రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ఎన్ హెచ్ ఏ ఐ చర్యలు తీసుకుంటుంది

Posted On: 26 SEP 2023 5:13PM by PIB Hyderabad

వ్యాపార సౌలభ్యాన్ని మరింత మెరుగుపరచడానికి మరియు నిర్మాణ నాణ్యతను మెరుగుపరచడానికి, ఎన్ హెచ్ ఏ ఐ ఛైర్మన్, శ్రీ సంతోష్ కుమార్ యాదవ్, జాతీయ రహదారుల నిర్మాణం లో గుంతలు లేని జాతీయ రహదారులను నిర్ధారించడానికి అత్యధిక నాణ్యతా ప్రమాణాలను పాటించేలా నేషనల్ హైవేస్ బిల్డర్ ఫెడరేషన్ ప్రతినిధులతో సమావేశానికి నాయకత్వం వహించారు.

 

డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీలో ప్రమాణాలను మెరుగుపరచాల్సిన అవసరం, డిజైన్ లోపాలను గుర్తించి సరిచేయడానికి మరియు ప్రణాళికలను మెరుగుపరచడానికి మరియు నష్టాలను తగ్గించడానికి ప్రాజెక్ట్ బృందాలను సన్నద్ధం చేయడం గురించి,  అడ్డంకులను తొలగించడం మరియు సిస్టమ్ మెరుగుదలను అందించడం ద్వారా కార్యాచరణ సామర్థ్యాన్ని ప్రోత్సహించడంపై కూడా ప్రాధాన్యత ఇవ్వబడింది. ఈ చర్యలు జాతీయ రహదారులపై భద్రత మరియు వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి నాణ్యత మరియు నిర్మాణం యొక్క ఉన్నత ప్రమాణాలను నెలకొల్పడానికి సహాయపడతాయి.

 

వ్యాపారాన్ని సులభతరం చేయడానికి మరియు లబ్దిదారులందరితో మెరుగైన పని సంబంధాలను సులభతరం చేయడానికి ఎన్ హెచ్ ఏ ఐ కట్టుబడి ఉంది. పరిశ్రమ సంస్థలు చేసిన సూచనలను అమలు చేయడానికి అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు చొరవ తీసుకుంటుంది.  ప్రాజెక్ట్‌ల కోసం నాణ్యతా ప్రమాణాలు మరియు అభ్యాసాలను మెరుగుపరచడానికి కన్సెషనర్లు, కాంట్రాక్టర్లు మరియు కన్సల్టెంట్‌లకు ఎన్ హెచ్ ఏ ఐ మద్దతు ఇస్తుంది.

 

***


(Release ID: 1961100) Visitor Counter : 135
Read this release in: English , Urdu , Hindi , Punjabi