కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
వాటాదారుల వ్యాఖ్యల కోసం వినియోగదారుల సంస్థల (సవరణ) నిబంధనలు, 2023 ముసాయిదాను గురువారం విడుదల చేసిన టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) వాటాదారుల వ్యాఖ్యల కోసం వినియోగదారుల సంస్థల (సవరణ) నిబంధనలు, 2023 ముసాయిదాను ఈరోజు విడుదల చేసింది.
Posted On:
14 SEP 2023 6:10PM by PIB Hyderabad
వినియోగదారుల సంఘాల నిబంధనలు 2013 (1 ఆఫ్ 2013) (ఇకపై ప్రధాన నిబంధనలుగా ప్రస్తావిస్తూ) సంఘాలను నమోదు చేసుకోవడానికి 21 ఫిబ్రవరి 2013న టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( టిఆర్ ఎఐ -ట్రాయ్) నోటిఫై చేసింది.
నిబంధనలలో ప్రస్తావించిన తమ పాత్రలను నిర్వహిస్తూ అథారిటీకి తోడ్పడేందుకు రాష్ట్రాలవారీగా ప్రధాన నిబంధనల కింద వినియోగదారుల సంఘాలను అథారిటీ ప్రస్తుతం నమోదు చేసుకుంటోంది.
వేగంగా పరిణామం చెందుతున్న డిజిటల్ చిత్రటంలో, 5జి, 6జి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి) తదితర సాంకేతికతలు వినియోగదారుల జీవితాలను మెరుగుపరచడంలో అత్యంత సంభావ్యతను కలిగి ఉన్నాయి. ఈ సాంకేతికతలను ఉపయోగించడం అన్నది సమాజంలోని వివిధ వర్గాలకు తోడ్పడనుంది. వాస్తవ సమయంలో మార్కెట్ సమాచారాన్ని పొందడం, వనరుల నిర్వహణను అనుకూలపరచడం, పంట దిగుబడులను పెంచడం వంటి వివిధ అవకాశాలను ఎఐ & ఐఒటి సమాజాలకు అందిస్తాయి. ఎఐ ఆధారిత వాతావరణ సూచనలతో పాటు ఐఒటి సెన్సార్ పరికరాలు రైతులు సరైన సమాచారంతో కూడిన వ్యవసాయ నిర్ణయాలు తీసుకోవడంలో తోడ్పడే అవకాశముంది.
5జి సామర్ధ్యం కలిగిన హైస్పీడ్ అనుసంధానత అంతర్జాతీయ పోటీని పెంపొందించేందుకు, ఉత్పత్తి, సరఫరా గొలుసులు, వినియోగదారుల అనుభవాలను మెరుగుపరిచేందుకు ఎఐ ఆధారిత విశ్లేషణలతో వ్యాపారాలు, స్టార్టప్‌లకు సామర్ధ్యాన్ని ఇస్తుంది.
మారుమూల ప్రాంతాల్లో మెరుగైన 5జి సేవల ద్వారా ఆన్‌లైన్ విద్య, రీమోట్ ఆరోగ్య సంరక్షణను, ఐఒటి ఆధారిత విపత్తు అంచనా, ప్రతిస్పందన వ్యవస్థలు పర్యావరణ సుస్థిరతను బలోపేతం చేసి, బడుగు, బలహీన వర్గాల సమూహాలకు విపత్తును ఎదుర్కొనే శక్తిని కల్పిస్తాయి. ఈ సాంకేతికతలను సమర్ధవంతంగా ఉపయోగించినప్పుడు సమ్మిళిత వృద్ధిని పెంచి, ప్రాప్యతను మెరుగుపరిచి, సామాజిక -ఆర్ధిక అంతరాలను తగ్గించగలవు.
ఈ అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల నుంచి పొందే ప్రయోజనాల గురించి అవగాహన పెంచడంలో వినియోగదారుల సంస్థలు సహాయక పాత్రను పోషిస్తాయి. ముఖ్యంగా బడుగు వరా్గలకు, గ్రామీణ ప్రాంతాలలో డిజిటల్ అంతరాన్ని పూడ్చేందుకు ఈ అవగాహనను కల్పిస్తాయి. ఈ ఇతివృత్త ఆధారిత కార్యక్రమాలను నిర్వహించేందుకు ఈ సంఘాలు ఈ సాంకేతికతల ఉపయోగాలను వివరించి, మహిళలు, రైతులు, బెస్తవారు, విద్యార్ధులు తదితర వర్గాలకు సంభావ్య లాభాల గురించి అవగాహన పెంచడంలో, సైబర్ పారిశుద్ధ్యాన్ని ప్రచారం చేసి, డాటా గోప్యత గురించి వినియోగదారులలో చైతన్యాన్ని పెంచేందుకు ట్రాయ్‌కు తోడ్పడతాయి.
వివిధ రాష్ట్రాలు/ యుటిలలో ఉనికిని కలిగి ఉండి, ప్రచారం చేయడంలో, ఇతివృత్త ఆధారిత కార్యక్రమాలను నిర్వహించడంలో సామర్ధ్యం, అనుభవం కలిగి ఉండటం ద్వారా అవగాహనా సామాగ్రిని అభివృద్ధి చేయడం ద్వారా వినియోగదారులు, అథారిటీ మధ్య వినిమయ సీమను అందించగలిగే జాతీయ వినియోగదారు సంఘాలను నమోదు చేయవలసిన అవసరం ఉందని అథారిటీ భావించింది. ప్రతిపాదిల సవరణ జాతీయ స్థాయి నమోదులో ఐదు కంటే ఎక్కువ రాష్ట్రాలు/ యుటిలలో పని చేయడానికి విస్త్రత పరిధితో సమర్ధత కలిగిన వినియోగదారు సంస్థలను నమోదు చేయడానికి అథారిటీని అనుమతిస్తుంది. అంతేకాకుండా, ఇది అటువంటి వినియోగదారు సంస్థల నమోదు ప్రక్రియను సులభతరం చేస్తుంది.
ముసాయిదా నిబంధన ట్రాయ్ వెబ్‌సైట్ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు. టిఆర్ఎఐ. జిఒవి. ఐఎన్ ( www.trai.gov.in )లో అందుబాటులో ఉండటమే కాక ఏవైనా స్పష్టీకరణల కోసం 4 అక్టోబర్ 2023 వరకు భాగస్వాముల అభిప్రాయాలను స్వాగతిస్తుంది. ట్రాయ్ సలహాదారు (సిఎ& ఐటి) శ్రీ ఆనంద్‌కుమార్‌ను స్పష్టీకరణల కోసం టెలిఫోన్‌లో ః011-23210990 కానీ లేదా ఇమెయిల్ ఐడిః advisorit@trai.gov.in. ద్వారా కానీ సంప్రదించవచ్చు.
***
(Release ID: 1957580)
Visitor Counter : 130