శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సీ ఎస్ ఐ ఆర్ - ఎన్ ఐ ఎస్సి పీ ఆర్ ఒక వారం ఒక ప్రయోగశాల ప్రోగ్రామ్ కింద విద్యార్థులు-సైన్స్ అనుసంధానం ఈవెంట్ నిర్వహించబడింది.

Posted On: 15 SEP 2023 10:57AM by PIB Hyderabad

సీ ఎస్ ఐ ఆర్ - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (ఎన్ ఐ ఎస్సి పీ ఆర్-) ఒక వారం ఒక ప్రయోగశాల ప్రోగ్రామ్‌లో భాగంగా 13 సెప్టెంబర్ 2023న న్యూ ఢిల్లీలో "విద్యార్థులు-సైన్స్ అనుసంధానం ప్రోగ్రామ్"ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయ వికాస్పురి, కేంద్రీయ విద్యాలయ ద్వారక, ఎంఎం పబ్లిక్ స్కూల్‌కు చెందిన 150 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఎన్ ఐ ఎస్సి పీ ఆర్- జిగ్యాస శిక్షణ మరియు హెచ్‌ఆర్ విభాగం అధిపతి శ్రీ సి.బి. సింగ్, కార్యక్రమ సారాంశాన్ని అందించారు. ఎన్ ఐ ఎస్సి పీ ఆర్- డైరెక్టర్ ప్రొఫెసర్ రంజనా అగర్వాల్  పరిచయ వ్యాఖ్యలు  చేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ ప్రోగ్రాం కోసం ఎంపిక చేసిన రెండు నేపథ్య అంశాలైన మినుములు మరియు శాస్త్రీయంగా ధృవీకరించబడిన భారతీయ సాంప్రదాయ జ్ఞానం యొక్క ఔచిత్యాన్ని ప్రొఫెసర్ అగర్వాల్ నొక్కిచెప్పారు.

 

ఎన్‌ఐఎస్‌సిపిఆర్ జిగ్యాసా 2022-2023 వార్షిక నివేదికను కూడా ఈ వేడుకలో ప్రముఖులు ఆవిష్కరించారు.

 

ఈ కార్యక్రమంలో మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి మండే మరియు న్యూఢిల్లీలోని ఎ ఎస్ ఆర్ బీ చైర్మన్ డాక్టర్ సంజయ్ కుమార్ కూడా పాల్గొన్నారు. సీ ఎస్ ఐ ఆర్ - ఎన్ ఐ ఎస్సి పీ ఆర్ ద్వారా అడుగంటుతున్న భారతీయ సాంప్రదాయ విజ్ఞానాన్ని పరిరక్షించడం మరియు పునరుజ్జీవింపజేయడం కోసం చేపట్టిన ప్రయత్నాలను డాక్టర్ మండే హైలైట్ చేశారు.  ఎన్ ఐ ఎస్సి పీ ఆర్ ప్రచురణ "వెల్త్ ఆఫ్ ఇండియా" యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. డా. సంజయ్ కుమార్ ఆనందం తో చదువు కోవడం, టీమ్ వర్క్ ద్వారా నేర్చుకోవడం యొక్క ప్రాముఖ్యతను,  కుటుంబం బంధువులతో అర్థవంతమైన సంబంధాలను ఏర్పరచుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శర్మిష్ఠ బెనర్జీ ముఖ్యోపన్యాసం చేశారు. ప్రొఫెసర్ బెనర్జీ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలకు చంద్రయాన్-3, కోవిడ్-19 వ్యాక్సిన్‌ల అభివృద్ధి, 3డి ఆర్గాన్ ప్రింటింగ్ టెక్నాలజీ వంటి ముఖ్యమైన ఉదాహరణలతో భారతదేశం సహకారాన్ని గురించి మాట్లాడారు.  ఎన్ ఐ ఎస్సి పీ ఆర్ జిగ్యాసా 2022-2023 వార్షిక నివేదికను కూడా వేడుకలో ఆవిష్కరించారు.

 

ఈ సందర్భంగా, సీ ఎస్ ఐ ఆర్ - ఎన్ ఐ ఎస్సి పీ ఆర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సుమన్ రే విద్యార్థులకు వారి పోషకాహార ప్రొఫైల్‌లు మరియు సాంప్రదాయ వంటకాలతో కూడిన మిల్లెట్ యొక్క పోషక ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. సీ ఎస్ ఐ ఆర్ - ఎన్ ఐ ఎస్సి పీ ఆర్లోని ప్రిన్సిపల్ సైంటిస్ట్ & పీ ఐ - స్వస్తిక్ డా. చారు లత, భారతీయ సాంప్రదాయ విజ్ఞానం  సంరక్షణ మరియు శాశ్వతత్వం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, "సమాజానికి శాస్త్రీయంగా ధృవీకరించబడిన సాంప్రదాయ జ్ఞానాన్ని ప్రసారం చేయడం (స్వస్తిక్)" అనే అంశంపై ప్రసంగించారు. శాస్త్రీయంగా ధృవీకరించబడిన సాంప్రదాయ విజ్ఞానాన్ని సమాజానికి అందించడం లో జాతీయ చొరవ స్వస్తిక్ కింద సీ ఎస్ ఐ ఆర్ - ఎన్ ఐ ఎస్సి పీ ఆర్ చేసిన కృషిని డాక్టర్ లత హైలైట్ చేశారు. సీ ఎస్ ఐ ఆర్ - ఎన్ ఐ ఎస్సి పీ ఆర్  శాస్త్రవేత్త డాక్టర్ పరమానంద బర్మాన్ సాంప్రదాయ పరిజ్ఞానంపై వినోదాత్మకంగా క్విజ్ పోటీని నిర్వహించారు.  సైన్స్ కమ్యూనికేషన్ థీమ్‌పై కేంద్రీకరించిన తోలుబొమ్మల ప్రదర్శన క్విజ్‌ను విజయవంతం నిర్వహించారు. సీ ఎస్ ఐ ఆర్ - ఎన్ ఐ ఎస్సి పీ ఆర్ లోని ముడి పదార్థాల హెర్బేరియం మరియు మ్యూజియం మరియు ఆయుర్వాటిక సందర్శనతో కార్యక్రమం ముగిసింది.

 

***


(Release ID: 1957641)
Read this release in: English , Urdu , Hindi , Tamil