భారత పోటీ ప్రోత్సాహక సంఘం
పి1 ఆపర్చునీటీస్ ఫండ్ –1, స్కీమ్ –2తోపాటు మరికొందరు వ్యక్తులకు టివిఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ లో కల షేర్ హోల్డింగ్ను ఆమోదించిన సిసిఐ.
Posted On:
20 SEP 2023 6:11PM by PIB Hyderabad
పి1 ఆపర్చునిటీస్ ఫండ్–1 , స్కీమ్ –2 తోపాటు మరికొందరికి
టివిఎస్ క్రెడిట్ సర్వీసెస్ లో గల షేర్ హోల్డింగ్ను , కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదించింది.
పి1 ఆపర్చునిటీస్ ఫండ్ –1, స్కీమ్ –2 అనేది భారతదేశపు చట్టాలకింద ఏర్పడిన ట్రస్టు. దీనిని కేటగిరీ –2 ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (ఎఐఎఫ్)
గా సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) కింద రిజిస్టర్ చేశారు.
పి1 ఆపర్చునిటీస్ ఫండ్ 1స్కీమ్ 2 పెట్టుబడి లక్ష్యం ప్రధానంగా ప్రగతి, వృద్ధి దశలో ఉన్న కంపెనీలలో పెట్టుబడి పెట్టడం.
పి1 ఆపర్చునిటీస్ ఫండ్ 1, స్కీమ్ 2ను పి1 ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజరీ ఎల్ ఎల్పి నిర్వహిస్తోంది. ట్రస్టీలైన హసీమ్ ప్రేమ్జీ
ప్రైవేట్ లిమిటెడ్ ట్రస్ట్ డెలిగేట్ గా దీనిని నిర్వహిస్తోంది.
పి 1 ఆపర్చునిటీస్ ఫండ్ –1, స్కీమ్ –2 ను ప్రేమ్ జీ ఇన్వెస్ట్ లిమిటెడ్ (ప్రేమ్జి ఇన్వెస్ట్) కి చెందినది. పి1 ఆపర్చునిటీస్,
ఫండ్ 1 స్కీమ్ 2 ప్రేమ్ జి ఇన్వెస్ట్ కు అనుబంధంగా కలిగినది. ఇది ప్రమ్ జీ ఫౌండేషన్ వారి ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ కాపిటల్
ఇన్వెస్ట్మెంట్ విభాగంగా ఉంది. ప్రేమ్ జీ ఫౌండేషన్ ప్రేమ్ జి ఇన్వెస్ట్ దాతృత్వ కార్యకలాపాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఏర్పాటు చేసినది.
ఇది అంతిమంగా అజిమ్ ప్రేమ్జి అధీనంలో ఉంటుంది.
వ్యక్తిగతంగా షేర్ హోల్డింగ్ పొందిన వారిలో సీనియర్ మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగులు, భాగస్వాములు, ప్రేమ్ జి ఇన్వెస్ట్ కన్సల్టెంట్లు,
దాని అనుబంధ సంస్థలు, ట్రస్టీలు ఉన్నారు. వ్యక్తిగత షేర్ హోల్డింగ్ కలిగిన వారు పెట్టిన పెట్టుబడి విడిగా పెట్టిన పెట్టుబడి.
మరో వైపు టివిఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది ఇండియాలో నెలకొల్పబడిన, డిపాజిట్లు సేకరించని , వ్యవస్థాపరంగా కీలకమైన ఎన్.బి.ఎఫ్.సి(ఎన్.బి.ఎఫ్.సి–ఎన్.డి.ఎస్.ఐ).
ఇది 20210లో ఎన్.బి.ఎఫ్.సి పై దృష్టితో రిటైల్ ఎన్బిఎఫ్సిగా తన కార్యకలాపాలను ప్రారంభించింది.
టివిఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ ప్రధానంగా ద్విచక్ర వాహన రుణాలు, ఉపయోగించిన కార్లకు సంబంధించి రుణాలు,
కొత్త లేదా వాడిన ట్రాక్టర్లకు రుణాలు, వాడిన వాణిజ్య వాహనాలకు రుణాలు, ఎం.ఎస్.ఎం.ఇ రుణాలు,
వినియోగ ఉత్పత్తుల రుణాలు,వ్యకిగత రుణాలను ఇండియాలో మంజూరు చేస్తుంది. టివిఎస్ క్రెడిట్ సంస్థకు దేశం వెలుపల కార్యకలాపాలు
ఏవీ లేవు.
ప్రతిపాదిత కాంబినేషన్, ప్రతిపాదిత 10.98ప వాటా సేకరణ లక్ష్యానికి సంబంధించినది.
పిఐఒఎఫ్ –2 లక్షిత సంస్థలో 10.79 శాతం వాటాను సేకరిస్తున్నది. వ్యక్తిగత సమీకరణ దారులు సమష్టిగా 0.19 శాతం షేర్ హోల్డింగ్ను సమకూర్చుకుంటారు.
సవివరమైన ఆర్డర్ సిసిఐ విడుదల చేస్తుంది.
***
(Release ID: 1959608)
Visitor Counter : 92