సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

30 నెలలు పట్టే పని ఆర్ నెలల్లో పూర్తి


జీ-20 సదస్సు కోసం రికార్డ్ సమయంలో పూర్తైన నటరాజ విగ్రహం

క్లిష్టమైన పని పూర్తి చేయడంలో నటరాజు స్ఫూర్తి ఇచ్చారు.. కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్
‘నటరాజ’ విభిన్న కోణాలు, చైతన్యం గురించి వివరాయించిన పద్మభూషణ్ డాక్టర్ పద్మ సుబ్రహ్మణ్యం

"విశ్వశక్తికి మూలం నటరాజు' అనే అంశంపై సదస్సు నిర్వహించిన ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్(ఐజిఎన్‌సిఎ)

Posted On: 26 SEP 2023 8:56AM by PIB Hyderabad

'నటరాజ' శక్తికి ప్రతిరూపం. విశ్వం సృష్టికి మూలం శివుడు. విశ్వాన్ని రక్షించేది శివుడు.విశ్వాన్ని నాశనం చేసేవాడు శివుడు అని ఒకే చిత్రంలో నటరాజ విగ్రహం తెలియజేస్తుంది. కాలచక్రం పట్ల  భారతీయ అవగాహననునటరాజ విగ్రహం వెల్లడిస్తుంది.  కళా ప్రపంచంలో  నటరాజ విగ్రహంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.  విమర్శకులు నటరాజ విగ్రహాన్ని ఆధునిక అద్భుతంగా , కళాత్మక శ్రేష్ఠతకు శాశ్వత చిహ్నంగా అభివర్ణించారు. ఈ ప్రసిద్ధ కళాఖండం నిర్మాణం,   అందం, అతీంద్రియ శక్తిని స్వయంగా తెలుసుకోవడానికి వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు తరలి వచ్చారు. జీ-20 సదస్సు సందర్భంగా ఏర్పాటైన నటరాజ విగ్రహం రూపకల్పనలో ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్(ఐజిఎన్‌సిఎ) కీలక పాత్ర పోషించింది. జీ-20 సదస్సు జరిగిన  భారత్ మండపంలో 'నటరాజ' విగ్రహాన్ని ప్రతిష్టించారు.  యువ తరానికి ‘నటరాజ’పై అవగాహన కల్పించడానికి, చర్చించడానికి, ప్రసంగించడానికి, వ్యాప్తి చేయడానికి డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో "విశ్వశక్తికి మూలం నటరాజు' అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో అద్భుతమైన కళాఖండంగా  నటరాజ విగ్రహాన్ని తయారు చేసిన వారిని సన్మానించారు.  

సదస్సులో  పద్మభూషణ్ డాక్టర్  పద్మా సుబ్రహ్మణ్యం, పద్మవిభూషణ్ డాక్టర్ . సోనాల్ మాన్‌సింగ్ (ఎంపీ, రాజ్యసభ), ఐజిఎన్‌సిఎ ట్రస్ట్ ప్రెసిడెంట్ శ్రీ రాంబహదూర్ రాయ్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్, ఏఐఎఫ్ఏసిఎస్ చైర్మన్ శ్రీ బిమన్ బిహారీ దాస్,  ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్  సంజీవ్ కుమార్ శర్మ, నటరాజ విగ్రహం తయారీదారు   శ్రీ రాధా కృష్ణ స్థపతి, తమిళనాడుకు చెందిన శ్రీ   స్వామి మలై,ఎన్జీఎంఏ మాజీ డైరెక్టర్ జనరల్  శ్రీ అద్వైత గడ్నాయక్, ప్రముఖ శిల్పి   శ్రీ అనిల్ సుతార్,  ఐజిఎన్‌సిఎ సభ్య కార్యదర్శి   డాక్టర్ సచ్చిదానంద్ జోషి, 200 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రజలు, సంస్కృతి ఔత్సాహికులు కార్యక్రమానికి హాజరయ్యారు. 

 నటరాజ విగ్రహం  శాస్త్రీయంగా  పదార్థం, శక్తి కలయికగా ఉండే .నటరాజ విగ్రహం ఒక  యంత్రం (రేఖాచిత్రం ఆచార బద్ధంగా పూజించబడుతుంది) అని వివరించారు.  'రూప' ఆరాధన (రూప పూజ) మ 'అరూప' ఆరాధన (అంతరిక్షం  నిరాకార మూలకం  ఆరాధన)  చిదంబరంలోని 'నటరాజ' మందిరం  గర్భగుడిలో కనిపిస్తాయని వివరించారు.తన ప్రసంగంలో డాక్టర్  పద్మా సుబ్రహ్మణ్యం  'నటరాజ' కు సంబంధించిన  విభిన్న కోణాలను సమగ్రంగా వివరించి కార్యక్రమానికి హాజరైన వారిని ఆకట్టుకున్నారు. 

