ఆర్థిక మంత్రిత్వ శాఖ
స్వచ్ఛత 2.0 కోసం ప్రత్యేక ప్రచారంలో భాగంగా నవంబర్ 2022 నుంచి ఆగస్టు 2023 వరకు 2 లక్షలకు పైగా ప్రజా ఫిర్యాదులను పరిష్కరించిన డిఎఫ్ ఎస్
Posted On:
14 SEP 2023 8:35PM by PIB Hyderabad
పెండెన్సీని తగ్గించి, స్వచ్ఛతను వ్యవస్థీకరించేందుకు 2 అక్టోబర్ నుంచి 31 అక్టోబర్ 2022 వరకు సాగిన స్వచ్ఛత 2.0పై ప్రత్యేక ప్రచారాన్ని ఆర్ధిక సేవల విభాగం (డిఎఫ్ఎస్), దాని సంస్థలు చేపట్టాయి. కాగా, 31 అక్టోబర్ 2022 నాటికే 80% లక్ష్యాన్ని సాధించిన డిఎఫ్ఎస్, నవంబర్ 2022 నుంచి ఆగస్టు 2023 వరకు తన పనిని కొనసాగించడమే కాక, ప్రచారం పురోగతిని నెలవారీగా పర్యవేక్షించింది.
విభాగం,నవంబర్ 2022 నుంచి2023నెలల మధ్య సాధించిన విజయాలు& కీలకాంశాలు ఈ విధంగా ఉన్నాయిః
- ప్రజాఫిర్యాదుల పరిష్కారంః 2,09,398
- ప్రజాఫిర్యాదుల అప్పీళ్ళ పరిష్కారంః 39,816
- శుభ్రం చేసిన ప్రదేశాలు/ కార్యాలయాలుః 523
- ఖాళీ చేసిన చోటుః 71,968 చదరపు అడుగులు
- తుక్కును విసర్జించడం ద్వారా ఆర్జించిన ఆదాయంః రూ. 1,4, 87, 364
భారత ప్రభుత్వం స్వచ్ఛత, ప్రభుత్వ కార్యాలయాలలో పూర్తిగా పెండెన్సీ తగ్గించాలన్న విధానంతో 2 అక్టోబర్ 2023 నుంచి 31 అక్టోబర్ 2023 వరకు ప్రత్యేక ప్రచారం 3.0ను ప్రకటించింది.
ప్రచారాన్ని ముందుకు తీసుకువెడుతూ, డాక్టర్ జితేంద్ర సింగ్ గురువారం నాడు స్వచ్ఛత ప్రత్యేక ప్రచారం 3.0 కోసం ఉద్దేశించిన వెబ్‌పోర్టల్ https://scdpm.nic.in,ను న్యూఢిల్లీలో ప్రారంభించారు. కాగా, సన్నాహక దశ 15 సెప్టెంబర్ నుంచి 30 సెప్టెంబర్ 2023 సాగనుంది. ఈ సమయంలో మంత్రిత్వ శాఖలు / విభాగాలు ఎంపిక చేసిన వర్గాలలో పెండెన్సీని గుర్తించి, ప్రచార ప్రదేశాలను ఖరారు చేస్తారు.
డిఎఫ్ఎస్ ఇప్పటికే అధికారులందరినీ ఈ విషయమై జాగృతపరిచి, కార్యకలాపాలను కొనసాగించి, తమ తమ సంస్థలలో ప్రత్యేక ప్రచారం 3.0ను ప్రారంభించవలసిందిగా తమ కార్యాలయాలకు సమాచారమిచ్చింది.
***
(Release ID: 1957586)
Visitor Counter : 121