సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉపకరణాలు, సహాయ పరికరాల పంపిణీ కోసం దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో - ‘సామాజిక అధికారిత శిబిరాలు’

Posted On: 23 SEP 2023 7:02PM by PIB Hyderabad

దేశంలోని వికలాంగులు, వయోవృద్ధులకు సాధికారత కల్పించే ప్రయత్నం లో భాగంగా భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 74 ప్రదేశాల్లో ‘సామాజిక అధికారిత శిబిరాలు’ నిర్వహిస్తోంది.  భారత ప్రభుత్వ ఏ.డి.ఐ.పి. ( ఉపకరణాలు, సహాయ పరికరాల కొనుగోలు / అమర్చడం కోసం దివ్యాంగ వ్యక్తులకు సహాయం), రాష్ట్రీయ వయోశ్రీ యోజన పథకాల క్రింద 47,000 కంటే ఎక్కువ మంది వికలాంగులకు, వయోవృద్ధులకు వివిధ రకాల సహాయ పరికరాలు పంపిణీ చేయడం లక్ష్యంగా ఈ శిబిరాలు నిర్వహించడం జరుగుతోంది. 

 

 

ఈ శిబిరాలు 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఈ కార్యక్రమ కేంద్ర స్థానమైన మధ్యప్రదేశ్‌ లోని టికామ్‌ ఘర్‌ లోని మానస్ మంచ్‌ నుంచి 2023సెప్టెంబర్, 24వ తేదీన దృశ్య మాధ్యమం ద్వారా ఆన్‌-లైన్‌ లో అనుసంధానం చేయడం జరుగుతుంది. 

 

 

తికమ్‌ ఘర్ లో ప్రధాన పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొంటారు. 

 

 

వికలాంగులు, వయోవృద్ధులకు సాధికారత, గౌరవప్రదమైన జీవనాన్ని నిర్ధారించడం, దేశవ్యాప్తంగా సమ్మిళిత సమాజం కోసం దృక్పథాన్ని నిర్మించడం ఈ శిబిరాల నిర్వహణ ముఖ్య లక్ష్యం.  వికలాంగులకు సమాన అవకాశాలు కల్పించడం, ఉత్పాదక, సురక్షితమైన, గౌరవ ప్రదమైన జీవితాన్ని గడపడానికి వీలు కల్పించడం దీని లక్ష్యం.

 

 

ఈ పంపిణీ శిబిరాలను భారత కృత్రిమ అవయవాల తయారీ సంస్థ (ఏ.ఎల్.ఐ.ఎం.సి.ఓ) సమన్వయంతో భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన వికలాంగుల సాధికారత విభాగం (దివ్యాంగజన్) (డి.ఈ.పి.డబ్ల్యూ.డి); డి.ఈ.పి.డబ్ల్యూ.డి. పరిపాలనా నియంత్రణ లో పనిచేస్తున్న జాతీయ సంస్థలు, సి.ఆర్.సి. లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

 

 

వివిధ ప్రదేశాలలో ఏకకాలంలో జరగనున్న పంపిణీ శిబిరాల శ్రేణిలో, కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్.కె. సింగ్ బీహార్‌ లోని అర్రాలో నిర్వహించే పంపిణీ శిబిరంలో పాల్గొంటారు.   అదేవిధంగా, మహారాష్ట్రలోని బీడ్‌లో జరిగే కార్యక్రమంలో సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్‌దాస్ అథవాలే సహాయక పరికరాలను పంపిణీ చేస్తారు.  త్రిపుర కు చెందిన ధలై లో జరిగే కార్యక్రమంలో  సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి కుమారి ప్రతిమా భౌమిక్ పాల్గొంటారు.  కాగా, కర్ణాటకలోని చిత్రదుర్గ లో నిర్వహించే పంపిణీ శిబిరానికి ముఖ్య అతిథిగా ఎస్.జె.ఈ. సహాయ మంత్రి శ్రీ ఎ. నారాయణస్వామి హాజరై, సహాయ పరికరాలు అందజేయనున్నారు. 

 

 

ఈ పంపిణీ శిబిరాలన్నీ టికామ్‌ ఘర్గ లోని ప్రధాన కార్యక్రమ వేదికకు ఆన్‌-లైన్‌ లో అనుసంధానమై ఉంటాయి. 

 

 

ఈ శిబిరాల ద్వారా వివిధ రకాల సహాయక పరికరాలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు. వీటిలో - మోటారుతో బిగించిన మూడు చక్రాల సైకిళ్ళు, హ్యాండ్ ప్రొపెల్డ్ ట్రైసైకిల్స్ ఫోల్డింగ్ వీల్‌చైర్లు, వాకర్స్, వాకింగ్ స్టిక్స్, బ్రెయిలీ కిట్‌లు, రోలేటర్లు, బి.టి.ఇ. వినికిడి పరికరాలు, సి.పి. కుర్చీలు, సెన్సార్ ఆధారిత ఎలక్ట్రానిక్ సుగమ్య కేన్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, బ్రెయిలీ కిట్‌ లు, ఏ.డి.ఎల్. కిట్‌ లు (కుష్టు వ్యాధికి సహాయాలు), వికలాంగులకు కృత్రిమ అవయవాలు, కాలిపర్సలు వంటివి ఉన్నాయి.  అదేవిధంగా, వయోవృద్ధులకు పంపిణీ కోసం ఫుట్ కేర్ యూనిట్లు, స్పైనల్ సపోర్ట్, కమోడ్‌ తో కూడిన వీల్‌చైర్లు, కళ్లద్దాలు, దంతాలు, సిలికాన్ కుషన్లు, ఎల్‌.ఎస్. బెల్టులు, త్రిపాదలు, మోకాలి బ్రేస్‌ లు, వాకర్లు వంటివి అందుబాటులో ఉంచారు. 

 

 

ఈ సహాయక పరికరాలు లబ్ధిదారులను స్వావలంబన కలిగి ఉండేలా చేసి, సమాజ ప్రధాన స్రవంతిలో కలిసిపోయేలా వారిని శక్తివంతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

 

 

ఈ కార్యక్రమాన్ని ఏ.ఎల్.ఐ.ఎం.సి.ఓ. అధికారిక యూట్యూబ్ ఛానెల్‌ లింకు https://www.youtube.com/live/7SQ_zcJwI2Q?si=CgcL_hasL3DKyPbB ద్వారా ఉదయం 11 గంటల నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. 

 

 

*****

 


(Release ID: 1960051) Visitor Counter : 214


Read this release in: English , Urdu , Marathi , Hindi