శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కోవిడ్‌కు మొట్టమొదటి డీ ఎన్ ఏ వ్యాక్సిన్‌తో నివారణ ద్వారా ఆరోగ్య సంరక్షణ ను ఏకీకృతం చేసిన భారతదేశం ప్రపంచానికి ఒక ఆదర్శం, భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా మార్చిన ఘనత ప్రధాని మోదీదే : డాక్టర్ జితేంద్ర సింగ్
జెనోమిక్స్ భారతదేశ ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తును రూపొందించబోతోంది: డాక్టర్ జితేంద్ర సింగ్
భారతదేశ జీవ-ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు $100 బిలియన్లకు పెరిగింది, 2025 నాటికి $150 బిలియన్లను లక్ష్యంగా చేసుకుంటోంది: డాక్టర్ జితేంద్ర సింగ్
భారతదేశ భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థకు బయో-టెక్ స్టార్టప్‌లు కీలకం: డాక్టర్ జితేంద్ర సింగ్
కాశ్మీర్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఐసీఎంఆర్-ఇండియా డయాబెటిస్ మరియు జాయింట్ డయాబెటిస్ ప్రోగ్రామ్‌లో డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగించారు
'జెనోమిక్స్ తో మెరుగైన ఆరోగ్యం' ముగింపు ఉత్సవం లో పాల్గొన్నారు
Posted On:
23 SEP 2023 8:31PM by PIB Hyderabad
నివారణ ద్వారా ఆరోగ్య సంరక్షణ ను ఏకీకృతం చేసిన భారతదేశం ప్రపంచానికి ఒక ఆదర్శం అని సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎం ఓ ఎస్ పీ ఎం ఓ , డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ మరియు డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ మరియు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్ కేంద్ర సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్), డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు అన్నారు, నివారణ ద్వారా ఆరోగ్య సంరక్షణలో సమగ్ర విధానం మరియు కోవిడ్‌కు మొట్టమొదటిసారిగా డీ ఎన్ ఎ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి ఇతర దేశాలకు అందించడానికి భారతీయ శాస్త్రవేత్తలను సాధికారులను చేయడం ద్వారా 'నివారణ ద్వారా ఆరోగ్య సంరక్షణ'లో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా మార్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే చెందుతుందన్నారు.
యువతలో టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ మరియు ఇతర జీవనశైలి రుగ్మతలను నివారించడం యొక్క ప్రాముఖ్యతను కూడా మంత్రి నొక్కిచెప్పారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ కాశ్మీర్ విశ్వవిద్యాలయంలో ఐసిఎంఆర్-ఇండియా డయాబెటిస్ మరియు జాయింట్ డయాబెటిస్ ప్రోగ్రాం మరియు‘జెనోమిక్స్ తో మెరుగైన ఆరోగ్యం’ ముగింపు కార్యక్రమంలో ప్రసంగించారు.
