భారత పోటీ ప్రోత్సాహక సంఘం
బి.సి.పి. ఆసియా II ద్వారా క్వాలిటీ కేర్ ఇండియా లో 72.49 శాతం వాటా (సుమారుగా) కొనుగోలును ఆమోదించిన - సి.సి.ఐ.
Posted On:
20 SEP 2023 6:09PM by PIB Hyderabad
బి.సి.పి. ఆసియా II ద్వారా క్వాలిటీ కేర్ ఇండియా లో సుమారు 72.49 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సి.సి.ఐ) ఆమోదం తెలియజేసింది.
బి.సి.పి. ఆసియా II టోప్కో IV పి.టి.ఈ. లిమిటెడ్ (బి.సి.పి. ఆసియా II/అక్వైరర్) ద్వారా, క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ (టార్గెట్) యొక్క మొత్తం ఈక్విటీ షేర్-హోల్డింగ్ లో ~72.49 శాతం మొత్తాన్ని టచ్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలనే ప్రాతిపదికన పొందాలని ప్రతిపాదిత ఒప్పందం భావిస్తోంది.
బ్లాక్-స్టోన్ సంస్థ యొక్క అనుబంధ సంస్థలచే సూచించబడిన మరియు/లేదా నిర్వహించబడే నిధుల ద్వారా అక్వైరర్ నియంత్రించబడుతుంది.
టార్గెట్ 1997 లో స్థాపించబడిన మల్టీ-స్పెషాలిటీ హెల్త్ కేర్ ప్రొవైడర్. ఇది భారతదేశంలోని వివిధ నగరాల్లో ‘కేర్ హాస్పిటల్స్’ బ్రాండ్ పేరుతో మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్స్ నెట్-వర్క్ ను నిర్వహిస్తోంది. టార్గెట్, ప్రత్యక్షంగా మరియు దాని అనుబంధ సంస్థల ద్వారా, 17 ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను (16 ఆసుపత్రులు మరియు 1 క్లినిక్) కలిగి ఉంది, భారతదేశం లోని 6 రాష్ట్రాల్లోని 7 నగరాల్లో ~2,400 పడకలతో సేవలు అందిస్తోంది.
*****
(Release ID: 1959808)
Visitor Counter : 117