సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
స్టార్టప్ లతో పాటు మరే వృత్తిలో ఉన్నవారికైనా నైపుణ్యం, వేగం, కొలమానం (స్కిల్, స్పీడ్, స్కేల్) అనే మూడు 'ఎస్ ' లు కీలకం: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
శిక్షణ , నైపుణ్యాలను నిరంతరం అప్ గ్రేడ్ చేయడం అనేది ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పదే పదే చెప్పే రెండు ప్రధాన
అంశాలు: డాక్టర్ జితేంద్ర సింగ్
రాయ్ పూర్ లోని ఐఐఎం ద్వారా ఉద్యోగులందరికీ శిక్షణ ఇప్పిస్తున్న తొలి సంస్థ కేంద్రీయ భండార్
రాయ్ పూర్ ఐఐఎం ఆధ్వర్యంలో కేంద్రీయ భండార్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి
2017-18లో రూ.750 కోట్లుగా ఉన్న కేంద్రీయ భండార్ వృద్ధి 2021-22లో ఐదు రెట్లు పెరిగి రూ.4,043 కోట్లతో ఆల్ టైమ్
రికార్డు సాధించింది.
Posted On:
22 SEP 2023 4:54PM by PIB Hyderabad
‘ స్కిల్, స్పీడ్ , స్కేల్‘ - అనే మూడు ‘ఎస్‘ లు స్టార్టప్ లకు , మరే ఇతర వృత్తులలో ఉన్నవారికైనా సామర్థ్యాన్ని పెంపొందించడానికి కీలకం అని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా ), పి ఎం ఒ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ, స్పేస్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. కేంద్రీయ భండార్(కెబి ) సిబ్బంది కోసం ఐఐఎం రాయ్ పూర్ ఫ్యాకల్టీ
నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అంతిమంగా “ఖర్చు భారం లేకుండా నాణ్యత‘ తో తయారయ్యే ఉత్పత్తి పోటీ మధ్య సుస్థిరతను నిర్ణయిస్తుంది అని కేంద్ర మంత్రి మంత్రి అన్నారు.
భారతదేశంలో తన ఉద్యోగులకు సంస్థాగత శిక్షణ కోరిన మొదటి సంస్థ కేంద్రీయ భండార్.
శిక్షణ, నైపుణ్యాలను నిరంతరం అప్ గ్రేడ్ చేయడం అనే రెండు ప్రధాన అంశాలను ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం
పునరుద్ఘాటించారని కేంద్రమంత్రి తెలిపారు.
చంద్రయాన్-3, జి 20 వంటి విజయగాథలు ప్రధాని మోదీని ప్రపంచంలోనే అత్యంత గొప్ప నాయకుడిగా నిలబెట్టాయని జితేంద్ర
సింగ్ అన్నారు. 2014 మేలో ప్రధాని మోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి కొత్త పని సంస్కృతికి నాంది పలికారని, ఇక్కడ
ఔన్నత్యాన్ని కొనసాగించడం, ప్రోత్సహించడం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని ఆయన అన్నారు.
2015 మార్చిలో స్టేషనరీ ఓఎం ఉపసంహరణ తర్వాత కేంద్రీయ భండార్ సొసైటీ పనితీరు పడిపోయిందని, సేల్స్ టర్నోవర్ ఏటా
రూ.100-150 కోట్లు పడిపోయిందని, 2018 మార్చి వరకు లాభం కూడా గణనీయంగా తగ్గిందని, అందువల్ల సొసైటీ దాదాపు
నష్టాల అంచుకు చేరిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
అయితే ఆ తరువాత, ముఖ్యంగా కోవిడ్ సమయంలో వ్యయాన్ని తగ్గించే చర్యలు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ముఖేష్ కుమార్,
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, ఉద్యోగులందరూ చేసిన కృషి వల్ల, కేంద్రీయ భండార్ అనేక సంస్కరణలకు నాంది పలికిందని, ఫలితంగా
లాభాలు 30 శాతానికి పైగా పెరిగాయని జితేంద్ర సింగ్ అన్నారు.
