రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

మొట్టమొదటి డ్రోన్ ప్రదర్శన ‘భారత్ డ్రోన్ శక్తి 2023’ని హిందాన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ప్రారంభించిన రక్షణ మంత్రి


భారత వైమానిక దళంలో అధికారికంగా చేరిన మొదటి సి-295 రవాణా విమానం

సి-295 ఐఏఎఫ్ మీడియం లిఫ్ట్ వ్యూహాత్మక సామర్థ్యాన్ని బలపరుస్తుంది: శ్రీ రాజ్‌నాథ్ సింగ్

Posted On: 25 SEP 2023 3:48PM by PIB Hyderabad

భారత్ డ్రోన్ శక్తి 2023, మొట్టమొదటి డ్రోన్ ఎగ్జిబిషన్, ప్రదర్శనను సెప్టెంబర్ 25న ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని హిందాన్‌లోని వైమానిక దళ స్టేషన్‌లో రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. దీనిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్), డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డిఎఫ్ఐ) సంయుక్తంగా నిర్వహించింది. సెప్టెంబరు 25 & 26, 2023 తేదీలలో రెండు రోజుల ఈవెంట్‌లో దేశవ్యాప్తంగా 75 డ్రోన్ స్టార్టప్‌లు పాల్గొంటున్నాయి. 

ఈ ప్రదర్శనలో ఉంచిన డ్రోన్‌లు వివిధ రకాల సైనిక, పౌర అనువర్తనాల కోసం వినియోగిస్తారు. వైమానిక, స్టాటిక్స్ ప్రదర్శనల శ్రేణిలో తమ సామర్థ్యాలను ప్రదర్శించడం ద్వారా, ఐఏఎఫ్, డిఎఫ్ఐ ... 2030 నాటికి భారతదేశాన్ని ఒక ప్రధాన డ్రోన్ హబ్‌గా మార్చడానికి ప్రభుత్వ చొరవను పెంచడానికి ప్రయత్నిస్తాయి.

భారత్ డ్రోన్ శక్తి 2023 ప్రారంభోత్సవం తర్వాత మొదటి సి-295ఎండబ్ల్యూ  రవాణా విమానం ఐఏఎఫ్ లోకి  అధికారికంగా ప్రవేశపెట్టారు. ఈ వేడుకలో 'సర్వ ధర్మ పూజ', విమానం సామర్థ్యాలపై సంక్షిప్త సమాచారం ఉన్నాయి. ఏ మాత్రం సిద్ధంగా లేని ల్యాండింగ్ గ్రౌండ్స్ నుండి టేకాఫ్, ల్యాండింగ్ చేయగల సామర్థ్యం ఉన్న ఈ మీడియం లిఫ్ట్ టాక్టికల్ ఎయిర్‌క్రాఫ్ట్ హెచ్ఎస్-748 అవ్రో విమానానికి సరితూగుతుంది.

ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ఒక పోస్ట్ ద్వారా, సి-295 ఇండక్షన్ ఐఏఎఫ్ మీడియం లిఫ్ట్ వ్యూహాత్మక సామర్థ్యాన్ని బలపరుస్తుందని రక్షణ మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశాన్ని స్వావలంబనగా మార్చడానికి రక్షణ, ఏరోస్పేస్ రంగాలు రెండు ముఖ్యమైన స్తంభాలుగా ఆయన పేర్కొన్నారు.

ఒప్పందం కుదుర్చుకున్న 56 విమానాలలో మొదటి 16 విమానాలు 'ఫ్లై-అవే' కండిషన్‌లో ఐఏఎఫ్ కి అందిస్తారు. మిగిలిన 40 భారతదేశంలో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ వడోదరలోని వారి సదుపాయంలో తయారు చేస్తుంది. విమానంతో కూడిన మొదటి ఐఏఎఫ్ స్క్వాడ్రన్, 11 స్క్వాడ్రన్ (ది రైనోస్) కూడా వడోదరలో ఉంది.

ఈ కార్యక్రమం సందర్భంగా, హైబ్రిడ్ డ్రోన్ డిటెక్షన్ సిస్టమ్, అల్ ఇంజిన్ ఫర్ ఫాల్ట్ డయాగ్నసిస్, ఫ్లై-బై-వైర్ టెస్టర్ వంటి ప్రాజెక్ట్‌లను ప్రదర్శించిన ఎగ్జిబిషన్‌లో రక్షణ  మంత్రి, ప్రముఖులకు ఐఏఎఫ్ తాజా అంతర్గత ఆవిష్కరణల గురించి వివరించడం జరిగింది.  స్టెబిలైజ్డ్ పవర్ సప్లై ట్రాలీలు, క్యూఆర్ కోడ్ ఆధారిత టూల్ క్రిబ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్,  మరియు ఆధునిక బోధనా పరికరాలు ఈ ప్రదర్శనలో ప్రదర్శించారు. 

పౌరయాన, రోడ్డు, రవాణా, హైవేస్ శాఖ సహాయ మంత్రి జనరల్ (డాక్టర్) వీకే సింగ్ (రిటైర్డ్), ఎయిర్ స్టాఫ్ చీఫ్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, త్రిదళాల సీనియర్ అధికారులు, స్నేహపూర్వక దేశాల అధికారులు, భారతీయ పరిశ్రమల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

***



(Release ID: 1960766) Visitor Counter : 148