ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేయడానికి సంయుక్త కార్యాచరణ ప్రణాళిక అభివృద్ధి చేయడం అనే అంశంపై కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ సుధాంష్ పంత్ అధ్యక్షతన జాతీయ సదస్సు
స్థానిక పట్టణ సంస్థల సహకారం, భాగస్వామ్యంతో అమలు చేసే ఆరోగ్య సంరక్షణ సేవలు త్వరితగతిన పట్టణ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వస్తాయి...: శ్రీ సుధాంష్ పంత్
"ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జాతీయ / రాష్ట్ర బృందాలు కలిసి పనిచేయడం ద్వారా పట్టణ జనాభా కోసం మరింత స్థిరమైన, ఆరోగ్యకరమైన, సురక్షితమైన పట్టణ వాతావరణం అభివృద్ధి అవుతుంది"
प्रविष्टि तिथि:
22 SEP 2023 12:58PM by PIB Hyderabad
ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేయడానికి సంయుక్త కార్యాచరణ ప్రణాళిక అభివృద్ధి చేయడం అనే అంశంపై కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ సుధాంష్ పంత్ అధ్యక్షతన ఈరోజు జాతీయ సదస్సు జరిగింది. సదస్సులో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ మనోజ్ జోషి కూడా పాల్గొన్నారు.

సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఆరోగ్య కార్యదర్శి పట్టణ స్థాయిలో ప్రాథమిక, ద్వితీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయవలసిన ఆవశ్యకతను వివరించారు. మహారాష్ట్ర, గుజరాత్‌లోని స్థానిక పట్టణ సంస్థలు అందిస్తున్న నాణ్యత గల ఆరోగ్య సేవలను ఆయన ప్రస్తావించారు. పట్టణ స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. పట్టణ స్థానిక సంస్థల సహకారం, భాగస్వామ్యంతో పటిష్టమైన ఆరోగ్య సేవలు అందించడానికి వీలవుతుందన్నారు. ఈ విధానం వల్ల పట్టాన ప్రాంత ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యతతో కూడిన ఆరోగ్య సేవలు అందుతాయని శ్రీ సుధాంష్ పంత్ అన్నారు.

ఆరోగ్య సేవలు అందించడానికి ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కలిసి అమలు చేస్తున్న కార్యక్రమాల పట్ల శ్రీ సుధాన్ష్ పంత్ హర్షం వ్యక్తం చేశారు. "ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జాతీయ / రాష్ట్ర బృందాలు కలిసి పనిచేయడం ద్వారా పట్టణ జనాభా కోసం మరింత స్థిరమైన, ఆరోగ్యకరమైన, సురక్షితమైన పట్టణ వాతావరణం అభివృద్ధి అవుతుంది" అని ఆయన అన్నారు. మెరుగైన ఆరోగ్య సంరక్షణసేవలు అందించే అంశంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి అన్ని రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పట్టణ ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, అమలు జరుగుతున్న ఉత్తమ విధానాలపై విస్తృతంగా చర్చలు, సంప్రదింపులు జరపాలని ఆయన సూచించారు.
కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ మనోజ్ జోషి మాట్లాడుతూ పట్టణ ప్రాంత ప్రజల అవసరాలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల రంగం పటిష్టం కావాలని అన్నారు. గ్రామీణ ఆరోగ్య సంరక్షణ కేంద్రాల పని తీరును ప్రశంసించిన శ్రీ మనోజ్ భౌగోళిక అవసరాలకు అనుగుణంగా ఆరోగ్య సంరక్షణ సేవలను సమన్వయంతో అమలు చేయాలన్నారు.
ఈ సదస్సులో ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి ఎల్. చాంగ్సన్ ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ విశాల్ చౌహాన్, నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేజర్ జనరల్ (ప్రొఫెసర్) అతుల్ కొత్వాల్,ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ , కేంద్ర ,రాష్ట్ర ఆరోగ్య ,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, గృహనిర్మాణం పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు ప్రభుత్వ అధికారులు, ప్రధాన కార్యదర్శులు వివిధ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నయూఎస్ ఎయిడ్ మిషన్ డైరెక్టర్, శ్రీమతి వీణా రెడ్డి, పాత్ కంట్రీ డైరెక్టర్, డా. నీరజ్ జైన్ ఇతర ప్రముఖులు.పాల్గొన్నారు.
****
(रिलीज़ आईडी: 1959668)
आगंतुक पटल : 209