జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వచ్ఛతకు ప్రచారం, పెండింగ్‌లో ఉన్న సూచనల పరిష్కారం కోసం 2 అక్టోబర్ - 31 అక్టోబర్, 2023 నుండి ప్రత్యేక ప్రచారం 3.0లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న త్రాగునీరు మరియు పారిశుద్ధ్య శాఖ, జల శక్తి మంత్రిత్వ శాఖ.

प्रविष्टि तिथि: 13 SEP 2023 7:51PM by PIB Hyderabad

        స్వచ్ఛతను సంస్థాగతీకరించడం,  ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌ను తగ్గించడం అనే లక్ష్యాన్ని నెరవేర్చే ఉద్దేశంతో పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా సమస్యల శాఖ (DARPG) 2023 అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు ప్రత్యేక ప్రచార 3.0  నిర్వహణకు మార్గదర్శకాలు  విడుదల చేసింది.

         తదనుగుణంగా తాగునీరు, పారిశుద్ధ్య శాఖ (DDWS)  2 అక్టోబర్ - 31 అక్టోబర్, 2023 వరకు ప్రచారం 3.0 మరియు 15 సెప్టెంబర్ 2023 నుండి ప్రారంభమయ్యే ప్రచార సన్నాహక  దశ చేపడుతోంది.

2. DDWS తన సచివాలయంలో , తన పరిపాలన నియంత్రణలో ఉన్న క్షేత్ర కార్యాలయంలో 2వ అక్టోబర్ నుంచి 31 అక్టోబర్, 2022 మధ్య కాలంలో పెండింగ్‌లో ఉన్న సూచనలను  పరిష్కరించడం  మరియు స్వచ్ఛత ప్రత్యేక ప్రచారం 2.0లో కూడా పాల్గొన్నారు.  2 అక్టోబర్ - 31 అక్టోబర్, 2022 నుంచి ప్రత్యేక ప్రచారం అమలు దశలో  VIPల  సూచనలు, IMC సూచన, రాష్ట్ర ప్రభుత్వం  సూచన, PMO సూచనలు, పబ్లిక్ గ్రీవెన్స్ మరియు PG అప్పీల్స్ వంటి పెండింగ్‌లో ఉన్న వివిధ శ్రేణుల సూచనలు/సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించారు మరియు గుర్తించిన ఫైళ్లను సమీక్షించారు. ప్రత్యేక ప్రచారం ఫలితంగా, 600 చదరపు అడుగుల స్థలం ఉత్పత్తి చేయడం/కనుగొనడం  జరిగింది. ప్రచార సమయంలో సాధించిన విజయాలు DARPGచే సృష్టించబడిన SCDPM పోర్టల్‌లో కూడా అప్‌లోడ్ చేయడం జరిగింది. ఈ ప్రత్యేక కార్యక్రమం ప్రచారంలో సామాజిక మాధ్యమం  కూడా నిమగ్నమైంది.

3. ప్రత్యేక ప్రచారం 2.0 కింద ప్రయత్నాలను  ప్రచారం తర్వాత కూడా నవంబర్, 2022 నుంచి ఆగస్టు, 2023 వరకు కొనసాగించడం జరిగింది. నవంబర్, 2022 - ఆగస్టు, 2023 మధ్యకాలంలో పెండింగ్‌లో ఉన్న సూచనలు పరిష్కరించడంలో సాధించిన విజయాల ముఖ్యాంశాలు క్రింది విధంగా ఉన్నాయి:

(i) VIP సూచనలు - 48
(ii) రాష్ట్ర ప్రభుత్వ సూచనలు - 88
(iii) పబ్లిక్ గ్రీవెన్స్ - 3428
(iv) పబ్లిక్ గ్రీవెన్స్ అప్పీల్ - 215

4.  ఇప్పుడు 2 అక్టోబర్, 2023 నుండి ప్రత్యేక ప్రచారం 3.0 ప్రారంభించడానికి మరింత చురుకుగా పాల్గొనడానికి త్రాగునీరు మరియు పారిశుద్ధ్య శాఖ (DDWS) సిద్ధమవుతోంది.

 

 

***


(रिलीज़ आईडी: 1957509) आगंतुक पटल : 160
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi