సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
భారతదేశ చరిత్ర, వారసత్వ సంపదగా ఉన్న కట్టడాలు, ప్రాంతాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కృషి చేస్తుంది.. కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి హొయసల దేవాలయాలు, శాంతినికేతన్‌లను ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చిన యునెస్కో
Posted On:
19 SEP 2023 6:09PM by PIB Hyderabad
హొయసల దేవాలయాలు, శాంతినికేతన్‌లను ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చినట్లు యునెస్కో ప్రకటించింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఛాన్సలర్‌గా ఉన్న విశ్వభారతిని ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడం పట్ల కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. యునెస్కో నిర్ణయం శ్రీ నరేంద్ర మోదీ కి 73 వ జన్మదినోత్సవం సందర్భంగా అందిన గొప్ప బహుమతి అని శ్రీ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. భారతదేశ చరిత్ర, వారసత్వ సంపదగా ఉన్న కట్టడాలు, ప్రాంతాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిరంతరం కృషి చేస్తుందని శ్రీ జి.కిషన్ రెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.
. పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్‌ను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిందని శ్రీరెడ్డి తెలిపారు. యునెస్కో గుర్తింపు పొందిన 41వ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా శాంతినికేతన్ గుర్తింపు పొందింది. ప్రపంచ వారసత్వ జాబితాలో భారతదేశం 6వ స్థానంలో ఉంది. హోయసల దేవాలయాల సమూహం యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో స్థానం స్ పొందాయని శ్రీ కెసిహన్ రెడ్డి వెల్లడించారు. భారతదేశంలోని 42వ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం హోయసల దేవాలయాల సమూహం అని శ్రీ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కర్ణాటకలోని మూడు అద్భుతమైన ఆలయాలు - హొయసలేశ్వర ఆలయం, హలెబీడు, చెన్నకేశవ ఆలయం, బేలూరు , కేశవ ఆలయం, సోమనాథ్‌పూర్ అద్భుతమైన నిర్మాణ, కళాత్మక సృజనాత్మకతను ప్రతిబింబిస్తాయి.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శకత్వం, ఆదేశాల మేరకు దేశ సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని పునరుజ్జీవింపచేయడం, పునరుద్ధరణ కోసం చర్యలు అమలు జరుగుతున్నాయి అని శ్రీ కిషన్ రెడ్డి తెలిపారు. ప్రపంచానికి భారతదేశ వారసత్వం, చరిత్ర తెలియజేసేందుకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని శ్రీ కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
13వ శతాబ్దంలో కర్ణాటకలోని హొయసల రాజుల కాలంలో దేవాలయాల నిర్మాణం జరిగింది.దేవాలయాల సమూహం యునెస్కో ప్రకటించిన ప్రపంచ వారసత్వ జాబితాలో స్థానం సంపాదించాయి. ప్రపంచ వారసత్వ జాబితాలో భారతదేశం వివిధ ప్రాంతాలలో ఉన్న మొత్తం 42 ప్రాంతాలు, కట్టడాలు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో స్థానం పొందాయి. ఇది మొత్తం భారతీయ జాతికి ఆనందం కలిగించే నిర్ణయం.
సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరుగుతున్న 45వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితా ప్రకటించింది. హొయసల దేవాలయాన్ని 2022 లో ప్రపంచ పవిత్ర స్థానాల జాబితాలో చేర్చాలని వరల్డ్ హెరిటేజ్ సెంటర్‌కు భారతదేశం ప్రతిపాదనలు అందజేసింది. 2014 నుండి యునెస్కో తాత్కాలిక జాబితాలో హొయసల ఉంది.
అర్జెంటీనా, బెల్జియం, బల్గేరియా, ఈజిప్ట్, ఇథియోపియా, గ్రీస్, భారతదేశం, ఇటలీ, జపాన్, మాలి, మెక్సికో, నైజీరియా, ఒమన్, ఖతార్, రష్యన్ ఫెడరేషన్, రువాండా, సెయింట్ విన్సెంట్ , గ్రెనడైన్స్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, థాయిలాండ్ , జాంబియా వంటి 21 దేశాలు సభ్యులుగా ఉన్న వారసత్వ కమిటీ భారతదేశం నుంచి అందిన ప్రతిపాదనకు ఆమోదం తెలియజేయడంతో హోయసల దేవాలయాల సమూహాన్ని ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారు.
భారతదేశం ప్రస్తుతం ప్రపంచ వారసత్వ కమిటీలో నాలుగోసారి (2021-25) సభ్య దేశంగా ఉంది. 2023 సెప్టెంబర్ 18 న జరిగిన కమిటీ సమావేశంలో భారతదేశ ప్రతిపాదన వచ్చింది.ఎటువంటి చర్చ లేకుండా ఏకగ్రీవంగా సమావేశం భారతదేశ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. యునెస్కో వారసత్వ జాబితాలో స్థానం సాధించిన భారతదేశానికి కమిటీ సభ్యులందరూ అభినందనలు తెలిపారు.
