వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పి.ఎం. గతి శక్తి కింద, జరిగిన 55వ నెట్‌ వర్క్‌ ప్లానింగ్‌ గ్రూప్‌ సమావేశంలో ఆరు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సిఫార్సు.


ఇందులో మూడు రైల్వే ప్రాజెక్టులు, మూడు రోడ్‌ వేస్‌ ప్రాజెక్టులు. వీటి మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ 14,000 కోట్ల రూపాయలు.

ఇప్పటివరకు నెట్‌ వర్క్‌ ప్లానింగ్‌ గ్రూప్‌ 11 లక్షల కోట్ల రూపాయల విలువగల మొత్తం 106 ప్రాజెక్టులను సమీక్షించింది.

Posted On: 14 SEP 2023 1:24PM by PIB Hyderabad

నెట్‌వర్క్‌ ప్లానింగ్‌ గ్రూప్‌ (ఎన్‌పిజి) 55 వ సమావేశం 2023 సెప్టెంబర్‌ 12న న్యూఢల్లీిలో జరిగింది. ఈ సమావేశానికి పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం లాజిస్టిక్స్‌ ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి సుమితా దావ్రా అధ్యక్షత వహించారు. ఇందులో సభ్య విభాగాలు, మంత్రిత్వశాఖలు అంటే, రోడ్డు రవాణా, జాతీయ రహదారులు,పౌర విమానయానం ,  రైల్వే, పోర్టులు, షిప్పింగ్‌, జలరవాణా, విద్యుత్‌, నూతన పునరుత్పాదక ఇంధనం, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులు, టెలికమ్యూనికేషన్‌ ,నీతి ఆయోగ్‌ కు చెందిన వారు క్రియాశీలంగా పాల్గొన్నారు.
ఒక్కటిగా ప్రభుత్వ వ్యవస్థ అన్న విధానం  ప్రాజెక్టు ప్రణాళిక రూపకల్పన,అమలుకు కొత్త కోణాన్ని అందించింది.ఇది ఎవరికి వారు అన్న విధానం కాకుండా అన్ని మంత్రిత్వశాఖలు, విభాగాలు కలసికట్టుగా పనిచేసి ఫలితాలు సాధించే పద్ధతి ఏర్పడిరది.  ఈ సమావేశంలో పి.ఎం. గతి శక్తి ప్రణాళిక వల్ల కలిగే వివిధ ప్రయోజనాలను వివరించడం జరిగింది. ఎన్‌.ఎం.పిపై డిజిటల్‌ సర్వే, తక్కువ సమయంలో డిపిఆర్‌ తయారీ, సమర్దవంతంగా ప్రాజెక్టులను సాంకేతికత అనుసంధానిత ప్లాట్‌ఫారంల ద్వారా గమనించడం,మౌలికసదుపాయాల ప్రాజెక్టుల , సామాజిక రంగ ఆస్తుల సమగ్ర ప్రణాళిక రూపొందించడం వంటి వాటి గురించి వివరించారు. ఇవి మంచి ఫలితాలనిచ్చాయి.

