జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రాజస్థాన్‌లోని జైపూర్‌లో గురువారం 14 సెప్టెంబర్ 2023న డ్యాముల (ఆనకట్టలు/సేతువుల) భద్రతపై అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్న ఉపరాష్ట్రపతి


నీటి సంరక్షణ & నిర్వహణ ప్రోత్సహించడం కోసం వినైల్ చుట్టిన హిమసాగర్ ఎక్స్‌ప్రెస్ & కామాఖ్య ఎక్స్‌ప్రెస్‌లను ఉపరాష్ట్రపతి జెండా ఊపి ప్రారంభిస్తారు

"భద్రమైన & సురక్షితమైన ఆనకట్టలు దేశ సౌభాగ్యాన్ని నిర్ధారిస్తాయి" అనే అంశంపై జలశక్తి మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ
సదస్సును నిర్వహిస్తోంది.

Posted On: 12 SEP 2023 3:16PM by PIB Hyderabad

          జైపూర్‌లోని రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్ (RIC)లో జలవనరులు, నదుల అభివృద్ధి, గంగానది పునరుజ్జీవన శాఖ (DoWR, RD &GR), జల శక్తి మంత్రిత్వ శాఖ 2023 సెప్టెంబర్ 14 నుండి 15 వరకు ఆనకట్టల భద్రత (ICDS)పై అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తోంది. డ్యాముల  భద్రతను పెంపొందించడానికి సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ప్రపంచంలో ఈ రంగానికి చెందిన అగ్రగామి నిపుణులు మరియు దిగ్గజాలు సమావేశమవుతారు. "భద్రమైన  & సురక్షితమైన ఆనకట్టలు దేశ సౌభాగ్యాన్ని నిర్ధారిస్తాయి" అనే ఇతివృత్తంపై జరిగే  అంతర్జాతీయ సమ్మేళనాన్ని  భారత ఉపరాష్ట్రపతి  శ్రీ జగదీప్ ధన్‌కర్ ప్రారంభిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు దాదాపు పదిహేను దేశాలకు చెందిన నిపుణులు ఆనకట్టల  భద్రత,  నిర్వహణను పెంపొందించడానికి ఉద్దేశించిన ఈ సమ్మేళనంలో పాల్గొంటారని ఆశిస్తున్నారు.


           ఆరు వేలకు పైగా డ్యాములతో భారతావని ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది.  ఈ డ్యామ్‌లలో  80 శాతానికి పైగా నిర్మించి 25 ఏళ్ళు దాటినవి కాగా 234 డ్యాముల వయస్సు వందేళ్లు దాటింది.  ఇప్పుడు వాటి భద్రతను నిర్ధారించడం అత్యంత ముఖ్యమైనది. డ్యామ్ భద్రత మరియు నిర్వహణలో అత్యాధునిక అంశాలను చర్చించే లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్, ప్రపంచ దేశాలకు చెందిన నిపుణులను ఒక వేదిక మీదకు తేవడం ఈ సదస్సు లక్ష్యం.  దానికి తోడుగా డ్యాముల పునరుద్ధరణ , అభివృద్ధి ప్రాజెక్టు  (DRIP) రెండవ, మూడవ దశ లక్ష్యాలను, అలాగే ఇండియాలో డ్యాముల భద్రతను అభివృద్ధి చేయడానికి ఈ ప్రాజెక్టు ఎలా దోహదం చేస్తుంది అనే విషయంపై కూడా ఈ సమావేశం దృష్టి సారిస్తుంది.   ఈ సమ్మేళనంలో భాగంగా విజ్ఞానం, అనుభవం, సాంకేతికత, వినూత్న కల్పనలు,  డ్యాములకు సంబంధించిన భద్రత యత్నాల చుట్టూ కేంద్రీకృతమై జరిగే అనేక సమాచార సమావేశాలు నిపుణులు, సంస్థలకు సహాయపడగలవు. డ్యాముల భద్రతపై (DRIP) రెండవ,మూడవ దశ కింద ఏర్పాటు చేయతలపెట్టిన డ్యాముల భద్రత సమ్మేళనాల శ్రేణిలో ఇది మొదటిది.

