రక్షణ మంత్రిత్వ శాఖ
సింబెక్స్-23లో పాల్గొనడానికి సింగపూర్ చేరుకున్న భారత నౌకాదళ నౌకలు, జలాంతర్గామి, ఎల్‌ఆర్‌ఎంపీ విమానం
Posted On:
20 SEP 2023 7:55PM by PIB Hyderabad
భారత నౌకాదళం-రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ నేవీ (ఆర్‌ఎస్‌ఎన్) మధ్య వార్షిక ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసమైన 'సింగపూర్ ఇండియా మారిటైమ్ బైలేటరల్ ఎక్సర్‌సైజ్' (సింబెక్స్) 30వ ఎడిషన్‌లో పాల్గొనేందుకు భారత నౌకాదళ నౌకలు రణ్‌విజయ్, కవరత్తి, జలాంతర్గామి ఐఎన్‌ఎస్ సింధుకేసరి సింగపూర్ చేరుకున్నాయి. సింబెక్స్‌ను 1994 నుంచి నిర్వహిస్తున్నారు. భారత నౌకాదళం మరే ఇతర దేశంతోనూ చేయని సుదీర్ఘకాల, నిరంతర విన్యాసాలుగా సింబెక్స్‌కు ప్రత్యేకత ఉంది.
సింబెక్స్-23ని రెండు దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశలో, సింగపూర్‌లో ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు నౌకాశ్రయం దశ, ఆ తర్వాత సముద్ర దశ. రణ్‌విజయ్, కవరత్తి, సింధుకేసరితో పాటు, లాంగ్ రేంజ్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ పి8I కూడా ఈ కసరత్తులో పాల్గొంటోంది.
నౌకాశ్రయం దశలో, రెండు నౌకాదళాల మధ్య అవగాహన పెంచే లక్ష్యంతో విస్తృత శ్రేణి అధికారిక సంభాషణలు, నౌకల పరస్పర సందర్శనలు, నిపుణుల మార్పిడి, క్రీడాంశాలు ఉండాయి.
సిబెక్స్ 23 సముద్ర దశలో సంక్లిష్టమైన, అధునాతన వాయు రక్షణ విన్యాసాలు, కాల్పులు, వ్యూహాత్మక యుక్తులు, జలాంతర్గామి వ్యతిరేక పోరాటాలు, ఇతర సముద్ర కార్యకలాపాలు ఉంటాయి. దీనిద్వారా, రెండు నౌకాదళాలు తమ యుద్ధ పోరాట నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తాయి. అదే సమయంలో, సముద్ర రంగంలో సంయుక్తంగా బహుళాంశిక కార్యకలాపాలు చేపట్టే సామర్థ్యాన్ని ఏకీకృతం చేస్తాయి.
***
(Release ID: 1959248)
Visitor Counter : 204