఐ ఆర్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా, “ఒక వారం ఒక ల్యాబ్”చొరవ అన్ని అనుబంధ ల్యాబ్ లలో అమలు చేయాలని ఆయన సీ ఎస్ ఐ ఆర్ నాయకత్వాన్ని కోరారు. ”   "మన స్వంత మరియు శక్తివంతమైన మొదటి మహిళా డీ జీ డాక్టర్ కలైసెల్వి గారి నేతృత్వంలో,  గత ఏడాది కాలంగా  ఓ డబ్ల్యూ ఓ ఎల్ ప్రోగ్రామ్‌కు కొత్త కోణాన్ని అందించారు" అని ఆయన చెప్పారు.

 

సీఎస్ఐఆర్ ల్యాబ్‌ల వైభవాన్ని, సామర్థ్యాలను తొలిసారిగా సీఎస్‌ఐఆర్‌లో వాటాదారులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు చూశారని మంత్రి అన్నారు. వివిధ వాటాదారులు, పరిశ్రమలు, లైన్ మినిస్ట్రీలు, ఎం ఎస్ ఎం ఈ లు, స్టార్టప్‌లు, కళాకారులు, పరిశోధకులు, కళాశాలలు మరియు పాఠశాల పిల్లలు మొదలైన వారికి సాంకేతిక పురోగతులు మరియు సీ ఎస్ ఐ ఆర్ ల్యాబ్‌ల ఆవిష్కరణల గురించి అవగాహన కల్పించడంలో ఇది సహాయపడిందని ఆయన తెలిపారు. .

 

డాక్టర్ జితేంద్ర సింగ్ సీ ఎస్ ఐ ఆర్ నాయకత్వాన్ని ఓ డబ్ల్యూ ఓ ఎల్ తరహాలో నిజమైన సమగ్ర పద్ధతిలో అంశం లేదా రంగం తో వ్యవహరించే అన్ని సంస్థలను కలపడం ద్వారా "ఒక వారం-ఒక థీమ్" పథకాన్ని రూపొందించాలని కోరారు, 

 

సీ ఎస్ ఐ ఆర్ మరియు సీ ఎస్ ఐ ఆర్, డీ జీ డాక్టర్ ఎన్. కళైసెల్వి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సీ ఎస్ ఐ ఆర్ తన పరిధిని  సీ ఎస్ ఐ ఆర్ విజన్-2030 ప్రకటన తర్వాత విస్తరింపజేస్తుందని మరియు  త్వరలో సీ ఎస్ ఐ ఆర్ శతాబ్ది సంవత్సరాన్ని జరుపుకోవడానికి సీ ఎస్ ఐ ఆర్ విజన్ -2042ను కూడా పెద్ద ఎత్తున ప్రారంభిస్తుందని చెప్పారు. సీ ఎస్ ఐ ఆర్ యొక్క రెండు విజన్‌లు ప్రధానమంత్రి 2047లో అభివృద్ధి చెందిన భారతదేశం ఆకాంక్ష కు సంపూర్ణంగా సరిపోతాయని ఆమె అన్నారు.

 

ఓ డబ్ల్యూ ఓ ఎల్ చొరవను భారీ విజయవంతం చేయడంలో సీ ఎస్ ఐ ఆర్ డైరెక్టర్లు మరియు  ఎస్ & టీ ప్రయోగశాలల సిబ్బంది అంకితభావంతో చేసిన కృషికి పరాకాష్టను ఈ రోజు మనం చూస్తున్నాం అని డాక్టర్ కలైసెల్వి అన్నారు.

 

అంతరిక్ష శాఖ కార్యదర్శి మరియు ఇస్రో ఛైర్మన్ డాక్టర్ ఎస్. సోమనాథ్ తన వ్యవస్థాపక దినోత్సవ ప్రసంగంలో, భారతదేశ అంతరిక్ష కార్యక్రమం ఇప్పుడు సామాజిక ప్రయోజనాల కోసం ఎక్కువగా ఉపయోగించబడుతుందని అన్నారు. అతను సంక్షిప్త ప్రదర్శన ద్వారా భారతదేశ అంతరిక్ష మిషన్ల సుదూర లక్ష్యాన్ని కూడా వివరించారు.

 

భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్, ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ తన ప్రసంగంలో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులు మరియు ఇతర సైన్స్ అవార్డుల హేతుబద్ధీకరణ గురించి మాట్లాడారు. జాతీయ సాంకేతిక దినోత్సవమైన మే 11న అవార్డులను ప్రకటిస్తామని, చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ దిగిన రోజు ఆగస్టు 23న అవార్డులను అందజేస్తామని ఆయన తెలియజేశారు. 

 

ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులను కూడా విజేతలకు కేంద్ర మంత్రి అందజేశారు. 

 

***


(Release ID: 1961143) Visitor Counter : 165


Read this release in: English , Urdu , Hindi , Marathi