భారత పోటీ ప్రోత్సాహక సంఘం
azadi ka amrit mahotsav

సెంటెల్లా మారిషస్ హోల్డింగ్స్ లిమిటెడ్ ద్వారా క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్‌లో మొత్తం ఈక్విటీ షేర్‌హోల్డింగ్‌ లో సుమారుగా 24.16 శాతం కొనుగోలుకు ఆమోదించిన - సి.సి.ఐ.

Posted On: 20 SEP 2023 6:10PM by PIB Hyderabad

సెంటెల్లా మారిషస్ హోల్డింగ్స్ లిమిటెడ్ ద్వారా క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్‌లో మొత్తం ఈక్విటీ షేర్‌-హోల్డింగ్‌ లో సుమారు 24.16 శాతం వాటాను కొనుగోలు చేయడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సి.సి.ఐ) ఆమోదం తెలిపింది.

సెంటెల్లా మారిషస్ హోల్డింగ్స్ లిమిటెడ్ ద్వారా క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ (క్యూ.సి.ఐ.ఎల్) లో మొత్తం ఈక్విటీ షేర్‌హోల్డింగ్‌లో సుమారు 24.16 శాతం కొనుగోలుకు సంబంధించినదే ఈ ప్రతిపాదిత ఒప్పందం. 

అక్వైరర్

సెంటెల్లా మారిషస్ హోల్డింగ్స్ లిమిటెడ్ అనేది మారిషస్‌ లో కొత్తగా  ఏర్పాటైన ఒక ప్రత్యేక ప్రయోజన పెట్టుబడి సంస్థ.  ఈ సంస్థ కు ప్రస్తుతం భారతదేశంలో కార్యకలాపాలు లేవు.  అక్వైరర్ ప్రధానంగా ఒక సంస్థ యాజమాన్యంలో, నియంత్రణలో టి.పి.జి. గ్రూప్ కు చెందిన అంతిమ హోల్డింగ్ కంపెనీ అయిన టి.పి.జి. ఐ.ఎన్.సి. (టి.పి.జి) అనుబంధ సంస్థల సలహాతో ఏర్పాటయింది. టి.పి.జి., దాని సహాయ సంస్థలు, అనుబంధ సంస్థలతో సహా, కలిసి 'టి.పి.జి. గ్రూప్' గా సూచిస్తారు.

టి.పి.జి. గ్రూప్ భారతదేశంలో ఆర్థిక సేవలు, సాంకేతిక విజ్ఞానం, వినియోగదారు, ప్రయాణం, మీడియా, రియల్ ఎస్టేట్, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలపై ప్రాథమిక దృష్టితో వివిధ పెట్టుబడుల ద్వారా పనిచేస్తుంది.

లక్ష్యం 

క్యూ.సి.ఐ.ఎల్. అనేది హైదరాబాద్‌ లో రిజిస్టర్డ్ కార్యాలయం ఉన్న ఒక అన్-లిస్టెడ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ.  క్యూ.సి.ఐ.ఎల్. అనేది భారతదేశంలో ఒక అత్యాధునిక ఆరోగ్య సేవలు అందజేసే సంస్థ.  ఇది భారతదేశంలోని వివిధ నగరాల్లో కేర్ హాస్పిటల్స్ బ్రాండ్ పేరుతో మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్స్ నెట్‌వర్క్‌ ను నిర్వహిస్తోంది.  కేర్ హాస్పిటల్స్ కు భారతదేశంలోని 6 రాష్ట్రాల్లోని 7 నగరాల్లో 17 ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు (16 ఆసుపత్రులతో పాటు ఒక 1 క్లినిక్) ఉన్నాయి. 

సి.సి.ఐ. ఆదేశాల పూర్తి వివరాలు త్వరలో తెలియజేయడం జరుగుతుంది.  

*****


(Release ID: 1959809) Visitor Counter : 123


Read this release in: English , Urdu , Hindi