డాక్టర్ ముఖేష్ కుమార్ తన ప్రసంగంలో, పరిశ్రమతో పోల్చదగిన న్యాయమైన వేతనాలు ఇవ్వడం ద్వారా ఉద్యోగుల
మనోధైర్యాన్ని, విశ్వాసాన్ని పెంపొందించడానికి సొసైటీ అనేక చర్యలు తీసుకుందని, అదే సమయంలో పనితీరు కనబరిచిన
ఉద్యోగులకు వేగంగా రికార్డు స్థాయిలో పదోన్నతులు మంజూరు చేశామని తెలిపారు. వీటితో పాటు గౌరవానికి భరోసా ఇచ్చే
పోస్టులను తిరిగి ఏర్పాటు చేయడం, పని ప్రదేశంలో జీవన నాణ్యతను మెరుగుపరచడం, ఉద్యోగుల వ్యక్తిత్వ వికాసం కోసం
సహకార సంస్థలు, ఎఫ్ఎస్ఎస్ఏఐ ద్వారా క్రమానుగతంగా శిక్షణ ఇవ్వడం వంటి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
2017-18లో రూ.750 కోట్లుగా ఉన్న కేంద్రీయ భండార్ వృద్ధి 2021-22లో రూ.4,043 కోట్లతో ఐదు రెట్లు వృద్ధి సాధించి
ప్రభుత్వ, ప్రయివేటు రంగం లోనే ఎక్కడా లేని విధంగా రంగ ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది.
సొసైటీ ఆవిర్భవించిన 55 ఏళ్లలో రూ.98.59 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లు సేకరించగా, ఇందులో రూ.41.28 కోట్లు (మొత్తం
రూ.139.87 కోట్లలో 29.51 శాతం) గత ఐదేళ్లలోనే జమ కావడం గమనార్హం.
దేశంలోనే అతి తక్కువ ధరకే నిత్యావసర సరుకులు అందిస్తూ సామాన్యులకు ఈ సొసైటీ సేవలు అందిస్తోంది. ఇటీవలి కాలంలో
సొసైటీ కిలో ఉల్లిని మార్కెట్ ధర రూ.70 ఉండగా రూ.15కే విక్రయించింది. 2023 ఫిబ్రవరి-మార్చిలో మార్కెట్ ధర కిలో రూ.40
నుంచి రూ.45 ఉన్న భారత్ అట్టాను కిలో రూ.27.50 కి, 2023 ఆగస్టు నెలలో మార్కెట్ ధర కిలో రూ.200 ఉన్న
టమాటాను రూ.70 చొప్పున విక్రయించారు. మార్కెట్ ధర రూ.110 ఉన్న భారత్ పప్పు (శనగ పప్పు)ను కిలో రూ.58/-
చొప్పున విక్రయించారు. అంతేకాకుండా, కరోనా / సంక్షోభ సమయంలో కేంద్రీయ భండార్ పాత్ర
ప్రశంసనీయం, ఎందుకంటే ఇది దేశంలో అతి తక్కువ రేటుకు వేగవంతమైన సేవలు ,నాణ్యమైన
వస్తువులను అందించింది.
కేంద్రీయ భండార్ 1963 లో సంక్షేమ ప్రాజెక్టుగా స్థాపించబడింది. ఇది ఎంఎస్ సిఎస్
చట్టం 2002 కింద ప్రభుత్వ ,ప్రభుత్వ ఉద్యోగుల వాటాతో మల్టీ స్టేట్ కో-
ఆపరేటివ్ సొసైటీగా రిజిస్టర్ అయింది. ఇది 93,000 మందికి పైగా సభ్యులను కలిగి ఉంది,
వీరిలో 10,000 మందికి పైగా సభ్యులు ఇప్పటికీ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. సొసైటీని
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ (14 డైరెక్టర్లు) నిర్వహిస్తారు. బోర్డులో తొమ్మిది మంది ఎన్నికైన డైరెక్టర్లు, ముగ్గురు నామినేటెడ్, ఒక ఎండి , ఒక కో-ఆప్టెడ్ డైరెక్టర్లు ఉన్నారు. ఈ సొసైటీకి దేశవ్యాప్తంగా ఐదు కెమిస్ట్ షాపులు/ జన ఔషధి అవుట్ లెట్ లతో పాటు 149 దుకాణాలు, సంస్థలు / కార్యాలయాలు ఉన్నాయి.
****
(Release ID: 1959828)
Visitor Counter : 123