బొగ్గు మంత్రిత్వ శాఖ
గవర్నమెంట్ ఈ-మార్కెట్‌ప్లేస్ (జెమ్) సేకరణల్లో అగ్రస్థానంలో బొగ్గు మంత్రిత్వ శాఖ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జెమ్ ద్వారా రూ.23,798 కోట్లకు చేరుకున్న సేకరణలు
प्रविष्टि तिथि:
15 SEP 2023 4:40PM by PIB Hyderabad
ఈ సంవత్సరం 1 బిలియన్ టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తిని సాధించాలన్న ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ సంపూర్ణ పారదర్శక, సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటోంది, వేగవంతమైన ప్రణాళికలను పాటిస్తోంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ 14 నాటికి, జెమ్ ద్వారా చేసిన సేకరణలు ఆకట్టుకునే స్థాయిలో రూ.23,798 కోట్లకు చేరుకున్నాయి. దీంతో, 2023-24 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న రూ.21,325 కోట్ల వార్షిక లక్ష్యాన్ని బొగ్గు మంత్రిత్వ శాఖ రెండో త్రైమాసికంలోనే అధిగమించింది. ఎఫ్‌వై 2022-23లో, బొగ్గు మంత్రిత్వ శాఖ (తన సీపీఎస్‌ఈలతో సహా) జెమ్ ద్వారా వస్తువులు & సేవల కోసం రూ.4000 కోట్లను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని అధిగమించి, రూ.4,278 కోట్లకు చేరుకుంది, ఇది 107% సాధన రేటును సూచిస్తోంది. సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించడానికి జెమ్ బృందం, సీఐఎస్ సేకరణ బృందం మధ్య నెలకొన్న పరస్పర సహకారం ద్వారా ఈ విజయం సాధ్యమైంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ 14 నాటికి, కోల్ ఇండియా లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు రూ.23,363 కోట్లతో జెమ్ సేకరణల్లో ముఖ్య పాత్ర పోషించాయి. ఇది, 2023-24 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న వాస్తవ లక్ష్యం కంటే 17% ఎక్కువ. ఈ విజయంతో, జెమ్ సేకరణల్లో కోల్ ఇండియా లిమిటెడ్ దేశంలోనే ప్రముఖ సీపీఎస్‌ఈగా అవతరించింది.
గవర్నమెంట్ ఈ-మార్కెట్‌ప్లేస్‌ను 2016 ఆగస్టులో ప్రారంభించారు. డిజిటలీకరణను స్వీకరించడం ద్వారా గత టెండర్ ప్రక్రియలను ఆధునీకరించడం, ప్రభుత్వ సేకరణల్లో సమగ్రత, పారదర్శకతను పెంచడం దీని లక్ష్యం. ప్రారంభమైన నాటి నుంచి ఈ ఏడు సంవత్సరాల్లో, బొగ్గు మంత్రిత్వ శాఖ ఈ డిజిటల్ పరివర్తన ప్రయత్నానికి మద్దతుగా నిలిచింది.
జెమ్ ద్వారా బొగ్గు మంత్రిత్వ శాఖ భారీ సేకరణలు చేపట్టింది. పారదర్శక, సమర్థవంతమైన సేకరణ ప్రక్రియలను సులభంగా మార్చడంలో ఈ వేదిక ప్రభావం, సామర్థ్యానికి ఇవి గుర్తులు. బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన సీపీఎస్‌ఈలు జెమ్‌ను విస్తృతంగా వినియోగిస్తున్నాయి. మొత్తం సేకరణల వ్యవస్థను సరళీకృతం చేయడం, మెరుగుపరచడంలో జెమ్ విజయాన్ని ఇవి స్పష్టం చేస్తున్నాయి.
***
(रिलीज़ आईडी: 1957926)
आगंतुक पटल : 193