వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పెండింగ్‌ అంశాలను పరిష్కరించడం, స్వచ్ఛత ప్రచారం కోసం 2023 అక్టోబర్ 2 నుంచి 31 వరకు ప్రత్యేక ప్రచారం 3.0లో పాల్గొనేందుకు సిద్ధమైన కేంద్ర ఆహారం & ప్రజా పంపిణీ విభాగం

Posted On: 15 SEP 2023 2:34PM by PIB Hyderabad

కేంద్ర ఆహారం & ప్రజాపంపిణీ విభాగం (డీఎఫ్‌పీడీ), తన పీఎస్‌యూలు, అనుబంధ సంస్థల కార్యాలయాలతో కలిసి ఈ ఏడాది 2 అక్టోబర్ నుంచి 31 వరకు ప్రత్యేక ప్రచారం 3.0లో పాల్గొంటుంది. కేంద్ర పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రచారం, సంస్థాగతంగా స్వచ్ఛతను పెంచుతుంది & ప్రభుత్వ కార్యాలయాల విధుల్లో జాప్యాన్ని తగ్గిస్తుంది. ప్రత్యేక ప్రచారం 3.0 సన్నాహక దశ సెప్టెంబర్ 15న ప్రారంభమైంది.

2022 నవంబర్ నుంచి 2023 ఆగస్టు వరకు జరిగిన ప్రత్యేక ప్రచారం 2.0లో  కేంద్ర ఆహారం & ప్రజాపంపిణీ విభాగం గొప్ప ఉత్సాహంతో పాల్గొంది.

స్వచ్ఛ భారత్‌కు అనుగుణంగా, 3,437 ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాలను ఈ విభాగం నిర్వహించింది. స్వచ్ఛత శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు, పరిశుభ్రత కార్యకలాపాల కోసం వారానికి 3 గంటల సమయం కేటాయించడం, వ్యర్థాల నిర్వహణ, తోటల పెంపకం, క్రమం తప్పకుండా పరిశుభ్రత కార్యక్రమాలు, సామగ్రి ఆధునీకరణ, పాత ఫైళ్లను తొలగించడం/పరిశీలించడం, చెదల నియంత్రణ వంటి చాలా కార్యకలాపాలను చేపట్టింది.

అధికారులు, సిబ్బందితో స్వచ్ఛత ప్రమాణం చేయిస్తున్న కేంద్ర ఆహారం & ప్రజాపంపిణీ విభాగం కార్యదర్శి సంజీవ్ చోప్రా 

2022 నవంబర్ నుంచి 2023 ఆగస్టు మధ్య కాలంలో ఆహారం & ప్రజా పంపిణీ విభాగం సాధించిన విజయాల్లోని ముఖ్యాంశాలు:

  • 12,57,706 దస్త్రాల సమీక్ష, 5,92,354 భౌతిక దస్త్రాలు తొలగింపు
  • 99,105 చ.అ. విస్తీర్ణాన్ని అందుబాటులోకి తీసుకురావడం
  • 9,783 ఈ-దస్త్రాల పరిష్కారం
  • కాలం చెల్లిన వస్తువుల వేలం ద్వారా రూ.77.88 లక్షల ఆదాయం ఆర్జన

కార్యాలయ పరిసరాలను అందంగా, పరిశుభ్రంగా ఉంచడానికి, డీఎఫ్‌పీడీ తన ఆధ్వర్యంలోని అన్ని పీఎస్‌యూలు/అనుబంధ కార్యాలయాల సీనియర్ అధికారులతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించింది. స్వచ్ఛత కార్యకలాపాలను సమీక్షించడానికి లేదా పర్యవేక్షించడానికి సీనియర్ అధికారులు ఆకస్మిక పర్యటనలు కూడా చేపట్టారు.

గత ప్రచారం ఆదర్శాలు, ఉద్దేశాలను కొనసాగించడానికి, ప్రత్యేక ప్రచారం 3.0 లక్ష్యాలను సాధించడానికి ఆహారం & ప్రజా పంపిణీ విభాగం కట్టుబడి ఉంది.

 

WhatsApp Image 2021-10-25 at 6.31.24 PM

 

WhatsApp Image 2021-10-25 at 6.31.23 PM (1)

4.jpeg

3.jpeg

Slide7

 

Slide7

IMG_20211021_143607

IMG_20211021_143516

IMG_20211022_105258

IMG_20211022_105135

WhatsApp Image 2021-10-21 at 3.23.07 PM (1)

WhatsApp Image 2021-10-21 at 3.23.07 PM

WhatsApp Image 2021-10-19 at 10.49.13 AM (1)

WhatsApp Image 2021-10-19 at 10.49.14 AM (1)

 

****


(Release ID: 1957731) Visitor Counter : 130


Read this release in: Tamil , English , Urdu , Hindi