ఐటిపిఒ లో ఏర్పాటైన కార్యక్రమం పట్ల హర్షం వ్యక్తం చేసిన డాక్టర్ సోనాల్ మాన్‌సింగ్  నటరాజ విగ్రహ ప్రతిష్టాపనను ప్రస్తావించారు.  "విశ్వశక్తికి మూలం నటరాజ' అనే అంశంపై జరిగిన సదస్సు భారతీయ విలువలు, విజ్ఞానాన్ని,  సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన సరైన సమాచారాన్నిఅందిస్తుందన్నారు.  

సదస్సులో ప్రసంగించిన శ్రీ గోవింద్ మోహన్ నటరాజ' నిర్మాణానికి సంబంధించి   సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు తానూ అందించిన  సూచనలను తెలిపారు.  మొత్తం ప్రక్రియ సవాలుగా ఉందని పేర్కొన్న శ్రీ గోవింద్ మోహన్  పనిని పూర్తి చేయడానికి  'నటరాజ' ప్రేరణ ఇచ్చారని అన్నారు. . సాంప్రదాయ పద్ధతిలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామని ఆయన తెలిపారు.  ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 'నటరాజ' విగ్రహాన్ని స్థపతి, రాధా కృష్ణ , అతని బృందం,తమిళనాడుకు చెందిన  స్వామి మలై, చేపట్టి పూర్తి చేసిందన్నారు.  సంప్రదాయ   మైనపు పోత ప్రక్రియను తయారీలో పాటించమని ఆయన వివరించారు.  చోళ కాలం , అంటే 9వ శతాబ్దం AD లో నటరాజవిగ్రహ తయారీలో అనుసరించిన శిల్ప శాస్త్రం లో పేర్కొన్న నియమాలు, కొలతలను అనుసరించామని ఆయన వివరించారు. 

నటరాజ విగ్రహం శివునికి ప్రతిరూపంగా, విశ్వ శక్తికి ప్రతీకగా  ఎలా ఉంటుంది అన్న అంశాన్ని డాక్టర్ సచ్చిదానంద్ జోషి  వివరించారు. నటరాజ విగ్రహం లో  కనిపించే  'తాండవ ముద్ర'  సృజనాత్మకత, సంరక్షణ, విధ్వంసం అంశాల  విశ్వ చక్రంగా ఉంటుందన్నారు. ఎవరూ ఊహించని విధంగా  రికార్డు సమయంలో విగ్రహం నిర్మాణం పూర్తి అయ్యిందని ఆయన వివరించారు. 

విగ్రహం తయారీలో పాల్గొన్న తమిళనాడులోని స్వామిమలై కి చెందిన ప్రపంచ వ్యాప్తంగాగుర్తింపు పొందిన  శిల్పి శ్రీ రాధా కృష్ణ స్థపతి ని సన్మానించారు. శ్రీ రాధా కృష్ణ స్థపతి రూపొందించిన కళాఖండాలు  ప్రపంచవ్యాప్తంగా కళాభిమానుల మన్నన పొందాయి.  ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన జీ-20 సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ‘నటరాజ’ విగ్రహం తయారీలో ఆయన కీలక పాత్ర పోషించారు.  27 అడుగుల ఎత్తుతో  సుమారు 18 టన్నుల బరువు గల  నటరాజ విగ్రహం కొలువు తీరింది. స్వామిమలై లో సాంప్రదాయ స్థపతి గ్రంధాలలో పేర్కొన్న విధంగా నియమాలు, కొలతలను అనుసరించి సంప్రదాయ విధానంలో  మైనపు కాస్టింగ్ ప్రక్రియలో విగ్రహాన్ని తయారు చేశారు. స్వామిమలై గుండా ప్రవహించే కావేరి నది నుంచి  విగ్రహం తయారీకి మట్టిని తీసుకువచ్చారు. 

 కళాకృతి ద్వారా ఐక్యత, బలం, దయ గుణాలు  వర్ణించగల కళాకారుడి కోసం జీ-20 నిర్వాహకులు అన్వేషిస్తున్న సమయంలో  శ్రీ రాధా కృష్ణ స్థపతి పేరు ప్రముఖంగా వినిపించింది. విగ్రహ నిర్మాణాన్ని చేపట్టిన  శ్రీ రాధా కృష్ణ స్థపతి దీక్షతో తన ప్రతిభను వెలికి తీసి, శివ తాండవానికి సంబంధించిన  క్లిష్టమైన వివరాలు నిశితంగా అధ్యయనం చేసి  నటరాజ విగ్రహాన్ని సిద్ధం చేశారు. 

 

***

 



(Release ID: 1960949) Visitor Counter : 120