భారత పోటీ ప్రోత్సాహక సంఘం
azadi ka amrit mahotsav

జాతీయ రహదారుల మౌలికసదుపాయాల ట్రస్ట్లో అదనపు యూనిట్లను 245291 ఒంటారియో లిమిటెడ్, హైవే కన్సెషన్స్ వన్ ప్రైవేట్ లిమిటెడ్లో ఈక్విటీ వాటను 2743298 ఒంటారియో లిమిటెడ్ సేకరణకు ఆమోదం తెలిపిన సిసిఐ.

Posted On: 20 SEP 2023 6:14PM by PIB Hyderabad

జాతీయ రహదారుల మౌలికసదుపాయాల ట్రస్ట్లో అదనపు యూనిట్లను 245291 ఒంటారియో లిమిటెడ్, హైవే కన్సెషన్స్ వన్ ప్రైవేట్ లిమిటెడ్లో
ఈక్విటీ వాటను 2743298 ఒంటారియో లిమిటెడ్ ప్రతిపాదిత సేకరణకు కాంపిటషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదం తెలిపింది.
2452991 ఒంటారియో లిమిటెడ్ (ఒటిపిపి 1), 2743298 ఒంటారియో లిమిటెడ్ (ఒటిపిపి 2) లు పూర్తిగా ఒంటారియో టీచర్స్ పెన్షన్ ప్లాన్ బోర్డ్ (ఒటిపిపిబి) నియంత్రణలో ఉంది.
ఒటిపిపిబి పెన్షన్ ప్రయోజనాలను, ఇన్వెస్ట్మెంట్ పెన్షన్ ప్లాన్ నిధులను నిర్వహిస్తుంది. ఇది  కెనడియన్ ప్రావిన్స్ లోని ఒంటారియోలో ప్రస్తుతం పనిచేస్తున్న , పదవీ విరమణ చేసిన టీచర్లకు సంబంధించి నిధులను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తుంది.
హైవేస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ (టార్గెట్ ట్రస్ట్) అనేది మౌలికసదుపాయాల పెట్టుబడి ట్రస్ట్. ఇది సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వద్ద రిజిస్టర్ అయింది. సెబి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ రెగ్యులేషన్స్
2014 (ఇన్ విట్ రెగ్యులేషన్స్) కింద రిజిస్టర్ చేశారు. టార్గెట్ ట్రస్ట్ ప్రస్తుతం ఆరు రోడ్ అసెట్స్ను ఇండియాలో కలిగి ఉంది. ఇది రోడ్లు, జాతీయ రహదారులను ఇండియాలో నిర్వహిస్తుంది.

హైవే కన్సెషన్స్ వన్ ప్రైవేట్ లిమిటెడ్ (హెచ్.సి వన్) అనేది ఇండియాలో ఏర్పడిన ఇన్ కార్పొరేటెడ్ కంపెనీ. దీని ఉద్దేశం ఇండియాలో రోడ్ అసెట్స్ను నిర్వహించడం..
హైవే కన్సెషన్స్ టార్గెట్ ట్రస్ట్ కింద ఏర్పడిన ఇన్వెస్ట్మెంట్ మేనేజర్.ఇన్విట్ రెగ్యులేషన్ల కింద పనిచేస్తుంది. ఇది ఇన్విట్ రెగ్యులేషన్ల కింద గల రెగ్యులేషన్ 10 ప్రకారం కార్యకలాపాలను నిర్వహిస్తుంది.
పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం, టార్గెట్ ట్రస్ట్ ప్రాజెక్టులు ఇతర పెట్టుబడి నిధులకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటుంది.

ప్రతిపాదిత కాంబినేషన్ టార్గెట్ ట్రస్ట్లోని అదనపు యూనిట్లను ఒటిపిపి 1 సమకూర్చుకోవడం, అలాగే హెచ్.సి సంస్థ లో ఒటిపిపి 2 సంస్థ వేరుగా ఈక్విటీ వాటాలను సమీకరించుకోవడానికి సంబంధించినది.

***




(Release ID: 1959250) Visitor Counter : 108


Read this release in: English , Urdu , Hindi