సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

"స్వాతంత్ర్య పూర్వ భారతదేశం నుంచి స్వాతంత్ర్యానంతర భారతదేశం వరకు జరిగిన చరిత్రకు పార్లమెంటు సెంట్రల్ హాల్ సాక్షి. లోక్‌సభ-రాజ్యసభను కలిపే దగ్గరి మార్గమైన పార్లమెంటు సెంట్రల్ హాల్ గుండా నేను తరచూ వెళ్లినప్పుడు, భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి 1946 డిసెంబర్‌ నుంచి 1950 జనవరి వరకు భారత రాజ్యాంగ సభ ఈ హాలులో కూర్చున్నట్లు పేర్కొనే ఫలకాన్ని ఎప్పుడూ చూస్తుంటాను, స్ఫూర్తి పొందుతాను. ఆ ఫలకాన్ని చూసిన ప్రతిసారీ చరిత్ర స్ఫురిస్తుంది": డా.జితేంద్ర సింగ్


"బ్రిటీష్ పాలన కాలంలో ఇంపీరియల్ సెంట్రల్ అసెంబ్లీ సమావేశాలను ఈ భవనం చూసింది. రాజ్యాంగ సభ సమావేశాలు కూడా పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో జరిగాయి. 1947లో స్వాతంత్ర్యం తర్వాత, ప్రజాస్వామ్య అత్యున్నత కేంద్రంగా పాత పార్లమెంటు భవనం ఉద్భవించింది"

పాత పార్లమెంటు భవనానికి "సంవిధాన్ సదన్" అని పేరు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రతిపాదనను ప్రశంసించిన డా.జితేంద్ర సింగ్, ఇది ప్రధాని మోదీ ఆలోచనాత్మక విధానం అని అభివర్ణన

Posted On: 19 SEP 2023 7:29PM by PIB Hyderabad

"స్వాతంత్ర్య పూర్వ భారతదేశం నుంచి స్వాతంత్ర్యానంతర భారతదేశం వరకు జరిగిన చరిత్రకు పార్లమెంటు సెంట్రల్ హాల్ సాక్షి. లోక్‌సభ-రాజ్యసభను కలిపే దగ్గరి మార్గం ద్వారా నేను తరచూ వెళ్లినప్పుడు, భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి 1946 డిసెంబర్‌ నుంచి 1950 జనవరి వరకు భారత రాజ్యాంగ సభ ఈ హాలులో కూర్చున్నట్లు పేర్కొనే ఫలకాన్ని నేను ఎప్పుడూ చూస్తుంటాను, స్ఫూర్తి పొందుతాను. ఆ ఫలకాన్ని చూసిన ప్రతిసారీ చరిత్ర స్ఫురిస్తుంది" అని కేంద్ర మంత్రి స్వతంత్ర్య బాధ్యత డా.జితేంద్ర సింగ్ చెప్పారు.

కేంద్ర శాస్త్ర &సాంకేతికత మంత్రిత్వ శాఖ, పీఎంవో సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డా.జితేంద్ర సింగ్ ఈ రోజు మధ్యాహ్నం పాత పార్లమెంటు భవనం నుంచి కొత్త పార్లమెంటు భవనానికి వచ్చినప్పుడు ఇలా ఉద్వేగభరితంగా స్పందించారు.

కొత్త పార్లమెంటు భవనం ప్రవేశ ద్వారం వద్ద డా.జితేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడారు. పాత పార్లమెంటులో గడిపిన సమయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇది కేవలం మన ఎంపీల వ్యక్తిగత బంధమే కాదని, ఆ భవనంలోని ఇటుకలు, గోడలు కూడా బ్రిటీష్ కాలం నుంచి స్వాతంత్య్రానంతరం 15 మంది ప్రధానులుగా పని చేసిన కాలం వరకు వివిధ సందర్భాలు, సంఘటనలతో ముడిపడి ఉన్నాయని అన్నారు.

"బ్రిటీష్ పాలన కాలంలో ఇంపీరియల్ సెంట్రల్ అసెంబ్లీ సమావేశాలను పాత పార్లమెంటు భవనం చూసింది. రాజ్యాంగ సభ సమావేశాలు కూడా పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో జరిగాయి. 1947లో స్వాతంత్ర్యం తర్వాత, ప్రజాస్వామ్య అత్యున్నత కేంద్రంగా పాత పార్లమెంటు భవనం ఉద్భవించింది" అని డా.జితేంద్ర సింగ్ చెప్పారు.

“ఎంపీలందరికీ పాత పార్లమెంటు భావోద్వేగ బంధం, ఆవరణతో ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉన్నారని కేంద్ర మంత్రి చెప్పారు. పాత పార్లమెంటు భవనం అన్ని కాలాలకు చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.

పాత పార్లమెంటు భవనానికి "సంవిధాన్ సదన్" అని పేరు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రతిపాదనను డా.జితేంద్ర సింగ్ ప్రశంసించారు. ప్రధాని మోదీ ఆలోచనాత్మక విధానం ఇది అని చెప్పారు.

కొత్త పార్లమెంటు భవనానికి మారడం గురించి మాట్లాడిన డా.జితేంద్ర సింగ్, "17వ లోక్‌సభ ప్రస్తుత పార్లమెంటు సభ్యులకు ఇది ఒక ముఖ్యమైన సందర్భం. పార్లమెంటు పాత భవనంలో కొంత కాలం సేవ చేసే అవకాశం మాకు లభించింది. ఇకపై కొత్త పార్లమెంటు భవనంలో తర్వాతి భాగం ప్రారంభం అవుతుంది" అని అన్నారు.

ఈ రోజు భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మలుపు అని మంత్రి అభివర్ణించారు.

పార్లమెంటు సమావేశాల సమయంలో లోక్‌సభ-రాజ్యసభ మధ్య తిరుగుతున్నప్పుడు, పార్లమెంటు సెంట్రల్ హాల్ గుండా వందల సార్లు వెళ్లినట్లు గుర్తు డా.జితేంద్ర సింగ్ గుర్తు చేసుకున్నారు.

"నేను సెంట్రల్ హాల్‌కు వచ్చినప్పుడల్లా, రాజ్యాంగ సభ 1946 డిసెంబర్ నుంచి 1950 జనవరి వరకు ఇక్కడ కూర్చున్నట్లు పేర్కొనే శాసనం నుంచి నేను తప్పించుకోలేకపోయాను" అని చెప్పారు.

ఈ ప్రతిపాదనను ఆమోదించినందుకు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్‌కు డా.జితేంద్ర సింగ్ ధన్యవాదాలు తెలిపారు. భారత ప్రజాస్వామ్యంలో గొప్ప స్థానం ఉన్న కారణంగా పాత పార్లమెంట్‌కు సంవిధాన్ సదన్‌గా పేరు మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనాత్మకంగా సూచించారని అన్నారు.

 

***



(Release ID: 1958954) Visitor Counter : 133


Read this release in: Punjabi , English , Hindi , Urdu