శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సైన్స్ ప్రసారం ప్రచారం పై సీ ఎస్ ఐ ఆర్ - ఎన్ ఐ ఎస్సి పీ ఆర్ మరియు కే ఏ ఎం పి ల సమిష్టి ఆధ్వర్యం లో వర్క్‌షాప్
Posted On:
14 SEP 2023 9:27AM by PIB Hyderabad
సీ ఎస్ ఐ ఆర్ - ఎన్ ఐ ఎస్సి పీ ఆర్ ఒక వారం ఒక ప్రయోగశాల (వన్ వీక్ వన్ ల్యాబ్) ప్రోగ్రామ్ 3వ రోజు సైన్స్ కమ్యూనికేషన్‌పై వర్క్‌షాప్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా ఉపాధ్యాయులు హాజరై నిపుణులచే సైన్స్ కమ్యూనికేషన్‌లోని వివిధ కోణాల శిక్షణను పొందారు. వర్క్‌షాప్‌లో, సీ ఎస్ ఐ ఆర్ - ఎన్ ఐ ఎస్సి పీ ఆర్ జిగ్యాసా, శిక్షణ మరియు హెచ్‌ఆర్ విభాగం అధిపతి శ్రీ సీ. బీ. సింగ్ స్వాగతోపన్యాసం చేశారు. వర్క్‌షాప్‌లో హైదరాబాదు విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ శర్మిష్ఠ బెనర్జీ ముఖ్య అతిథిగా విచ్చేసి వర్క్‌షాప్‌లో ప్రసంగిస్తూ విద్యార్థులకు బహుళ విజ్ఞాన శాఖల సైన్స్ బోధనపై ఉద్ఘాటించారు. జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం మరియు గణితంతో సహా అన్ని శాఖలు పరస్పరం సంబంధం కలిగి ఉన్నాయని, దీన్ని మన విద్యార్థులకు సమర్థవంతంగా చెప్పాలని ఆమె అన్నారు.
శ్రీమతి అరికా మాథుర్, హెడ్ - ఆపరేషన్స్ అండ్ అసెస్‌మెంట్స్, కే ఏ ఎం పి నాలెడ్జ్ అండ్ అవేర్‌నెస్ మ్యాపింగ్ ప్లాట్‌ఫారమ్ ( కే ఏ ఎం పి)సీ ఎస్ ఐ ఆర్ - ఎన్ ఐ ఎస్సి పీ ఆర్ మరియు ఎన్ సి పి చొరవపై సవివరమైన ప్రదర్శనతో ఆకర్షించారు.మా విద్యార్థులలో సహజసిద్ధమైన ప్రతిభను మరియు నైపుణ్యాలను వెలికితీసే లక్ష్యంతో కే ఏ ఎం పి పనిచేస్తోంది తద్వారా ఉపాధ్యాయులు ఈ ప్రయత్నం పట్ల ఉత్సాహంగా కనిపించారు అని ఆమె అన్నారు.
సీ ఎస్ ఐ ఆర్ - ఎన్ ఐ ఎస్సి పీ ఆర్ చీఫ్ సైంటిస్ట్ మరియు 'సైన్స్ రిపోర్టర్' మ్యాగజైన్ ఎడిటర్ శ్రీ హసన్ జవైద్ ఖాన్ సైన్స్ కమ్యూనికేషన్ మరియు పౌర బాధ్యతని వివరిస్తూ, “సైన్స్ గురించిన వార్తలలో తప్పుడు సమాచారం మరియు నకిలీల గురించి మరింత అవగాహన కల్పించడం దేశంలోని ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు.
శ్రీమతి సోనాలి నగర్, అసోసియేట్ ఎడిటర్, సైన్స్ రిపోర్టర్ మ్యాగజైన్ ఉపాధ్యాయులకు పాపులర్ సైన్స్ రైటింగ్‌లోని సునిశిత నైపుణ్యాలపై శిక్షణనిచ్చారు. శ్రీ హసన్ జవైద్ ఖాన్ ఇచ్చిన పాపులర్ సైన్స్ రైటింగ్ అసైన్‌మెంట్‌తో వర్క్‌షాప్ ముగిసింది.
సీ ఎస్ ఐ ఆర్ - ఎన్ ఐ ఎస్సి పీ ఆర్ మరియు కే ఏ ఎం పి గురించి:
సీ ఎస్ ఐ ఆర్ -నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (సీ ఎస్ ఐ ఆర్ - ఎన్ ఐ ఎస్సి పీ ఆర్ ) భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీ ఎస్ ఐ ఆర్) ప్రయోగశాలలలో ఒకటి. ఇది సైన్స్ కమ్యూనికేషన్, సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ రంగాలలో ప్రత్యేకత శ్రద్ధ తో పనిచేస్తుంది. సాక్ష్యం-ఆధారిత విధాన పరిశోధన మరియు అధ్యయనాలపై దృష్టి పెడుతుంది.
కే ఏ ఎం పి - కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీ ఎస్ ఐ ఆర్) - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (ఎన్ ఐ ఎస్సి పీ ఆర్ ) మరియు పారిశ్రామిక భాగస్వామి నైసా కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ల సమిష్టి విజ్ఞాన కూటమి. ఇది విద్యార్థుల స్వాభావిక సామర్థ్యాలైన సృజనాత్మకత, అర్థవంతమైన అభ్యాసం, విమర్శనాత్మక పఠనం మరియు ఆలోచనా నైపుణ్యాలను వెలికితీసి అభివృద్ధి చేయడానికి ఉద్దేశించబడింది.
****
(Release ID: 1957262)
Visitor Counter : 133