శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
భారతదేశపు సాంకేతిక ఆధిపత్యాన్ని జి20 శిఖరాగ్ర సమ్మేళనంలో విజయవంతంగా ప్రదర్శించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని అభినందించిన శాస్త్రవేత్తలు.
కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షతన, శాస్త్ర విజ్ఞాన కార్యదర్శులు అందరూ నిర్వహించిన సంయుక్త సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని అభినందించారు. అలాగే అత్యున్నత సాంకేతికత దిశగా
ఉన్న ప్రకటన, అంతర్జాతీయ జీవ ఇంధన కూటమికి సంబంధించిన ప్రకటనలకు వారు ప్రధానమంత్రిని అభినందించారు.
‘‘శాస్త్ర సాంకేతికత పై ప్రధాన దృష్టితో ప్రధానమంత్రి , విజయవంతంగా అమెరికా పర్యటించించి రావడం, జి 20 ప్రకటనకు తగిన నేపథ్యాన్ని సమకూర్చింది: డాక్టర్ జితేంద్ర సింగ్
నేషనల్ రిసెర్చి ఫౌండేషన్ (ఎన్.ఆర్.ఎఫ్) కు సంబంధించిన నియమ, నిబంధనలను రూపొందించేందుకు కృషిచేస్తున్న అనుసంధాన్ అమలు కమిటీ, విజ్ఞాన్ గతి ఫోరం లను ఎన్.ఆర్.ఎఫ్ కింద అమలుచేస్తారు.
Posted On:
13 SEP 2023 5:52PM by PIB Hyderabad
భారత సాంకేతిక ఆధిక్యతను జి20 సమావేశాలలో విజయవంతంగా ప్రదర్శించినందుకు, శాస్త్రవేత్తలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ని అభినందించారు.
ఇందుకు సంబంధించి కేంద్రశాస్త్ర సాంకేతిక శాఖ సహాయమంత్రి,ప్రధానమంత్రి కార్యాలయం, ప్రజాఫిర్యాదులు, సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షతన సమావేశమైన వివిధ సైన్సు మంత్రిత్వశాఖలు, విభాగాల కార్యదర్శులు మూజువాణీ ఓటుతో ప్రధానమంత్రిని అభినందిస్తూ తీర్మానం చేశారు. జి20 శిఖరాగ్ర సమ్మేళనం సందర్భంగా న్యూఢిల్లీ డిక్లరేషన్ అత్యున్నత సాంకేతికతకు పెద్దపీట వేసేదిగా ఉండడం,అంతర్జాతీయ జీవ ఇంధన కూటమి (జిబిఎ) ను ప్రకటించడం పట్ల వారు ప్రధానమంత్రికి అభినందనలు తెలిపారు.
క్రమం తప్పకుండా జరిగే సైన్సు కార్యదర్శుల సమావేశంలో అన్ని శాస్త్ర విజ్ఞాన విభాగాల అధిపతులు పాల్గొన్నారు. డిపార్టమెంట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ,
డిపార్టమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రిసెర్చ్, భూ విజ్ఞాన శాస్త్రం, అంతరిక్షవిభాగం, అణు ఇంధన విభాగం, ఇతర విభాగాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భారత ప్రభుత్వానికి ప్రధాన శాస్త్ర విజ్ఞాన సలహాదారు ప్రొఫెసర్ అజయ్ సూద్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్డిజిలు) సాధించేదిశగా శాస్త్ర విజ్ఞాన రంగంలో కొలాబరేషన్లను ప్రోత్సహించేదిగా ఉన్న న్యూఢిల్లీ డిక్లరేషన్ ను వారు ప్రశంసించారు.
జి 20 శిఖరాగ్ర సమ్మేళనంలో చేసిన తీర్మానం, ఇండియా చేపట్టిన పర్యావరణ మిషన్ కోసం జీవన విధానం (ఎల్.ఐ.ఎఫ్.ఇ)ను అమలు చేసేందుకు కట్టుబడి ఉండడమే కాక, కృత్రిమ మేథను ప్రోత్సహించేంది గా ఉంది.