యునెస్కో నిర్ణయంతో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో భారతదేశం మొత్తం 42 ప్రపంచ వారసత్వ ప్రాంతాలు ఉన్నాయి ఇందులో 34 సాంస్కృతిక, 7 సహజ, 1 మిశ్రమ ప్రాంతాలు ఉన్నాయి. ప్రస్తుతం, ప్రపంచ వారసత్వ జాబితాలో భారతదేశం ఆరవ స్థానంలో ఉంది . 42 లేదా అంతకంటే ఎక్కువ ప్రపంచ వారసత్వ ప్రదేశాలు కలిగి ఉన్న దేశాలుగా భారతదేశంతో సహా ఇటలీ, స్పెయిన్, జర్మనీ, చైనా, ఫ్రాన్స్ ఉన్నాయి. 2014 నుంచి ఇంతవరకు భారతదేశంలో 12 వారసత్వ ప్రదేశాలు ప్రపంచ వారసత్వ జాబితాలో స్థానం సాధించాయి. భారతీయ సంస్కృతి, వారసత్వం, భారతీయ జీవన విధానాన్నిప్రోత్సహించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేస్తున్న కృషి, నిబద్ధతకు నిదర్శనంగా జాబితా నిలుస్తుంది.
దక్షిణ భారత రాష్ట్రం కర్ణాటకలో మూడు దేవాలయాల సమూహం హోయసల. దేవాలయ సమూహంలో ఉన్న బేలూరు చెన్నకేశవ ఆలయం, హళేబీడు లోని హొయసలేశ్వర ఆలయం, సోమనాథపూర్ లోని కేశవ ఆలయాలకు కలిపి అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వాలని కోరుతూ భారతదేశం నామినేషన్ చేసింది. వీటిని 13వ శతాబ్దంలో నిర్మించారు.
ఉత్తర, మధ్య మరియు దక్షిణ భారతదేశంలో ప్రబలంగా ఉన్న నగర, భూమిజ మరియు ద్రవిడ శైలి ఆధారంగా దేవాలయాల నిర్మాణం జరిగింది. ప్రపంచ వారసత్వ జాబితాలో ఈ దేవాలయాలకు గుర్తింపు లభించడం అంటే భారతదేశం గొప్ప ఆలయ నిర్మాణ సంప్రదాయానికి గుర్తింపు లభించినట్టే.
అద్భుతమైన వాస్తుశిల్పం, శిల్పాలు, క్లిష్టమైన శిల్పాలతో రూపుదిద్దుకున్న దేవాలయాలు మత విశ్వాసాలు, కథలు, నైరూప్య ఆలోచనను రాతి మాధ్యమంలో రూపొందించిన శిల్పుల ప్రతిభను ప్రతిబింబిస్తాయి.
దేవాలయం గోడలపై హిందూ ఇతిహాసాలు , పురాణ గాధలు వివరించే శిల్పకళా ఫలకాలను చెక్కారు. ప్రదక్షిణ మార్గం మొదట హొయసలలో నిర్మాణం జరిగింది.
వాస్తుశిల్పం లో సృజనాత్మక మేధావి, నిర్మాణ పరిశీలనాత్మక,ప్రతీకవాదంతో కలిసి నిర్మాణం అయిన ఈ హోయసల దేవాలయాలను నిజమైన కళాఖండంగా మార్చింది. హోయసల దేవాలయానికి లభించిన గుర్తింపు భారతదేశానికి మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచ వారసత్వ సమాజానికి లభించిన గౌరవం.
శాంతినికేతన్ ను ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చాలని కోరుతూ భారతదేశం 2021 జనవరిలో నామినేషన్ పత్రాన్ని సమర్పించింది. శాంతినికేతన్ 2010 నుండి యునెస్కో రూపొందించిన తాత్కాలిక జాబితాలో ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని గ్రామీణ ప్రాంతంలో ఉన్న శాంతినికేతన్ ప్రపంచ ప్రఖ్యాత కవి, కళాకారుడు, సంగీతకారుడు, తత్వవేత్త, మరియు సాహిత్యంలో నోబెల్ బహుమతి గ్రహీత (1913) రవీంద్రనాథ్ ఠాగూర్ పని, తత్వాలతో సంబంధం కలిగి ఉంది. ఒక ఆశ్రమంగా శాంతినికేతన్ ప్రారంభమయ్యింది. 1863లో ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ ఆశ్రమానికి శాంతినికేతన్ అని పేరు పెట్టారు. ఆస్తి (iv) మరియు (vi) ప్రమాణాల క్రింద ప్రతిపాదించబడింది.
1901లో శాంతినికేతన్ ను రవీంద్రనాథ్ ఠాగూర్ పురాతన భారతీయ గురుకుల సంప్రదాయం ఆధారంగా రెసిడెన్షియల్ పాఠశాల,కళా కేంద్రం గా మార్చారు. “విశ్వ భారతి” స్ఫూర్తితో రవీంద్రనాథ్ ఠాగూర్ పనిచేశారు. 20వ శతాబ్దం ప్రారంభంలో ఎక్కువగా వ్యాప్తిలో ఉన్న బ్రిటిష్ నిర్మాణ శైలి, యూరోపియన్ శైలికి కి భిన్నంగా శాంతినికేతన్ నిర్మాణం జరిగింది. పురాతన, మధ్యయుగ, జానపద సంప్రదాయాల ఆధారంగా రూపు దిద్దుకున్న శాంతినికేతన్ ఆసియా నిర్మాణ శైలికి అనుగుణంగా జరిగింది.
పూర్తి వివరాలు
List of world Heritage Properties pdf
India Properties on the tentative list
HCM Statement for WH nomination pdf లో అందుబాటులో ఉన్నాయి .
ప్రపంచ వారసత్వ ఆస్తుల జాబితా pdf
తాత్కాలిక జాబితాలో భారతదేశ ఆస్తులు
WH నామినేషన్ pdf కోసం HCM స్టేట్‌మెంట్
***
(Release ID: 1958959)
Visitor Counter : 1031