సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
కేంద్ర మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్లసీ పి గ్రామ్స్ 2023 ఆగస్టు నెలవారీ 16వ పనితీరు నివేదిక ను డీ ఏ ఆర్ పీ జీ విడుదల చేసింది
ఆగస్టు, 2023లో కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు పరిష్కరించిన మొత్తం 1,21,004 ఫిర్యాదులు
కేంద్ర సెక్రటేరియట్‌లో వరుసగా 13వ నెలలో నెలవారీ కేసుల సంఖ్య లక్ష దాటింది.
వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ శాఖ మరియు జలవనరులు, నదుల అభివృద్ధి మరియు గంగా పునరుజ్జీవన మంత్రిత్వ శాఖ 2023 ఆగస్టు నెలలో విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో గ్రూప్ ఏ విభాగంలో అగ్రస్థానంలో ఉన్నాయి.
2023 ఆగస్టు నెలలో విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు నీతి ఆయోగ్ గ్రూప్ బీ విభాగంలో అగ్రస్థానంలో ఉన్నాయి.
Posted On:
19 SEP 2023 5:30PM by PIB Hyderabad
డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ (డీ ఏ ఆర్ పీ జీ) ఆగస్ట్, 2023కి కేంద్రీకృత పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (సీ పి గ్రామ్స్) నెలవారీ నివేదికను విడుదల చేసింది, ఇది ప్రజా ఫిర్యాదుల రకాలు మరియు కేటగిరీలు మరియు పరిష్కార స్వభావం యొక్క వివరణాత్మక విశ్లేషణను అందిస్తుంది. డీ ఏ ఆర్ పీ జీ ప్రచురించిన కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలపై ఇది 16వ నివేదిక.
కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాల ద్వారాఆగస్టు, 2023కి సంబంధించిన ఫిర్యాదుల పరిష్కార పురోగతిని ఈ 1,21,004 ఫిర్యాదుల పరిష్కారం సూచిస్తుంది. 2023 సంవత్సరంలో కేంద్ర మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్లలో సగటు ఫిర్యాదుల పరిష్కార సమయం జనవరి నుండి ఆగస్టు వరకు 19 రోజులు. ఈ నివేదికలు 10-దశల సీ పి గ్రామ్స్ సంస్కరణల ప్రక్రియలో భాగంగా ఉన్నాయి. వీటిని పరిష్కార నాణ్యతను మెరుగుపరచడం మరియు సమయ రేఖలను తగ్గించడం కోసం డీ ఏ ఆర్ పీ జీ చేపట్టింది
బీ ఎస్ ఎన్ ఎల్ కాల్ సెంటర్ ఆగస్ట్, 2023లో 85,386 మంది పౌరుల నుండి అభిప్రాయాన్ని సేకరించింది. వీరిలో సుమారు 32,982 మంది పౌరులు తమ ఫిర్యాదులకు అందించిన పరిష్కారం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆగస్ట్, 2023 నెలలో 21,317 మంది పౌరులు తమ ఫిర్యాదుల పరిష్కారానికి "అద్భుతమైన మరియు చాలా మంచి" రేటింగ్ ఇచ్చారు
కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాల కోసం ఆగస్టు, 2023కి సంబంధించిన డీ ఏ ఆర్ పీ జీ యొక్క నెలవారీ సీ పి గ్రామ్స్ నివేదిక యొక్క ముఖ్య ముఖ్యాంశాలు క్రిందివి:
పీజీ కేసులు:
ఆగస్టు, 2023లో, సీ పి గ్రామ్స్ పోర్టల్‌లో 118294 పీ జీ కేసులు స్వీకరించబడ్డాయి, 121004 పీ జీ కేసులు పరిష్కరించబడ్డాయి మరియు 31 ఆగస్టు 2023 నాటికి 63461 పీ జీ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
సెంట్రల్ సెక్రటేరియట్‌లో పెండింగ్‌లు జూలై, 2023 చివరి నాటికి 64963 పీజీ కేసుల నుండి ఆగస్టు 2023 చివరి నాటికి 63461 పీజీ కేసులకు తగ్గాయి.
పీజీ అప్పీల్స్:
ఆగస్టు, 2023లో 20272 అప్పీళ్లు రాగా, 19700 అప్పీళ్లను పరిష్కరించారు. సెంట్రల్ సెక్రటేరియట్‌లో ఆగస్ట్, 2023 చివరి నాటికి 23030 పీజీ అప్పీల్స్ పెండింగ్‌లో ఉన్నాయి
సెంట్రల్ సెక్రటేరియట్‌లో పెండింగ్‌లో ఉన్న అప్పీళ్ల సంఖ్య జూలై, 2023 చివరి నాటికి 22458 అప్పీళ్ల నుండి 2023 ఆగస్టు చివరి నాటికి 23030 అప్పీళ్లకు పెరిగింది.
ఫిర్యాదుల పరిష్కార అంచనా మరియు సూచిక (జీ ఆర్ ఎ ఐ) - ఆగస్టు, 2023
వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ శాఖ మరియు జలవనరుల మంత్రిత్వ శాఖ, నదుల అభివృద్ధి మరియు గంగా పునరుజ్జీవనం ఆగస్టు, 2023 కొరకు గ్రూప్ ఏ పరిధిలోని ఫిర్యాదుల పరిష్కార అసెస్‌మెంట్ & ఇండెక్స్‌లో అగ్రగామిగా ఉన్నాయి.
ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు నీతి ఆయోగ్ ఆగస్టు, 2023 కొరకు గ్రూప్ బీ లో ఫిర్యాదుల పరిష్కార అసెస్‌మెంట్ & ఇండెక్స్‌లో అగ్రగామిగా ఉన్నాయి.
***
(Release ID: 1958898)
Visitor Counter : 119