రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

న్యూ ఢిల్లీలోని బీఆర్ఓ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన రక్షణ శాఖ మంత్రి శ్రీ అజయ్ భట్


-మనాలిలో బీఆర్ఓ కేఫ్‌ను ఈ-విధానంలో ప్రారంభించిన మంత్రి

Posted On: 26 SEP 2023 5:24PM by PIB Hyderabad

రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ 26 సెప్టెంబర్ 2023న న్యూ ఢిల్లీలోని డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ రోడ్స్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి వివిధ పుస్తకాలు, మరియు సంకలనాలను విడుదల చేశారు- 'నేషన్స్ బ్రో: లుకింగ్ ఎహెడ్', ఉత్తరాఖండ్‌లోని వివిధ నిర్మాణ పనులకు సంబంధించి బీఆర్ఓ రచనల సంకలనం, బీఆర్ఓ ద్వారా ప్రపంచ రికార్డుల స్థాపనపై ప్రత్యేక డే కవర్, వీర్ గాథ - బీఆర్ఓ యొక్క హీరోలపై పుస్తకం, హై ఆల్టిట్యూడ్ సంబంధిత సమస్యలపై  మెడికల్ హ్యాండ్‌బుక్. ఆర్ఆర్ఎం మనాలిలో బీఆర్ఓ కేఫ్‌ను కూడా ఇ-విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్ష రాజ్య మంత్రి మాట్లాడుతూ వ్యూహాత్మక రహదారులు, హైవేల నిర్మాణంలో గణనీయమైన పెరుగుదల ఉందని, ఇది BRO సిబ్బంది యొక్క అవిశ్రాంత కృషికి నిదర్శనమన్నారు. ఈ రహదారులు మన సాయుధ బలగాల సాఫీగా ప్రయాణించడమే కాకుండా స్థానిక నివాసితులకు వాణిజ్యం, పర్యాటకం మరియు అనుసంధానతను ప్రోత్సహిస్తాయని అన్నారు. "దూరపు కొండ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ఫలితంగా ఇంతకుముందు అందుబాటులో లేని ఈ అందమైన ప్రదేశాలను సందర్శించే పర్యాటకుల సంఖ్య కూడా పెరిగింది. ఈ రహదారులపై పర్యాటకులకు స్నేహపూర్వక మరియు సురక్షితమైన రవాణాను అందించడానికి ఈ ప్రాంతాల్లోని ప్రధాన టూరిస్ట్ సర్క్యూట్‌ల వెంట సౌకర్యాలు మరియు ప్రాథమిక వైద్య సదుపాయాలను అందించే మల్టీ యుటిలిటీ కేఫ్‌లను ఏర్పాటు చేయవలసిన అవసరం ఏర్పడిందన్నారు. మనాలిలో బీఆర్ఓ కేఫ్‌ని నిర్మించడం ద్వారా బీఆర్ఓ ఈ అంశంలో ప్రముఖ పాత్ర పోషించింది అని అన్నారు బీఆర్ఓ తన పరిధిని మరియు కార్యకలాపాలను విస్తరించినందుకు ఆర్ఆర్ఎంని అభినందించారు. బీఆర్ఓ కేవలం రోడ్లు మరియు వంతెనలను నిర్మించడమే కాకుండా ఎయిర్‌ఫీల్డ్‌లు, సొరంగాలు, హెలిప్యాడ్‌లు, 3-డీ ప్రింటెడ్ భవనాలు, కార్బన్ న్యూట్రల్ రెసిడెన్స్ మొదలైన వాటిపై కూడా పనిచేస్తుందని ఆర్ఆర్ఎం తెలిపింది. "కొత్త ఆలోచనలను స్వీకరించడం ఎల్లప్పుడూ పురోగతి యొక్క ముఖ్య లక్షణం, మరియు బీఆర్ఓ  అత్యాధునిక సాంకేతికతలను స్వీకరించడం దాని దూరదృష్టిని ప్రతిబింబిస్తుంది" అని ఆయన అన్నారు.  77వ స్వాతంత్ర్య దినోత్సవ శుభ సందర్భంగా ఉమ్లింగ్ లా పాస్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటారు రహదారిని నిర్మించడం మరియు లడఖ్‌లోని లిక్రు - మిగ్లా - ఫక్చే పనులను ప్రారంభించినందుకు రక్షణ శాఖ సహాయ మంత్రి  బీఆర్ఓని అభినందించారు. సరిహద్దు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, దేశంలోని మారుమూల మరియు సుదూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు జీవన సౌలభ్యం కల్పించడంలో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చౌదరి నాయకత్వంలో బీఆర్ఓ పోషించిన పాత్రను కూడా ఆయన ప్రశంసించారు.

****



(Release ID: 1961095) Visitor Counter : 103


Read this release in: English , Urdu , Hindi , Marathi