ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డిజిటల్ పరివర్తనకోసం జనాభా స్థాయి లో అమలుపరచిన ఫలప్రదమైనటువంటి డిజిటల్ సాల్యూశన్స్ ను శేర్ చేసేరంగం లో సహకారానికి గాను భారతదేశాని కి మరియు ఆర్మేనియా కు మధ్య ఎంఒయు పై సంతకాలకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 13 SEP 2023 3:29PM by PIB Hyderabad

పాప్యులేశన్ స్కేల్ ఫార్ డిజిటల్ ట్రాన్స్ ఫర్ మేశన్ లో అమలు పరచిన ఫలప్రదమైనటువంటి డిజిటల్ సాల్యూశన్స్ ను శేర్ చేయడం లో సహకారానికి గాను భారతదేశం గణతంత్రాని కి చెందిన ఎలక్ట్రానిక్స్ & ఇన్ ఫర్ మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కు మరియు ఆర్మేనియా గణతంత్రాని కి చెందిన హై-టెక్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ కు మధ్య 2023 జూన్ 12 వ తేదీ న సంతకాలైన అవగాహన పూర్వక ఒప్పంద పత్రాని (ఎంఒయు) కి గౌరవీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదాన్ని తెలిపింది.

 

ఈ ఎంఒయు ఇరు దేశాల లో డిజిటల్ పరివర్తనాత్మక కార్యక్రమాల ను అమలు చేయడం లో డిజిటల్ టెక్నాలజీ ఆధారిత సాల్యూశన్స్ (అంటే ఇండియా స్టేక్) ల ఆదాన ప్రదానాన్ని, ఇంకా సన్నిహిత సహకారాన్ని పెంపొందించాలి అనేది ఈ ఎమ్ఒయు యొక్క ఉద్దేశ్యం గా ఉంది. ఐటి రంగం లో ఉపాధి అవకాశాల కు దారితీసే మెరుగైన సహకారాన్ని ఈ ఎమ్ఒయు ఆశిస్తున్నది.

 

ఈ ఎమ్ఒయు ఉభయ పక్షాలు సంతకాలు చేసిన తేదీ నాటి నుండి అమలు లోకి వస్తుంది. ఈ ఎమ్ఒయు మూడు సంవత్సరాల పాటు అమలు లో ఉంటుంది.

 

డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐ) రంగం లో జి2జి మరియు బి2బి ఈ రెండు విధాలైన ద్వైపాక్షిక సహకారాన్ని వృద్ధి చెందింప చేసుకోవడం జరుగుతుంది. ఈ ఎమ్ఒయు లో ప్రస్తావిస్తున్నటువంటి కార్యకలాపాల కు ఆయా పాలక యంత్రాంగాలు సాధారణ విధినిర్వహణ సంబంధి కేటాయింపుల నుండి ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది.

 

ఐసిటి రంగం లో ద్వైపాక్షిక మరియు బహుళ పాక్షిక సహకారాన్ని పెంపొందింప చేయడం కోసం అనేక దేశాల తో మరియు బహుళ పక్ష ఏజెన్సీల తో సమన్వయాన్ని ఎమ్ఇఐటివై నెలకొల్పుకొన్నది. ఈ క్రమం లో, ఎమ్ఇఐటివై సమకక్షః సంస్థలతో, ఏజెన్సీల తో కలసి అనేక ఎంఒయు లు/ఎంఒసి లు/ ఒప్పందాలు కుదుర్చుకొంది. ఇది దేశాన్ని డిజిటల్ మాధ్యం పరం గా సాధికారిత కలిగినటువంటిది గా మరియు జ్ఞాన ప్రధానమైన ఆర్థిక వ్యవస్థ గా తీర్చిదిద్దడానికి గాను భారతదేశం ప్రభుత్వం చేపడుతున్న డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ల వంటి వివిధ కార్యక్రమాలకు అనుగుణం గా ఉంది. ఈ పరివర్తనాత్మక క్రమం లో, పరస్పర సహకారాన్ని పెంపొందింప చేసుకొనే ధ్యేయం తో వ్యాపార అవకాశాల ను అన్వేషించవలసిన , ఉత్తమ అభ్యాసాల ను శేర్ చేసుకోవలసిన, డిజిటల్ రంగం లో పెట్టుబడుల ను ఆకర్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

 

గత కొన్ని సంవత్సరాలు గా భారతదేశం డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐ) అమలు లో తన నాయకత్వాన్ని చాటుకొంటూ వచ్చింది. అంతేకాకుండా, కోవిడ్ మహమ్మారి కాలం లో సైతం ప్రజల కు సేవల ను ఫలప్రదం గా అందించింది. దీనితో అనేక దేశాలు భారతదేశం యొక్క అనుభవాల నుండి తాము ప్రయోజనాల ను పొందాలన్న ఆసక్తి ని కనబరచాయి, అందుకోసం భారతదేశం తో ఎమ్ఒయు లను కుదుర్చుకొంటున్నాయి.

 

ఇండియా స్టేక్ సొల్యూశన్స్ అనేది భారతదేశం అభివృద్ధి పరచి, అమలు చేసిన డిపిఐ లలో ఒక భాగం; సార్వజనిక సేవల లభ్యత మరియు అందజేత కు ఇది మార్గాన్ని సుగమం చేస్తుంది. వీటిని ఓపెన్ టెక్నాలజీస్ సాయం తో రూపుదిద్దడమైంది. ఏమైనా డిపిఐ లను నిర్మించడం లో ప్రతి దేశానికి తనదైన అవసరాలు మరియు సవాళ్ళు ఉన్నాయి. అయితే, దీని మౌలిక విధి నిర్వహణ సారూప్యమైంది గా ఉండడం తో దీనిలో ప్రపంచ సహకారాని కి ఆస్కారం ఉన్నది.

 

***

 


(Release ID: 1957078) Visitor Counter : 128