గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
స్వచ్చతలో తెలంగాణ ముందంజ
Posted On:
26 SEP 2023 5:13PM by PIB Hyderabad
చెత్త రహిత భారతదేశం నిర్మాణ కల సాకారం కోసం గత తొమ్మిది సంవత్సరాలుగా అమలు జరుగుతున్న స్వచ్ఛ భారత్ మిషన్ లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. స్వచ్ఛ భారత్ నిర్మాణం కోసం తరలి రావాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు స్పందించిన ప్రజలు, ప్రజా సంఘాలు, నగరాలు, పట్టణాలు, గ్రామ పంచాయతీలు, ప్రైవేటు సంస్థలు స్వచ్చందంగా ముందుకు వచ్చి స్వచ్ఛతా కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. 2023 అక్టోబర్ 1వ తేదీన సామూహిక స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఒక్కరూ ఒక్క రోజు గంట సేపు సామూహికంగా స్వచ్ఛత కోసం కృషి చేయాలంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ 'ఏక్ తారీఖ్, ఏక్ ఘంటా, ఏక్ సాత్' పిలుపు ఇచ్చారు. ఇప్పటికీ అమలు జరుగుతున్న స్వచ్ఛత పక్షోత్సవాలు 2023లో లక్షలాది మంది ప్రజలు పాల్గొంటున్నారు. కార్యక్రమంలో 13 కోట్ల మంది ప్రజలు పాల్గొన్నారు. 2023 సెప్టెంబర్ 15 న ప్రారంభమైన స్వచ్ఛత పక్షోత్సవాలు స్వచ్ఛ భారత్ దినోత్సవం అయిన అక్టోబర్ 2 వరకు అమలు జరుగుతాయి. స్వచ్ఛత పక్షోత్సవాలు విజయవంతం చేయడానికి తెలంగాణాలో ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున స్వచ్ఛత కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. స్వచ్ఛత పక్షోత్సవాల్లో భాగంగా అన్ని వర్గాలకు చెందిన పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. తమ పరిసర ప్రాంతాలను శుభ్రం చేసిన పెద్దలు, పిల్లలు స్వచ్ఛతకు తాము ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరిగిన స్వచ్ఛత కార్యక్రమాల్లో 21 లక్షలకు పైగా ప్రజలు స్వచ్చందంగా పాల్గొన్నారు. ప్రజాసంస్థలు, బహిరంగ ప్రదేశాలు, మార్కెట్ స్థలాలు మొదలైన వాటిలో శ్రమదానం చేశారు.అవగాహన కార్యక్రమాలలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.గ్రామాలు, తమ చుట్టుపక్కల ప్రాంతాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణలో చురుకుగా పాల్గొన్నారు.కార్యక్రమంలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛత పై అవగాహన కల్పించారు. వ్యర్థ పదార్థాల నిర్వహణ, వ్యర్థాలను సక్రమంగా పారవేయడం, మూలం వద్ద వ్యర్థాల విభజన , సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వినియోగించక పోవడం , తగ్గించడం మరియు పునర్వినియోగం చేయడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. జనపనార, పత్తి, గుడ్డతో చేసిన సంచులు వంటి వాటిని ప్రత్యామ్నాయంగా ఉపయోగించడం ప్రారంభించారు. . స్వచ్ఛతను సాధించడమే కాకుండా పర్యావరణాన్ని కూడా పరిరక్షించేందుకు తమ వంతు సహకారాన్ని ప్రజలు అందిస్తున్నారు. స్వచ్ఛత పై జరిగిన అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రజలు స్వచ్ఛత ప్రతిజ్ఞ స్వీకరించి , స్వచ్ఛత ర్యాలీల్లో పాల్గొన్నారు.

స్వచ్ఛతా హి సేవా 2023 కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 1,874 పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన శిబిరాలు, పారిశుద్ధ్యంపై 2,048 వార్డు స్థాయి కార్యక్రమాలు జరిగాయి. . ఇప్పటి వరకు 380 జివిపి పాయింట్లలో మొత్తం 314 జివిపి పాయింట్లు శుభ్రం అయ్యాయి. పరిశుభ్రతను కొనసాగించడానికి సంబంధిత జివిపి ప్రాంతాలలో ప్రత్యేక సేకరణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ఈ 314 జివిపి పాయింట్లను ఐఇసి పాయింట్లుగా మారుస్తామని రాష్ట్రం ప్రకటించింది.నివాస ప్రాంతాల చుట్టూ ఉన్న 1,072 ప్రాంతాలు, 117 పబ్లిక్ పార్కులు కూడా శానిటైజ్ చేయబడ్డాయి. NCC/NSS విద్యార్థులు, మహిళా స్వయం సహాయక బృందాల సభ్యుల సహాయంతో ప్రజా మరుగుదొడ్లను శుభ్రం చేశారు.స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 కింద నిర్దేశించబడిన 2026 నాటికి చెత్త రహిత నగరాల లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్రాలు తీవ్ర స్థాయిలో కృషి సాగిస్తున్నాయి. స్వచ్ఛత కోసం ప్రారంభమైన ప్రజా ఉద్యమం ఇప్పుడిప్పుడే ఊపందుకోబోతోంది.

(Release ID: 1961097)
Visitor Counter : 185