హరిత అభివృద్ధి ఒప్పందాన్ని చేపట్టడం వల్ల జి 20, సుస్థిరాభివృద్ధి, హరిత ప్రగతికి తన చిత్తశుద్ధిని పునరుద్ఘాటించినట్టయింది. శాస్త్రవిజ్ఞాన కార్యదర్శుల సమావేశం, చంద్రయాన్ 3 విజయవంతంగా చంద్రుడిపై దిగడం పట్ల, అలాగే సౌర మిషన్ ఆదిత్య ఎల్ 1 విజయవంతం కావడం పట్ల అభినందనలు తెలిపింది.
అంతర్జాతీయ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల రిపాజిటరీ (జిడిపిఐఆర్) నిర్మాణం, నిర్వహణకు ఇండియా ప్రణాళికకు జి20 శిఖరాగ్ర సమ్మేళనం మద్దతు పలికింది. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఒ) నిర్వహణ ఫ్రేమ్ వర్క్ పరిధిలో గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ డిజిటల్హెల్త్ ఏర్పాటును శాస్త్రవేత్తలు స్వాగతించారు.
మరో ముఖ్యమైన విజయం, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చొరవతో, జి 20 శిఖరాగ్ర సమ్మేళనం సందర్భంగా, అంతర్జాతీయ జీవ ఇంధన కూటమి (జిబిఎ) ను సింగపూర్, బంగ్లాదేశ్, ఇటలీ, అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా, మారిషస్, యుఎఇ ల
నాయకత్వంలో ఏర్పాటు కావడం. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున జీవ ఇంధన ప్రోత్సాహానికి కొలాబరేషన్లు కుదుర్చుకునేందుకు ఈ వేదిక ఒక ప్రేరణగా నిలుస్తుంది.
ఈ సమావేశంలో మాట్లాడుతూ డాక్టర్ జితేంద్ర సింగ్, శాస్త్ర విజ్ఞానంపై ప్రత్యేక దృష్టితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జరిపన అమెరికా పర్యటన, జి 20 డిక్లరేషన్కు తగిన ముందస్తు నేపథ్యాన్ని ఏర్పరచిందన్నారు.
ప్రధానమంత్రి అమెరికా పర్యటన సందర్భంగా ఇండియా ఆర్టెమిస్ ఒప్పందం పై సంతకం దారు అయిందని అన్నారు. అలాగే , ఇండియా, అమెరికాలు సంయుక్తంగా , అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్ 2024 కు ప్రకటన చేశాయన్నారు. వీటన్నిటికి తోడు , మైక్రాన్ 800 మిలియన్ డాలర్ల పెట్టుబడులను ప్రకటించినట్టు తెలిపారు.
.భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సలహాదారు , ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ మాట్లాడుతూ, జి 20 , న్యూఢిల్లీ డిక్లరేషన్లో డజను సార్లకు పైగా డాటా అనే పదం ఉందని అన్నారు.
Iఅనుసంధాన్ నేషనల్ రిసెర్చి ఫౌండేషన్కు ఆమోదం తెలిపినందుకు కూడా ఈ సమావేశం ప్రధానమంత్రి ని అభినందించింది.అనుసంధాన్ నేషనల్ రిసెర్చి ఫౌండేషన్ (ఎన్.ఆర్.ఎఫ్) ను పార్లమెంటు గత వర్షాకాల సమావేశంలో చేసిన తీర్మానం ద్వారా ఏర్పాటు చేశారు.
పరిశోధన, బోధన రంగంలో నిధుల ప్రజాస్వామీకరణ, సమానంగా నిధుల కేటాయింపునకు ఇది వీలు కల్పిస్తుంది. ఐదు సంవత్సరాలలో 50,000 కోట్ల రూపాయల మేర కేటాయింపులలో 70శాతం వరకు అంటే సుమారు 36,000 కోట్ల రూపాయలు ప్రభుత్వేతర సంస్థల నుంచి వస్తాయి.అనుసంధాన్ అమలు కమిటీ పురోగతి గురించి కూడా మంత్ర వివరించారు. ఈ కమిటీ నియమ నిబంధనల రూపకల్పనలో ఉంది.
విజ్ఞాన్ గతి ఫోరం ను కూడా ఎన్.ఆర్.ఎఫ్ కింద అమలు చేస్తారు. ఈ సమావేశం ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెయిర్ , ఐఐఎస్ ఎఫ్ 2023 ను ఎప్పుడు నిర్వహించాలన్నదానిపైనా చర్చించింది.
***
(Release ID: 1957247)
Visitor Counter : 107