రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

వైమానిక దళ సంఘం వార్షికోత్సవం

Posted On: 20 SEP 2023 6:23PM by PIB Hyderabad

వైమానిక దళ సంఘం (ఏఎఫ్‌ఏ) ఈ రోజు 43వ వార్షికోత్సవం జరుపుకుంది. వైమానిక దళ సంఘం అధ్యక్షుడు, ఎయిర్ చీఫ్ మార్షల్ (విశ్రాంత) ఆర్‌కేఎస్‌ భదౌరియా, ఈ రోజు ఉదయం. ఏఐఎఫ్‌ విశ్రాంత ఉద్యోగుల తరపున జాతీయ యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, అమర వీరులకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత, న్యూదిల్లీలోని సుబ్రొతో పార్క్‌లోని వైమానిక దళ ఆడిటోరియంలో వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరిగింది.

ఏజీఎమ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్‌ ఆఫ్‌ ఎయిర్‌ స్టాఫ్‌ (సీఏఎస్‌), ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరి, విశ్రాంత ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. గత ఒక సంవత్సర కాలంలో వైమానిక దళం సాధించిన విజయాలు, రాబోయే సంవత్సరాల ప్రణాళికల గురించి వివరించారు. అనుభవజ్ఞుల ధైర్యసాహసాలు, కృషి, త్యాగాన్ని సీఏఎస్‌ ప్రశంసించారు. ఏఎఫ్‌ఏ కోసం కోసం అంకితమైన ముగ్గురు అత్యుత్తమ విశ్రాంత అధికారులను సీఏఎస్‌ సత్కరించారు. ఏఎఫ్‌ఏ అభివృద్ధికి కృషి చేసిన వారిని కూడా ఆయన సన్మానించారు.

వైమానిక దళ సంఘం ఒక ప్రభుత్వేతర సంక్షేమ సంస్థ. వైమానిక దళ విశ్రాంత అధికార్లు, వారి కుటుంబాల సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది. భర్తలను కోల్పోయిన మహిళలు, నిరుపేద పిల్లలకు ఆర్థికంగా సాయం చేస్తోంది. 1980 సెప్టెంబర్‌ 15న, మార్షల్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ అర్జన్ సింగ్ డీఎఫ్‌సీ ఆధ్వర్యంలో ఈ సంఘాన్ని స్థాపించారు. దీనికి దేశవ్యాప్తంగా ఇరవై శాఖలు ఉన్నాయి. యూకే, ఆస్ట్రేలియాలోనూ రెండు శాఖలు ఉన్నాయి. దాదాపు 92,141 వైమానిక దళ విశ్రాంత సిబ్బంది, 6,190 జీవిత భాగస్వాములు ఇందులో సభ్యులుగా ఉన్నారు.

 

***


(Release ID: 1959249) Visitor Counter : 147


Read this release in: English , Urdu , Hindi , Tamil