వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
గ్వాలియర్‌లోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదామును ఆకస్మికంగా తనిఖీ చేసిన కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్
సిసిటివి కెమెరాల పని, ఆహార ధాన్యాల నిర్వహణ, సంరక్షణ, నిర్వహణ , డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా అమలు జరుగుతున్న డిపో ఆన్‌లైన్ సిస్టమ్ (DOS) , గిడ్డంగి ఆవరణలో పరిశుభ్రత పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన శ్రీ పీయూష్ గోయల్
Posted On:
14 SEP 2023 7:40PM by PIB Hyderabad
కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, జౌళి మరియు వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈరోజు గ్వాలియర్‌లోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) గోడౌన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
5.5 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న డిపో మొత్తం పనితీరును మంత్రి సమీక్షించారు. 15156 ఎంటీ నిల్వ సామర్థ్యం గల గిడ్డంగిలో ప్రస్తుతం 1199 ఎంటీ ఆహారధాన్యాలు ఉన్నాయి.
డిపోలో సమగ్ర భద్రత, నిల్వల సంరక్షణ, సంరక్షణ మరియు తరలింపు మొదలైన వాటి కోసం ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాల పనితీరును ఆయన ప్రశంసించారు. డిజిటల్ ఇండియాలో భాగంగా అమలు జరుగుతున్న ఆన్‌లైన్ సిస్టమ్ (DOS) డిపో ఆవరణ పరిశుభ్రత పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా ప్రస్తుత ప్రమాణాలను కొనసాగించాలని కేంద్ర మంత్రి సూచించారు.
డిపో ఆవరణలో శ్రీ గోయల్ మొక్కలు నాటారు. భారత ఆహార సంస్థ మధ్యప్రదేశ్ ప్రాంతీయ జనరల్ మేనేజర్ శ్రీ వినేష్ గర్పలే,డివిజనల్ మేనేజర్-గ్వాలియర్ శ్రీ బల్వంత్ సింగ్, ఇతర అధికారులు శ్రీ రాజ్ కుమార్ శాక్య, మేనేజర్-పర్సనల్, శ్రీ సుమేర్ సింగ్ మీనా, మేనేజర్-డిపో, శ్రీమతి దీపా అహిర్వార్, మేనేజర్-QC , శ్రీ పురాణ్ మల్ మీనా, మేనేజర్-డిపో, శ్రీ ఘనశ్యామ్ మీనా, మేనేజర్-డిపో మరియు ఇతర ఉద్యోగులు మరియు FSD-గ్వాలియర్ కార్మికులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1957578)