జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డ్యామ్ భద్రతపై రాజస్థాన్ లోని జైపూర్ లో అంతర్జాతీయ సదస్సును ప్రారభించిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కర్


జాతీయ వాటర్ మిషన్ కింద వినైల్ కోటింగ్ రైలును జెండా ఊపి ప్రారంభించిన ఉపరాష్ట్రపతి
డ్యామ్ భద్రతకు సంబంధించి ,ముందు చూపుతో తీసుకువచ్చిన చట్టం డ్యామ్ భద్రతా చట్టం –2021 అని తెలిపిన ఉపరాష్ట్రపతి.

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, జైపూర్ లోని ఎం.ఎన్,ఐ.టి వద్ద డ్యామ్ లకు సంబంధించి భూకంప రక్షణ జాతీయ కేంద్రాన్ని ప్రారంభించారు.

ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్ ఖర్ ఈరోజు జైపూర్లో డ్యామ్ భద్రతపై అంతర్జాతీయ సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సు ఇతివృత్తం ‘ సురక్షితమైన,భద్రమైన డ్యామ్లు జాతికి సంపద”.

Posted On: 14 SEP 2023 7:39PM by PIB Hyderabad

అలాగే శ్రీ జగదీప్ ధన్ఖర్ వినైల్ కోటింగ్ కలిగిన కామాఖ్యా ఎక్స్ప్రెస్ను వారణాశి స్టేషన్ నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. పారిశుధ్యం , పరిశుభ్రమైన నీటి ప్రాధాన్యతను మరింతగా తెలియజేసేందుకు,
రైల్వే మంత్రిత్వ శాఖ సహకారంతో హిమసాగర్ ఎక్స్ ప్రెస్, కామాఖ్య ఎక్స్ప్రెస్ లకు పానీ కీ రెయిల్ కార్యక్రమం కింద జాతీయ జల మిషన్ లో భాగంగా ఈ రెండు రైళ్లపై వినైల్ కోటింగ్ తో ప్రచార సందేశాన్ని పొందుపరిచారు.
ఈ రైళ్లు దేశం అంతటా తిరుగుతాయి కనుక జల సంరక్షణ, నిర్వహణకు సంబంధించిన సందేశం దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరుతుంది.
ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా భారీ ప్రాజెక్టులకు సంబంధించిన జాతీయ రిజిస్టర్ ను ప్రారంభించారు. ఇద వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ ఏజెన్సీలను సంప్రదించిన తర్వాత దీనిని రూపొందించారు.

 ప్రారంభ సమావేశంలో మాట్లాడుతూ, ఉపరాష్ట్రపతి డ్యామ్‌ల ప్రాధాన్యతను ప్రస్తావించారు. డ్యామ్‌లు మన భూమికి జీవనాడుల వంటివి. ఇవి సహకార స్ఫూర్తికి, పట్టుదలకు, మానవ చాతుర్యానికి నిదర్శనమని అన్నారు. నీటినిర్వహణతో భారతదేశానికి గల సంబంధం గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఉపరాష్ట్రపతి, బారతీయ నాగరికత వేలాది సంవత్సరాలుగా  నదీ తీరాల వెంట సాగిందని,ఆ నదులపైనే ఆధారపడి ముందుకు సాగిందని తెలిపారు.
 ప్రాచీన శాస్త్రాలైన వేదాలు,, కౌటిల్యుడి అర్థశాస్త్ర ం వంటివి డ్యామ్‌ల నిర్మాణం, రిజర్వాయర్ల నిర్మాణం ద్వారా ఒక పద్ధతి ప్రకారం నీటిని నిర్వహించడం గురించి ప్రస్తావించాయని, వీటి ద్వారా కరవులను ఎదుర్కొనవచ్చని తెలిపాయని అన్నారు. 2021లో డ్యామ్‌ సేఫ్టీ యాక్ట్‌ 2021ని తీసుకురావడాన్ని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు.
ఇది డ్యామ్‌ల  రక్షణలో ఇండియా కట్టుబాటును తెలియజేస్తున్నదన్నారు. డ్యామ్‌ పునరావాస, మెరుగుదల ప్రాజెక్టు తొలి దశను విజయవంతంగా పూర్తిచేసినందుకు ఆయన అభినందనలు తెలిపారు. ఇటీవల రెండు, మూడో దశలలో చేపట్టిన చర్యలు వివిధ రాష్ట్రాలలో డ్యామ్‌ సేఫ్టీని బలోపేతం చేస్తాయన్నారు.

ఉపరాష్ట్రపతి సెక్రటేరియట్‌ జారీచేసిన పత్రికా ప్రకటన:   https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1957410
ఈ సమావేశానికి హాజరైన వారినుద్దేశించి ప్రసంగిస్తూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్‌ షెకావత్‌, డ్యామ్‌ల వల్ల కలిగే పలు ప్రయోజనాల గురించి వివరించారు. ఇవి ఏ రకంగా భారతదేశ నీటి నిర్వహణలో కీలకపాత్ర పోషించాయో,వరద నియంత్రణకు ఏ రకంగా తోడ్పడ్డాయో, తెలియజేశారు. డ్యామ్‌ రక్షణ గురించి ప్రస్తావిస్తూ మంత్రి, డ్యామ్‌ సేఫ్టీ చట్టాన్ని 2021లో తీసుకు రావడం గురించి ప్రస్తావించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ మార్గనిర్దేశంలో కీలక రెగ్యులేటరీ యంత్రాంగానికి సంబంధించిన ఫ్రేమ్‌ వర్క్‌, డ్యామ్‌ యజమాన్యానికి సంబంధించి  ఏకీకృత ప్రోటాకాల్స్‌ వంటివి రూపుదిద్దుకున్నట్టు తెలిపారు.

