మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విశాఖపట్నంలోని ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియాలో కొత్తగా పునర్నిర్మించిన మెరైన్ మ్యూజియాన్నిమత్స్య, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పర్షోత్తం రూపాలా మరియు పార్లమెంటు సభ్యుడు శ్రీ జి.వి.ఎల్. నరసింహారావు నిన్న ప్రారంభించారు.


శ్రీ పర్షోత్తం రూపాలా మత్స్య శాఖ అనుబంధ కార్యాలయాల కార్యకలాపాలను సమీక్షించారు

శ్రీ పర్షోత్తం రూపాలా పలువురు మత్స్య పరిశ్రమ ప్రతినిధులు, సముద్ర ఆహార ఎగుమతిదారుల సంఘాలు, హేచరీ యజమానులు, పారిశ్రామికవేత్తలు మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చించారు.

Posted On: 26 SEP 2023 4:39PM by PIB Hyderabad

విశాఖపట్నంలోని ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియాలో 250కి పైగా భద్రపరచబడిన నమూనాలను ఉంచిన నూతనంగా పునర్నిర్మించిన మెరైన్ మ్యూజియాన్ని మత్స్య, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పర్షోత్తం రూపాలా మరియు పార్లమెంటు సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు శ్రీ జి.వి.ఎల్. నరసింహారావు నిన్న ప్రారంభించారు. మ్యూజియంలోని  ఆధునిక సాంకేతికతతో (క్యూఆర్ కోడింగ్ వంటివి) నమూనాలు ప్రదర్శించబడ్డాయి. దీనిలో పూర్తి సమాచారాన్ని కేవలం ఒక క్లిక్‌తో పొందవచ్చు.  ఇది సైన్స్ విద్యార్థులకు, పరిశోధనలకు మరియు ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

 

శ్రీ పర్షోత్తం రూపాలా మరియు శ్రీ జి.వి.ఎల్. నరసింహారావుకు విశాఖపట్నం బేస్ ఆఫ్ ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా వద్ద డైరెక్టర్ జనరల్, ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా, ముంబై, డాక్టర్ ఆర్. జయభాస్కరన్ మరియు ఎం ఎం ఈ / హెడ్ ఆఫ్ ఆఫీస్, ఎఫ్ ఎస్ ఐ, విశాఖపట్నం, శ్రీ డీ. భామి రెడ్డి నిన్న స్వాగతం పలికారు. తొలుత కేంద్ర మంత్రి ఫిషరీస్ శాఖ ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ నాటికల్ & ఇంజనీరింగ్ ట్రైనింగ్ మరియు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ & ట్రైనింగ్ యొక్క అనుబంధ కార్యాలయాల కార్యకలాపాలను సమీక్షించారు. ఈ సమావేశానికి ఆఫీస్ హెడ్‌తో పాటు ముగ్గురు డిపార్ట్‌మెంట్ హెడ్‌లు హాజరయ్యారు. ఆయన మూడు సంస్థల అధికారులతో సంభాషిస్తూ చర్చించిన సమస్యలను వెంటనే మంత్రిత్వ శాఖకు పంపాలని తెలియజేశారు.

 

తదనంతరం, శ్రీ పర్షోత్తం రూపాలా  మత్స్య పరిశ్రమ, సముద్ర ఆహార ఎగుమతిదారుల సంఘాలు, హేచరీ యజమానులు, పారిశ్రామికవేత్తలు మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పలువురు ప్రతినిధులతో చర్చలు జరిపారు, ఇందులో 40 మందికి పైగా ప్రతినిధులు పాల్గొని చేపల ఉత్పత్తులను ఎగుమతి చేయడంలో వారి ఇబ్బందులను వివరించారు. సముద్ర ఆహార ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు పరిశ్రమకు నిరంతరం మద్దతు ఇస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్, విశాఖపట్నం బేస్‌లోని ఆఫీస్ హెడ్ డాక్టర్. ఆర్. జయభాస్కరన్, కొచ్చిలోని సిఫ్‌నెట్ డైరెక్టర్ శ్రీ డి. భామి రెడ్డి, కోచి, శ్రీ ఎం హబీబుల్లా మరియు సిఎస్, ఎన్‌ఐఎఫ్‌పిహెచ్‌టి డైరెక్టర్ డాక్టర్ షైన్ కుమార్ పాల్గొన్నారు.

 

****


(Release ID: 1961098) Visitor Counter : 134


Read this release in: English , Urdu , Hindi , Tamil