              ప్రారంభ కార్యక్రమంలో విశేషం ఏమిటంటే వినైల్ చుట్టిన 'పానీ కి రైల్' అంటే రెండు ప్రముఖ రైళ్లు, అవి హిమ్‌సాగర్ ఎక్స్‌ప్రెస్ & కామాఖ్య ఎక్స్‌ప్రెస్ ముఖ్యమైన సందేశాన్ని ప్రచారం చేసేందుకు కదిలే బిల్‌బోర్డ్‌గా ఉపయోగపడతాయి. తద్వారా నీటి సంరక్షణ & నిర్వహణ, నది పునరుజ్జీవనం మరియు త్రాగునీటి ప్రాముఖ్యత & మెరుగైన పారిశుధ్యం వంటి అంశాలను గురించి ప్రచార సందేశం ఇస్తాయి. జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ వాటర్ మిషన్ నేతృత్వంలో, రైల్వే మంత్రిత్వ శాఖ సహకారంతో "పానీ కి రేల్" (पानी की रेल) పేరుతో చేపట్టిన వినూత్న ప్రక్రియ ఇది.  సమాజ భాగస్వామ్యంలో చేపట్టే నీటి సంరక్షణ & నిర్వహణ ప్రాజెక్టుల గురించి ప్రధానమంత్రి దార్శనికతను పానీ కి రేల్ ప్రదర్శిస్తుంది.  ఈ రైళ్లు దేశంలో నలుమూలలా విస్తారంగా  ప్రయాణించి ఆ సందేశాన్ని
లక్షలాది మంది ప్రజలకు చేరవేస్తాయి. నీరు పరిమితమైన, అమూల్యమైన వనరు అని నీటి విలువను తెలియజెప్పే సందేశాన్ని వ్యాప్తి చేయడం దీని ప్రాథమిక లక్ష్యం.

       ప్రారంభ సమావేశం తరువాత సమ్మేళనం తాజా సాంకేతికతలు మరియు డ్యామ్ భద్రతకు సంబంధించిన వినూత్న విధానాలపై దృష్టి సారించే సాంకేతిక సమావేశాలతో కొనసాగుతుంది.  ఈ సమావేశాలలో డ్యామ్‌ల పర్యవేక్షణ, తనిఖీ మరియు పునరుద్ధరణతో సహా వివిధ అంశాలను  గురించి నిపుణులు చర్చలు జరుపుతారు.  సమ్మేళనం రెండవ రోజు రెండు సాంకేతిక సమావేశాలు ఉంటాయి.
ఒకటి డ్యామ్ ఆరోగ్యస్థితి  అంచనా, డ్యామ్‌ల నిర్మాణ సమగ్రతను అంచనా వేయడానికి తాజా పద్ధతులను ప్రదర్శించడం మరియు మరొకటి డ్యామ్ భద్రత యొక్క పారిశ్రామిక అనువర్తనాన్ని నొక్కి చెప్పడం, జలవిద్యుత్, నీటిపారుదల మరియు వరద నియంత్రణ కోసం డ్యామ్‌ల వినియోగాన్ని ప్రదర్శించడం.  సదస్సు సందర్భంగా వేదిక వద్ద డ్యామ్ భద్రతకు సంబంధించిన వివిధ రంగాలలో తాజా పరిణామాలు, సాంకేతికతలు, పరిష్కారాలను తెలియజెప్పే ఉత్పత్తులు, పట్టికలు, బ్యానర్లు & ఛాయాచిత్రాల ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది.


        ఆనకట్టలు ఆధునిక భారతావనికి పెద్ద చిహ్నాలు. నాగరికత అభివృద్ధికి ఆనకట్టలు చాలా అవసరం.  తాగునీరు, నీటిపారుదల, జలవిద్యుత్, వరదల రక్షణ ఇంకా మరి కొన్నింటి కోసం నానాటికీ పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడంలో ఆనకట్టలు బహుముఖ పాత్ర పోషించాయి. క్రీ.శ. రెండవ  శతాబ్దంలో రాజు కరికాల చోళుడు మొదటి ఆనకట్ట కల్లనై డ్యామ్ నిర్మించాడు. భారతదేశంలో ఇప్పుడు  6,000 ఆనకట్టలు ఉన్నాయి. ఆనకట్టలలో భారత్ ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలో ఉంది. వాటి భద్రతకు అత్యంత ప్రాముఖ్యతనిస్తుంది.
 
      అలాంటి   గొప్ప చారిత్రక  నేపథ్యం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక దృష్టితో ఆనకట్టల భద్రతా చట్టం (DSA) 2021లో  రూపొందించడం జరిగింది. ఆనకట్టలను కాపాడుకోవడంలో మన దేశం యొక్క అంకితభావాన్ని అది  మరింత బలోపేతం చేసింది. ఈ ప్రగతిశీల చట్టం ఆనకట్ట నిఘా, తనిఖీ మరియు నిర్వహణకు దేశం యొక్క అంకితభావాన్ని నొక్కి చెబుతుంది. ప్రపంచవ్యాప్తంన్గా   ఆనకట్టలకు  భద్రతా ప్రమాణాలకు ఒక గీటురాయని నిర్దేశిస్తుంది. డ్యామ్ భద్రతపై జాతీయ కమిటీ, కేంద్ర స్థాయిలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) మరియు రాష్ట్ర స్థాయిలో డ్యామ్ భద్రత మరియు రాష్ట్ర డ్యామ్ భద్రత సంస్థపై రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయడం ఈ తప్పనిసరి అని ఈ చట్టం నిర్దేశిస్తుంది.  అది కాకుండా, డ్యామ్ యజమానులు ఇప్పుడు ప్రత్యేక డ్యామ్ సేఫ్టీ యూనిట్‌ని కలిగి ఉండాలి, అత్యవసర కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలి, క్రమం తప్పకుండా సమగ్ర భద్రతా మూల్యాంకనాలను నిర్వహించాలి. డ్యామ్ భద్రతకు సంబంధించిన రెండు రకాల నేరాలకు సంబంధించిన నిబంధనలతో మరియు సాధారణ ప్రమాద అంచనాలకు ప్రాధాన్యతనిస్తూ, ఈ చట్టం భారతదేశం భవిష్య ఆలోచనా  విధానానికి, ఆనకట్టల భద్రతను నిర్ధారిస్తున్నది.  వీటిలో అనేక ఆనకట్టలు శతాబ్దాలు కాదు దశాబ్దాలుగా ఉన్నాయి.

