ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

10 సంవత్సరాలకు ప్రతిష్టాత్మకమైన డబ్ల్యూఎఫ్‌ఎంఈ గుర్తింపును సాధించిన నేషనల్ మెడికల్ కమిషన్


డబ్ల్యూఎఫ్‌ఎంఈ గుర్తింపును ఎన్‌ఎంసీ సాధించడంతో ఈసీఎఫ్‌ఎంజీ మరియు యూఎస్‌ఎంఎల్‌ఈకు దరఖాస్తు చేసుకోవడానికి భారతీయ విద్యార్థులకు అర్హత

యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ వంటి డబ్ల్యూఎఫ్‌ఎంఈ గు గుర్తింపు అవసరమయ్యే ఇతర దేశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ శిక్షణ మరియు అభ్యాసాన్ని కొనసాగించడానికి భారతీయ వైద్య గ్రాడ్యుయేట్‌లకు అవకాశం

Posted On: 20 SEP 2023 6:59PM by PIB Hyderabad

ప్రతిష్టాత్మక  వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ (డబ్ల్యూఎఫ్‌ఎంఈ) గుర్తింపును భారతదేశ నేషనల్ మెడికల్ కమిషన్ పదేళ్లకాలానికి సాధించింది. వైద్య విద్య మరియు అక్రిడిటేషన్‌లో అత్యున్నత ప్రమాణాల పట్ల ఎన్‌ఎంసికి ఉన్న తిరుగులేని నిబద్ధతకు ఈ గుర్తింపు నిదర్శనం.

ఈ గుర్తింపులో భాగంగా భారతదేశంలో ఉన్న అన్ని 706 మెడికల్ కాలేజీలు డబ్ల్యూఎఫ్‌ఎంఈ గుర్తింపు పొందుతాయి మరియు రాబోయే 10 సంవత్సరాలలో ఏర్పాటు చేయబోయే కొత్త మెడికల్ కాలేజీలు స్వయంచాలకంగా డబ్ల్యూఎఫ్‌ఎంఈ  గుర్తింపు పొందుతాయి. ఈ గుర్తింపు భారతదేశంలోని వైద్య విద్య యొక్క నాణ్యత మరియు ప్రమాణాలను గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ మరియు బెంచ్‌మార్క్‌లతో సమలేఖనం చేయడం ద్వారా మరింత మెరుగుపరుస్తుంది.

యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ వంటి డబ్ల్యూఎఫ్‌ఎంఈ గుర్తింపు అవసరమయ్యే ఇతర దేశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ శిక్షణ మరియు అభ్యాసాన్ని కొనసాగించడానికి భారతీయ వైద్య గ్రాడ్యుయేట్‌లను ఈ గుర్తింపు అనుమతిస్తుంది. ఇది భారతీయ వైద్య పాఠశాలలు మరియు నిపుణుల అంతర్జాతీయ గుర్తింపు మరియు ఖ్యాతిని పెంచుతుంది. విద్యాపరమైన సహకారాలు మరియు మార్పిడిని సులభతరం చేస్తుంది.  వైద్య విద్యలో నిరంతర అభివృద్ధి మరియు ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది అలాగే వైద్య అధ్యాపకులు మరియు సంస్థలలో నాణ్యత హామీ సంస్కృతిని ప్రోత్సహిస్తుంది.

డబ్ల్యూఎఫ్‌ఎంఈ గుర్తింపును ఎన్‌ఎంసి పొందడంతో భారతీయ విద్యార్థులందకు ఫారిన్ మెడికల్ ఎడ్యుకేషన్ మరియు యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్‌పై ఎడ్యుకేషన్ కమిషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత లభిస్తుంది.

ఈ ల్యాండ్‌మార్క్ అచీవ్‌మెంట్‌పై ఎన్‌ఎంసిలోని ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డు సభ్యుడు మరియు మీడియా విభాగం అధిపతి డాక్టర్ యోగేందర్ మాలిక్ మాట్లాడుతూ "భారతదేశంలో వైద్య విద్య యొక్క నాణ్యత ప్రపంచ ప్రమాణాలకు కట్టుబడి ఉందని డబ్ల్యూఎఫ్‌ఎంఈ గుర్తింపు స్పష్టం చేసింది. ఈ ప్రశంసలు మన విద్యార్థులకు మరిన్ని అవకాశాలను  కల్పిస్తాయి.  ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మన ప్రమాణాల కారణంగా భారతదేశాన్ని అంతర్జాతీయ విద్యార్థులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చడంతోపాటు ప్రపంచంలో ఎక్కడైనా తమ కెరీర్‌ను కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది" అని తెలిపారు.

వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ (డబ్ల్యూఎఫ్‌ఎంఈ) గురించి:

వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ (డబ్ల్యూఎఫ్‌ఎంఈ) అనేది ప్రపంచవ్యాప్తంగా వైద్య విద్య నాణ్యతను పెంపొందించడానికి అంకితమైన ప్రపంచ సంస్థ. డబ్ల్యూఎఫ్‌ఎంఈ యొక్క అక్రిడిటేషన్ కార్యక్రమం వైద్య సంస్థలు విద్య మరియు శిక్షణ యొక్క అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా మరియు సమర్థించేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసి) గురించి:

నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసి) అనేది వైద్య విద్య మరియు అభ్యాసాన్ని పర్యవేక్షిస్తున్న భారతదేశపు ప్రధాన నియంత్రణ సంస్థ. హెల్త్‌కేర్ ఎడ్యుకేషన్‌లో అత్యున్నత ప్రమాణాలను నిలబెట్టడానికి కట్టుబడి ఉన్న ఎన్‌ఎంసి దేశవ్యాప్తంగా నాణ్యమైన వైద్య విద్య మరియు శిక్షణను అందజేస్తుంది.

ఎన్‌ఎంసి గురించి మరింత సమాచారం కోసం [https://www.nmc.org.in/]ని సందర్శించవచ్చు.

 

***


(Release ID: 1959244) Visitor Counter : 239


Read this release in: English , Urdu , Hindi