ఇండియాలో 280 డ్యామ్‌లు ఉన్నాయని, ఇందులో కొన్ని దాదాపు వందసంవత్సరాల నాటివని ఆయన శ్రీగజేంద్ర సింగ్‌ షెకావత్‌ తెలిపారు. ఇందులో 80 శాతం పైగా 25 సంవత్సరాలకు పైబడినవని తెలిపారు. ఈ సదస్సఉ డ్యామ్‌లు వాటి భద్రతకు సంబంధించి వివిధ స్టేక్‌ హోల్డర్లతొ చర్చించడానికి , విజ్ఞానాన్ని పంచుకోవడానికి దోహదపడుతుందని అన్నారు. డ్యామ్‌ ల భద్రత విషయంలో జలశక్తి మంత్రిత్వశాఖకుఅన్ని రాష్ట్రాలు మద్దతునిస్తున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి భూకంపాలకు సంబంధించి జాతీయ కేంద్రాన్ని జైపూర్‌ లోని ఎం.ఎన్‌.ఐ.టిలో ఈ కార్యక్రమానికి ముందు ప్రారంభించారు. ఈ కేంద్రం  ఇండియాలోని
డ్యామ్‌లకు సంబంధించి , నిర్మాణాత్మక, భూకంప భద్రతకు వీలు కల్పిస్తుంది.
జలవనరుల శాఖ కార్యదర్శి ఆర్‌డి.జిఆర్‌ శ్రీపంకజ్‌ కుమార్‌ మాట్లాడుతూ, నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌.డి.ఎస్‌.ఎ), డ్యామ్‌ ల భద్రతపై జాతీయ కమిటీ సంస్థ (ఎన్‌.సి.డి.ఎస్‌), డ్యామ్‌ ల భద్రతపై స్టేట్‌ కమిటీ (ఎస్‌.సి.డి.ఎస్‌), స్టేట్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ (ఎస్‌.డి.ఎస్‌.ఒ) వంటివి డ్యామ్‌ భద్రతకు సంబంధించిన అంశాలలో ఇమిడి ఉన్నాయి.డ్యామ్‌ పునరావాసం, మెరుగుదల ప్రాజెక్టుకు సంబంధించి (డిఆర్‌ఐపి`పేజ్‌ 1) కరు సంబంధించి సాధించిన విజయాలను వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు.అలాగే ఐఐటి రూర్కీలో ,ఐఐఎస్‌సి బెంగళూరులో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సుల ఏర్పాటు గురించి కూడా ప్రస్తావించారు.అలాగే డ్యామ్‌ భత్రకు సంబంధించి సామర్ధ్యాల నిర్మాణానికి వీలుగా ఎం.టెక్‌ కోర్సులను ప్రారంభించడం గురించి కూడా ప్రస్తావించారు.

 ఈ ఈవెంట్‌ సంప్రదాయ జల కలశ్‌  ఉత్సవంతో ప్రారంభమైంది.  లిబియాలో జరిగిన విషాదఘటనకు, విధ్వంసానికి, ప్రాణనష్టానికి ఒక నిమిషం మౌనం పాటించి మరణించిన వారికినివాళి అర్పించారు. ఈ సదస్సు సందర్భంగా ఒక ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. డ్యామ్‌ల భధ్రతకు సంబంధించిన వివిధ ఉత్పత్తులు, చార్టులు, బ్యానర్లు, సాంకేతిక ఆవిష్కరణలు, వినూత్న పరిష్కారాలను ఈ సందర్భంగా ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఈ ఎగ్జిబిషన్‌ ను కూడా ఈరోజు ప్రారంభించారు.
ఈ సమావేశం ప్రారంభ కార్యక్రమంలో త్రిపుర ముఖ్యమంత్రి శ్రీ మనిక్‌ షా, కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ డి.కె.ఙవం కుమార్‌, రాజస్థాన్‌ జలవనరుల శాఖ మంత్రి శ్రీ మహేంద్రజీత్‌ సింగ్‌ మాలవియ, రాజస్థాన్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఉషా శర్మ, జలవనరుల విభాగం కార్యదర్శి శ్రీ పంకజ్‌ కుమార్‌, వివిధ  జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు, సీనియర్‌ అధికారులు, సంబంధిత వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశానికి సుమారు 800 మంది హాజరయ్యారు. వీరిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, విద్యావేత్తలు, ప్రపంచబ్యాంకు అధికారులు, వివిధ దేశాల ప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ అధికారులు, డ్యామ్‌ల  యాజమాన్యాలు ఉన్నాయి. సుమారు 40 మంది అంతర్జాతీయ ప్రతినిధులు 15 దేశాలనుంచి ఈ ఈవెంట్‌ లో పాల్గొన్నారు.

 

***


(Release ID: 1957928) Visitor Counter : 134
Read this release in: English , Urdu , Hindi