   ఆనకట్టల భద్రతను  నిర్ధారించే బాధ్యత ప్రధానంగా డ్యామ్ యజమానులు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (CPSUలు) మరియు ప్రైవేట్ ఏజెన్సీలు  కలసి పనిచేయడంపై  ఆధారపడి ఉంటుంది.  2012లో ప్రారంభించబడిన ఆనకట్ట పునరుద్ధరణ మరియు మెరుగుదల ప్రాజెక్ట్ (DRIP) మొదటి దశ ఇందుకు మార్గం సుగమం చేసింది.  రూ. 2,100 కోట్ల బడ్జెట్ కేటాయించడం ద్వారా  ఏడు రాష్ట్రాల్లోని 223 డ్యామ్‌ల భద్రతను మెరుగుపరిచారు.  ఇప్పుడు AIIB నిధులతో DRIP రెండవ, మూడవ దశలను అమలు చేస్తారు.  వీటిలో  డ్యామ్ నిర్మాణాల పునరుద్ధరణ, సాధననిర్మాణం  మెరుగుపరచడం మరియు డ్యామ్ భద్రతా సంస్థలను ఏర్పాటు చేయడంపై దృష్టి సారిస్తారు. నీటి మౌలిక సదుపాయాలను కాపాడుకోవడంలో భారతదేశం నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది. 19 రాష్ట్రాల్లోని 736 డ్యామ్‌లను పూర్తిగా పునరుద్ధరించడం ఈ పథకం లక్ష్యం. 10-సంవత్సరాల వ్యవస్థను ఆరేళ్ల పాటు ఉండే  రెండు దశల్లో అమలు చేస్తారు. రెండు దశలు రెండేళ్ల అతివ్యాప్తితో అమలవుతాయి. ప్రాజెక్టు వ్యయం రూ.10,211 కోట్లు. ఈ వ్యయంలో బయటి నుంచి రూ.7000 కోట్ల రుణం మరియు భాగస్వామ్య రాష్ట్రాలు మరియు కేంద్ర సంస్థలు రూ.3211 కోట్లు అందజేస్తాయి.

        రాజస్థాన్ జలవనరుల శాఖ, కేంద్ర జల సంఘం , జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ, MNIT జైపూర్, WAPCOS లిమిటెడ్, ప్రపంచ బ్యాంక్ మరియు ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంక్ సహకారంతో ఈ సమ్మేళనం  నిర్వహిస్తున్నారు. ICDS 2023కు గుణ్యమైన నిర్వాహకులు, విద్యావేత్తలు/విద్యా సంస్థలు, DRIP అమలు చేసే ఏజెన్సీలు, స్పాన్సర్‌లు మరియు మీడియా భాగస్వాములు మద్దతు ఇస్తున్నారు.

      రాజస్థాన్ రాష్ట్రానికి గొప్ప వారసత్వం, శక్తివంతమైన సంస్కృతి మరియు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు ఉన్న ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశం.  సమ్మేళనంలో పాల్గొనే వారు జరిపే సాంకేతిక చర్చలతో పాటు సాంస్కృతిక అనుభవం చేకూర్చాలని ఉద్దేశంతో 16వ తేదీ శనివారం పర్యటనలకు యోచన చేశారు.  ఇందులో చిరుతపులి సఫారీ మరియు బిసల్‌పూర్ డ్యామ్ సందర్శన ఉన్నాయి. అదనంగా, ఈ ప్రాంతంలోని శాస్త్రీయ సంగీతం మరియు నృత్య రూపాలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలను సమ్మేళనం విందులు జరిగే సమయంలో  ప్రతి రోజు  నిర్వహిస్తారు.

 

***


(Release ID: 1957150) Visitor Counter : 118


Read this release in: English , Urdu , Hindi , Tamil