భారతదేశ భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థకు బయోటెక్ స్టార్ట్-అప్‌లు చాలా కీలకమైనవి, ఎందుకంటే ప్రధాని మోదీ దార్శనికత బయోటెక్నాలజీ స్వంత యోగ్యతలు భారతదేశాన్ని ముందుకు నడిపించే సామర్థ్యాన్ని కలిగి ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు,"భారతదేశం యొక్క జీవ-ఆర్థిక వ్యవస్థ 2014లో కేవలం $8 బిలియన్‌గా ఉంది, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో బయోటెక్నాలజీ మరియు జీవ-ఆర్థిక వ్యవస్థ యోగ్యతలను కనీసం 100 బిలియన్ డాలర్లకు పెంచాము, ఇప్పుడు 2025 నాటికి $150 బిలియన్లను లక్ష్యంగా చేసుకున్నాము". డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
జెనోమిక్స్ రంగంలో పురోగతికి ప్రాముఖ్యత కలిగిన అంశాలను పరిశోధించి అత్యంత శాస్త్రీయమైన కార్యక్రమాన్ని రూపొందించినందుకు నిర్వాహకులను డా. జితేంద్ర సింగ్ అభినందించారు. జన్యుశాస్త్రం ఇకపై పరిశోధన రంగానికి మాత్రమే పరిమితం కాదని, ఖచ్చితత్వం మరియు వ్యక్తిగతీకరించిన వైద్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన నొక్కి చెప్పారు. వివిధ రంగాలలో ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణలో జన్యుశాస్త్రం యొక్క పాత్రను అర్థం చేసుకోవడంలో భారతదేశం గణనీయమైన పురోగతిని సాధిస్తోందని ఆయన పేర్కొన్నారు.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ యొక్క ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాలలో ఒకటైన "జెనోమ్ఇండియా" ప్రాజెక్ట్ పోషించిన కీలక పాత్రను హైలైట్ చేస్తూ, ఈ రంగంలో మరింత పరిశోధన మన అవగాహనను మెరుగుపరుస్తుందని చెపుతూ ఈ సందర్భంగా డా. జితేంద్ర సింగ్ ప్రాజెక్ట్‌కి నాయకత్వం వహించిన డాక్టర్ అష్రఫ్ గనీ చొరవ ప్రయత్నాలను ప్రశంసించారు. సమావేశాన్ని ఉద్దేశించి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, సి ఎస్ ఐ ఆర్ మరియు కాశ్మీర్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ రోజు ఇక్కడ ఒక ప్రాజెక్ట్ కోసం సహకరిస్తున్నాయని, రెండు సంస్థలు గొప్ప వారసత్వాన్ని కలిగి ఉన్నాయని మరియు స్వతంత్ర భారతదేశ ప్రగతి ప్రయాణం లో కాలంతో పాటు నడిచాయని అన్నారు. చంద్రయాన్ విజయంతో యావత్ దేశం ఆనంద పరవశులవుతున్న సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ సింగ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశంలో సైన్స్ మరియు శాస్త్రవేత్తలకు అపారమైన గౌరవం మరియు గుర్తింపు లభించాయి. ఇది దేశంలో జరుగుతున్న సానుకూల పరిణామాలు మరియు పురోగతులను నొక్కి చెబుతోందని ఆయన అన్నారు. డాక్టర్ సింగ్ జాతీయ విద్యా విధానం 2020 గురించి మాట్లాడారు, ఇది రాబోయే తరానికి ముఖ్యంగా పరిశోధన మరియు ఆవిష్కరణల రంగంలో అత్యుత్తమ ప్రతిభను మరియు నైపుణ్యాలను పొందేలా చేస్తుంది. ఇంతకుముందు మన పాత విద్యావ్యవస్థ శాస్త్ర పరిశోధనకు అనువైనది కాదు అది మనకు తగినంత అవకాశం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మొత్తం పర్యావరణ వ్యవస్థ మరింత అనుకూలంగా ఉంది అలాగే ఈ సాహసోపేతమైన చొరవ యొక్క ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చెందుతుంది. ఈ రోజు మనం ఉన్న స్థితి నుండి మరింత ముందుకు వెళ్లాలంటే మనం సమగ్రంగా ఎదగాలి. మనం ప్రపంచ నాయకులు గా ఎదగాలని ఎదురు చూస్తున్నాము, ప్రపంచ సవాళ్లు మరియు పారామితులకు అనుగుణంగా జీవించాలి, మన వ్యూహాలు ప్రపంచ ప్రమాణాలకు సరిపోలాలి, అని ఆయన చెప్పారు. స్టార్టప్ పాలసీ విజయం గురించి డాక్టర్ సింగ్ మాట్లాడుతూ, కొత్త అనుకూలమైన స్టార్టప్ పాలసీ కారణంగా 8 నుండి 9 సంవత్సరాలలో మొత్తం స్టార్టప్‌ల సంఖ్య 35400 నుండి 125000కి పెరిగాయని అన్నారు. అంతరిక్షంలోనే 4 ఏళ్లలో 4 స్టార్టప్‌ల నుంచి 150 స్టార్టప్‌లకు చేరుకున్నాం. కొత్త స్టార్టప్ విధానం మరిన్ని స్టార్టప్‌లను ప్రోత్సహించే అనేక అవకాశాలను ఎలా అందించిందో ఇది చూపిస్తుంది. మనం ఎంత సమగ్రంగా మరియు ఆరోగ్యంగా ఉంటామో, అంత ఎక్కువగా రాణిస్తాము. ప్రపంచమంతా సమీకృత విధానానికి సిద్ధంగా ఉన్న సమయం ఇది అని డాక్టర్ సింగ్ హైలైట్ చేశారు. భారతదేశం ప్రపంచానికి తొలి డీ ఎన్ ఎ కోవిడ్ వ్యాక్సిన్‌ను అందించింది, అయితే ఉత్తేజకరమైనది మరియు అద్భుతమైనది ఏమిటంటే, రక్షిత ఆరోగ్య సంరక్షణపై అంతగా నమ్మకం లేని ఈ దేశం లో సమగ్ర ఆరోగ్యం వైపు గా సాగుతోంది. చికిత్సాపరమైన వైద్యం పట్ల అంతగా అవగాహన చైతన్యం లేని అదే దేశం నివారణ వైద్య సంరక్షణ లో అగ్రగామిగా మరియు పరిశోధన పరంగా అగ్రగామి దేశంగా మారే మన ప్రగతి ని ప్రపంచం గుర్తిస్తోందని తెలుసుకోవడం ఆశ్చర్యంగా ఉంది. జెనోమిక్స్ అనేది భవిష్యత్తులో మనం చేయబోయే నివారణ వ్యూహాల వైపు మరో ముందడుగు.
ఇన్సులిన్ నిరోధకత వ్యాధులను నివారించడానికి ప్రధాన లక్షణం అందుకు ఈ ప్రాజెక్ట్‌ను విస్తృతం చేస్తామని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మనం ఈ రెండు మూడు అధ్యయనాలను కూడా ఏకీకృతం చేస్తాము, తద్వారా మనం ఇతరులు అందించే విజ్ఞానం నుండి ప్రయోజనం పొందవచ్చు. భవిష్యత్తులో సమగ్ర విధానం కోసం కృషి చేయాలని డాక్టర్ సింగ్ ఆకాంక్షించారు. మనం మన విజ్ఞానం మరియు పనిసంసృతులను ఏకీకృతం చేయడం నేర్చుకోవాలి,అదే ముఖ్య లక్షణం, లేకుంటే మనం సంపూర్ణమైన ఫలితాలను సాధించలేము
ప్రభుత్వం ది అనుసంధన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్‌తో ముందుకు వచ్చింది, దీనిని కాశ్మీర్ విశ్వవిద్యాలయం మరియు ఇతర సంస్థలు ఉత్తమంగా ఉపయోగించుకోవచ్చు.
ఇటువంటి మరిన్ని వినూత్న కార్యక్రమాలు మరియు అంటుకోని వ్యాధులు, ముఖ్యంగా మధుమేహం కోసం సంస్థలు అవసరం అని నొక్కిచెప్పారు. పరిశోధన మరియు శిక్షణ కోసం అంకితమైన మధుమేహ సంస్థల ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. చివరిగా అందరికీ మెరుగైన ఆరోగ్య సంరక్షణ మరియు శ్రేయస్సు కోసం కృషి చేయాలని డాక్టర్ జితేంద్ర సింగ్ తన ప్రసంగాన్ని ముగించారు.
కాశ్మీర్ యూనివర్శిటీలో జరిగిన ముగింపు ఉత్సవం లో ప్రబలంగా ఉన్న మధుమేహం మహమ్మారిని ఎదుర్కోవడం కోసం ప్రయాణంలో మెరుగైన ఆరోగ్యం కోసం జెనోమిక్స్‌ను ప్రభావితం చేయడం ఒక ముఖ్యమైన మైలురాయిని గుర్తించింది.
***
(Release ID: 1960135)
Visitor Counter : 153