సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

“ఎస్సీలు, ఇతరుల కోసం ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల పథకం, ఎస్సీ విద్యార్థుల కోసం పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల పథకం (పీఎంఎస్-ఎస్సీ)”

Posted On: 25 SEP 2023 3:15PM by PIB Hyderabad

పీఎంఎస్-ఎస్సీ పథకం గురించి: SC విద్యార్థుల కోసం పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం (పీఎంఎస్-ఎస్సీ) అనేది భారతదేశంలోని SC విద్యార్థుల కోసం కేంద్ర ప్రాయోజిత పథకం, దీని తల్లిదండ్రులు/సంరక్షకుల ఆదాయం సంవత్సరానికి రూ.2.5 లక్షలు మించకూడదు.  షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం, పేద కుటుంబాలకు చెందిన వారిపై దృష్టి సారించి ఉన్నత విద్యలో ఎస్సీ విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి (జిఈఆర్) ని  గణనీయంగా పెంచడం ఈ పథకం లక్ష్యం. ఆర్థిక సంవత్సరం 2025-26 వరకు ఉన్నత విద్యలో ఎస్సీల జిఈఆర్ ని 23.0 శాతం నుండి జాతీయ సగటుకు పెంచడం ప్రభుత్వం ప్రయత్నం.

ఎస్సీలు మరియు ఇతరులకు ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల పథకం గురించి: ఎస్సీలు, ఇతరులకు ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల పథకం అనేది షెడ్యూల్డ్ కులాలకు చెందిన పిల్లలు, అపరిశుభ్రమైన, ప్రమాదకరమైన పనులలో నిమగ్నమై ఉన్న తల్లిదండ్రులు/సంరక్షకుల పిల్లలకు ప్రీ-మెట్రిక్ స్థాయిలో అక్షరాస్యత, నిరంతర విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రాయోజిత పథకం. ఈ పథకంలో రెండు భాగాలు ఉన్నాయి, అవి క్రింది విధంగా ఉన్నాయి:

కంపోనెంట్-1: ఎస్సీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ 

 

i. విద్యార్ధి పూర్తి కాలం తొమ్మిది, పదో తరగతి చదువుతూ ఉండాలి.  

ii. షెడ్యూల్డ్ కులానికి చెందినవారై ఉండాలి 

iii. ఆ విద్యార్ధి తల్లిదండ్రులు/సంరక్షకుని ఆదాయం సంవత్సరానికి రెండున్నర లక్షల రూపాయలు దాటకూడదు 

కంపోనెంట్ -2: అపరిశుభ్రమైన, ప్రమాదకరమైన వృత్తిలో నిమగ్నమైన తల్లిదండ్రులు/సంరక్షకుల పిల్లలకు ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ 

  1. విద్యార్ధి పూర్తి కాలం ఒకటో తరగతి నుండి పదో తరగతి చదువుతూ ఉండాలి.

ii. వారి కులం/మతంతో సంబంధం లేకుండా కింది వర్గాలలో ఒకదానికి చెందిన తల్లిదండ్రులు/సంరక్షకుల పిల్లలు/వార్డులకు స్కాలర్‌షిప్ అనుమతించబడుతుంది

ఎ. స్కావెంజర్స్ చట్టం  2013

b. టెనెర్స్ అండ్ ఫ్లయర్స్ 

c. వేస్ట్ పికెర్స్ 

d. మాన్యువల్ స్కావెంజర్స్ చట్టం 2013లోని సెక్షన్ 2(I) (d)లో నిర్వచించిన విధంగా ప్రమాదకర శుభ్రతలో నిమగ్నమైన వ్యక్తులు. 

iii. ఈ కంపోనెంట్ కింద కుటుంబ ఆదాయ పరిమితి ఉండదు 

 

***


(Release ID: 1960769) Visitor Counter : 168