హోం మంత్రిత్వ శాఖ
గణేశోత్సవం సందర్భంగా ముంబయిలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన
లాల్ బాగ్ కా రాజా వద్ద కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా వద్ద ప్రార్థనలు
- ముంబయిలోని బాంద్రా వెస్ట్ ప్రాంతంలోని ప్రసిద్ధ గణపతి మండపం వద్ద కూడా శ్రీ అమిత్ షా ప్రార్థనలు
- గణపతి బప్పాకు ప్రార్థనలు చేసేందుకు కేంద్ర హోంమంత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండే మరియు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్‌ల నివాసాల సందర్శన
Posted On:
23 SEP 2023 6:37PM by PIB Hyderabad
గణేశోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా ఈరోజు మహారాష్ట్రలోని ముంబైలోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన లాల్ బాగ్ కా రాజా వద్ద ప్రార్థనలు చేశారు. శ్రీ అమిత్ షా ముంబైలోని బాంద్రా వెస్ట్ ప్రాంతంలోని ప్రసిద్ధ గణపతి మండపం వద్ద కూడా ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్‌లు కూడా పాల్గొన్నారు. గణపతి బప్పాకు ప్రార్థనలు చేసేందుకు కేంద్ర హోం మంత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండే మరియు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్‌ల నివాసాలను సందర్శించారు.
***
(Release ID: 1960052)