ఈ సమావేశం సందర్భంగా మొత్తం ఆరు ప్రాజెక్టులను అంచనా వేశారు. ఇందులో మూడు రైల్వే ప్రాజెక్టులు, మూడు ప్రాజెక్టులు రోడ్‌ ట్రాన్స్‌పోర్టు, జాతీయ రహదారులకు సంబంధించి ఉన్నాయి.ఈ ప్రాజెక్టుల మొత్తం అంచనా విలువ 14,081 కోట్ల రూపాయలు. దీనితో ఎన్‌.పి.జి పిఎం గతిశక్తి విధానాన్ని చేపట్టినప్పడినుంచి, అంచనా వేసిన మొత్తం ప్రాజెక్టుల సంఖ్య 106 కు చేరింది. వీటి మొత్తం అంచనా విలువ రూ 11 లక్షల కోట్లరూపాయలు.
ఎన్‌.పి.జి 55 వ సమావేశంలో మూడు రైల్వే లైను ప్రాజెక్టులను అంచనా వేశారు. వీటి మొత్తం వ్యయం 5,374.5 కోట్లు. ఇందులో ఒక గ్రీన్‌ఫీల్డ్‌ రైల్వేలైన్‌ప్రాజెక్టు అలైన్‌మెంటు పశ్చిమబెంగాల్‌, ఒడిషా, జార్ఖండ్‌ రాష్ట్రాలమీదుగా వెళుతుంది. మరోగ్రీన్‌ఫీల్డ్‌ రైల్వే లైను ఒడిషా లో ఉంది. ఇది ప్రస్తుత రైల్వే లైనుకు ప్రత్యామ్నాయ, దగ్గరి దూరం గల అలైన్‌మెంట్‌ అవుతుంది. ఇది ప్రస్తుత ట్రాక్‌పై రద్దీ తగ్గిస్తుంది. మూడో రైల్వేలైను గుజరాత్‌ రాష్ట్రంలో ఉంది. ఈ రైల్వేలైన్లు స్టీలు సిమెంటు, విద్యుత్‌ రంగాలకు ప్రయోజనం చేకూర్చనున్నాయి. ఇవి ఈ పరిశ్రమలకు బొగ్గు, సున్నపురాయి, ఇనుపఖనిజం తరలించడానికి, తయారైన ఉత్పత్తుల రవాణాకు అంటే ఇనుము, స్టీలు, సిమెంట్‌ తదితరాలను తరలించడానికి, అలాగే ప్రయాణికులను తరలించడానికి ఉపయోగపడుతుంది. ఈ రైల్వే ప్రాజెక్టులు మొత్తంగా లాజిస్టిక్స్‌ ఖర్చును తగ్గించనున్నాయి.తక్కువ దూరంగల మార్గాల ద్వారా సరకు తరలించడం , ట్రాఫిక్‌రద్దీని తగ్గించడం వల్ల ప్రస్తుత రైల్వే లైన్లపై భారంతగ్గుతుంది.
  దీనితోపాటు ఎన్‌.పి.జి మూడు రోడ్డు ప్రాజెక్టుల గురించి కూడా చర్చించింది. వీటి మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ 8706 కోట్ల రూపాయలు. ఒక రోడ్డు ప్రాజెక్టు (ధుబ్రి బ్రిడ్జి`గోయరాగ్రి) మేఘాలయలో ఉంది. ఇది తుబ్రి `ఫుల్‌బరి బ్రిడ్జిని తూర్పు`పశ్చిమ రోడ్‌ కారిడార్‌తో అనుసంధానం చేస్తుంది. ఇది దేశంలోని ఈశాన్య ప్రాంతాన్ని సులభతర అనుసంధానంతో కలిపే లక్ష్యంలో భాగంగా చేపడుతున్న ప్రాజెక్టు.  ఈ ప్రాజెక్టు వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు మాత్రమే కాక, భారత `బంగ్లాదేశ్‌ సరిహద్దులో అంతర్జాతీయ వాణిజ్యానికి కూడా వీలు కల్పిస్తుంది. మరో గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు ప్రాజెక్టు (ఖరగ్‌పూర్‌`మోరెగ్రామ్‌) ఖరగ్‌పూర్‌` సిలిగురి రోడ్‌కారిడార్‌లో భాగంగా చేపడుతున్న ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ఖరగ్‌ పూర్‌` సిలిగురి మధ్య దూరాన్ని 112 కిలోమీటర్లు తగ్గిస్తుంది. అలాగే ప్రయాణ సమయాన్ని  7గంటలు తగ్గిస్తుంది.  ఈ ప్రాజెక్టు  మార్గంలోని ఆకాంక్షిత జిల్లాలకు ప్రయోజనం కలిగించడమే కాక, వామపక్ష తీవ్రవాద ప్రభావిత పశ్చిమ మిడ్నపూర్‌  జిల్లాకు కూడా ప్రయోజనం కలిగిస్తుంది.  ఈ ప్రాజెక్టు మొత్తంగా ఈ ప్రాంత సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి ఉపయోగపడుతుంది. ఈ రోడ్డు హాల్దియా, కోల్‌కతా పోర్టు ద్వారా అంతర్జాతీయ వాణిజ్యానికి ఉపకరిస్తుంది. మూడవ రోడ్డు ప్రాజెక్టు అయిన దియోఘర్‌ బైపాస్‌ సిటీ ట్రాఫిక్‌ను రద్దీని తగ్గించడానికి, స్థానిక పారిశ్రామిక పార్కులు, క్లస్టర్లకు ప్రయోజనం కలిగిస్తుంది.

పి.ఎం. గతిశక్తి నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌ మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టులు ,సామాజిక ఆర్థిక పురోగతి, ఈ ప్రాంత అభివృద్ది కోసం బహుళపక్ష అనుసంధానతను కల్పిస్తాయి. అలాగే ఈ ప్రాజెక్టులు ప్రస్తుత రైల్వే, రోడ్డు మార్గాలలో రద్దీని తగ్గించడంతోపాటు, నగరాలలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడానికి ఉపయోగపడతాయి.

 

***

 



(Release ID: 1957359) Visitor Counter : 95


Read this release in: Urdu , English , Hindi , Odia