మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
'పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారం & స్వచ్ఛత కార్యక్రమం' కోసం కేంద్ర నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖలో ప్రత్యేక ప్రచారం 2.0 నిర్వహణ
డిసెంబర్ 2022 నుంచి ఆగస్టు 2023 మధ్య కాలంలో 1,051 పరిశుభ్రత ప్రచారాలు విజయవంతంగా నిర్వహణ, 27,162 చ.అ. స్థలం ఖాళీ, 25,846 ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, 4,750 దస్త్రాలు తొలగింపు, వ్యర్థాల అమ్మకం ద్వారా రూ. 25,69,693 ఆదాయం ఆర్జన
प्रविष्टि तिथि:
13 SEP 2023 9:00AM by PIB Hyderabad
'పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారం & స్వచ్ఛత కార్యక్రమం' కోసం కేంద్ర నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖలో చేపట్టిన ప్రత్యేక ప్రచారం 2.0 పూర్తి వేగంగా కొనసాగుతోంది.
పనిలో జాప్యాన్ని తగ్గించడం, స్వచ్ఛతను సంస్థాగతీకరించడం, అంతర్గత పర్యవేక్షణ యంత్రాంగాలను బలోపేతం చేయడం, దస్త్రాల నిర్వహణలో అధికారులకు శిక్షణ ఇవ్వడం, మెరుగైన దస్త్రాల నిర్వహణ కోసం భౌతిక పత్రాలను డిజిటలీకరించడం, ఒకే డిజిటల్ వేదిక www.pgportal.gov.in/scdpm పైకి అన్ని మంత్రిత్వ శాఖలు/విభాగాలను తీసుకురావడం ఈ ప్రచారం లక్ష్యాలు.
డిసెంబర్ 2022 నుంచి ఆగస్టు 2023 మధ్య కాలంలో 11,000 భౌతిక దస్త్రాలను సమీక్షించారు, 864 దస్త్రాలను తొలగించారు. 61,380 ప్రజా ఫిర్యాదులు & అర్జీలను పరిష్కరించారు. 35 స్వచ్ఛత ప్రచారాలు చేపట్టారు. 5,054 చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి వచ్చింది. వ్యర్థాల అమ్మకం ద్వారా రూ.24,49, 293 సంపాదించారు.
***
(रिलीज़ आईडी: 1957000)
आगंतुक पटल : 142