వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

అంతర్జాతీయంగా ఆమోదం పొందిన ఒఐఎంఎల్ (అంతర్జాతీ లీగల్ మెట్రాలజీ సంస్థ) సర్టిఫికేట్ ను జారీ చేయగల


ప్రపంచంలోని 13 వ దేశంగా భారత్.

దేశీయ తయారీదారులు ఇకనుంచి తమ తూనికలు, కొలతల పరికరాలను భారత్ లో పరీక్షింపచేసి, అంతర్జాతీయ మార్కెట్ లో అమ్ముకోవచ్చు.

దినితో అంతర్జాతీయ తయారీదారులు తమ పరికరాలను భారత్ లో పరీక్షింపచేసి, అందుకు రాబడి పొందవచ్చు.ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు.

Posted On: 14 SEP 2023 6:41PM by PIB Hyderabad

ఒఐఎంఎల్ ఒక  ప్రభుత్వ సంస్థ. దీనిని 1955 వ సంవత్సరంలో  నెలకొల్పారు. భారతదేశం 1956 వ సంవత్సరంలో  ఇందులో సభ్యత్వం  పొందింది. దీనిక 63 సభ్యదేశాలు, 64 మంది కరస్పాండింగ్ సభ్యులు ఉన్నారు. తూనికలు, కొలతల పరికరాలకు  సంబంధించి  అంతర్జాతీయంగా ఆమోదించే ఒఐఎంఎల్ సర్టిఫికెట్లను జారీచేసేందుకు భారత్ కు అధికారం లభించింది.పాటర్న్ ఆమోదానికి సంబంధించి సర్టిఫికేట్ తప్పని సరి  దీనిని వినియోగదారుల వ్యవహారాల విభాగం జారేచేయవచ్చు.

 

తూనికలు ,కొలతలకు సంబంధించి భారత్ , ఒఐఎంఎల్ సిఫార్సులు, పరీక్షా పద్ధతులు పాటిస్తుంది. తూనికలు  కొలతల విభాగం ప్రాంతీయ రెఫరెన్స్ స్టాండర్డ్స్ లేబరెటరీలు రూపొందించే  నివేదికలను ఇక ఒఎంఐఎల్ వర్గాలు ఆమోదిస్తాయి. దీనితో భారత్ ఒఐఎంఎల ప్యాట్రన్ ఆమోద సర్టిఫికేట్లు జారీచేయగలుగుతుంది. అలాగే దేశీయ తయారీదారులకు అండగా  నిలవగలుగుతుంది. దేశీయ తయారీదారులు తమ తూనికలు, కొలతల పరికరాలను , ఎలాంటి అదనపు  టెస్టింగ్  రుసుము చెల్లించకుండానే వివిధ దేశాలకు ఎగుమతి  చేయవచ్చు.  దీనితో చెప్పుకోదగిన స్థాయిలో ఆదా అవుతుంది.

 

విదేశీ  తయారీదారులకు కూడా  భారత్ ఐఐఎంఎల విధాన సర్టిఫికేట్లు మన ఆర్.ఆర్.ఎస్.ఎల్ ల నుంచి జారీచేయడానికి  వీలుంది. తూనికలుకొలత పరికరాలకు ఒఐఎంల్ ఆమోదం పొందిన సర్టిఫికేట్లను భారత్ జారీచేయడం ద్వారా ఫీజు  రూపంలో విదేశీ  మారకద్రవ్యాన్ని  ఆర్జించ  గలుగుతుంది.

 

భారత్ ఇక ఒఐఎంఎల్ విధానాలను  ప్రభావితం  చేయడంతోపు ఒఐఎంల్ వ్యూహానికి సమాచారాన్ని  అందించగలదు.   ఈ వ్యవస్థ ఒఐఎంఎల్ సభ్యదేశాలలోని ఒఐఎంఎల్ జారీ అధికారులు జారీచేసే సర్టిఫికేట్లను ఇతర దేశాలు ఆమోదించవలసి  ఉంటుంది. తూనికలు కొలతల పరికరాలకు జాతీయ , ప్రాంతీయ స్థాయి ఆమోదాలకు ఇది ప్రాతిపదిక  అవుతుంది. ఇతర ఒఐఎంఎల్ సభ్యదేశాలు జాతీయ స్థాయి ఆమోద సర్టిఫికేట్లు,ఎలాంటి ఖర్చుతో  కూడిన పరీక్షా సదుపాయాల అవసరం  లేకుండా  ఈ సర్టిఫికేట్లపై ఆధారపడి  జారీచేయవచ్చు. భారత్ , ఇప్పుడు ఆస్ట్రేలియా, స్విజ్జర్లాండ్, చైనా, చెక్  రిపబ్లిక్, జర్మనీ, డెన్మార్క్ ,ఫ్రాన్స్ ,యునైటెడ్ కింగ్ డమ్, జపాన్, నెదర్లాండ్, స్వీడన్, స్లొవేకియాతో  పాటు 13 వ దేశంగా ప్రపంచవ్యాప్తంగా ఒఐఎంఎల్ ఆమోదిత సర్టిఫికేట్ జారీచేయడానికి అనుమతి కలిగి ఉంది.

ఇవాళ , అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఒఐఎంఎల్ సర్టిఫికెట్ జారీ అథారిటీ లజాబితాలో చేరినట్టు  భారత్  సగర్వంగా  ప్రకటించుకుంటోంది. ఇది నాణ్యతా ప్రమాణాలను పాటించడంలో మన దేశానికి  గల కట్టుబాటుకు, అంతర్జాతీయ వాణిజ్య  ప్రమాణాలు పాటించడానికి గల చిత్తశుద్దిని తెలియజేస్తోంది.

 

వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ  రోహిత్ కుమార్ సింగ్ ఈ కీలక విజయం గురించిన సమాచారాన్ని ఒక పత్రికా  విలేఖరుల సమావేశంలో పంచుకున్నారు. ఈ విజయానికి సంబంధించిన ప్రాధాన్యతను వారు ఒక వీడియో ప్రజెంటేషన్  ద్వారా తెలిపారు. ఒఐఎంఎల్-సిఎష్ ఎక్సిక్యుటివ్ కార్యదర్శి పాల్ డిక్సన్ కూడా  పారిస్ కేంద్ర కార్యాలయం నుంచి ఈ పత్రికా విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు. ఒఐఎంఎల్ సర్టిఫికేట్ జారీ అథారిటీగా భారత్ పాత్రను ఆయన పునరుద్ఘాటించారు. అలాగే భారత్ కు తమ సహకారం కొనసాగుతుందని  తెలిపారు.

 

***



(Release ID: 1957935) Visitor Counter : 108


Read this release in: English , Urdu , Hindi , Tamil