బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పరిశుభ్రత పచ్చదనం ప్రచారం కింద 10,266 మెట్రిక్ టన్నుల చెత్తను పారవేసి, జనవరి నుండి ఆగస్టు 2023 వరకు రూ.70 కోట్ల ఆదాయాన్ని బొగ్గు మంత్రిత్వ శాఖ మరియు పీఎస్ యూ లు పొందాయి


6,929,401 చదరపు అడుగుల స్థలం వినియోగం లోకి వచ్చింది. పర్యావరణ అనుకూలమైన జనపనార/వస్త్ర సంచులు పంపిణీ

Posted On: 13 SEP 2023 2:42PM by PIB Hyderabad

పరిశుభ్రత ప్రచారం స్వచ్ఛతా పఖ్వాడా-2023లో భాగంగా బొగ్గు మంత్రిత్వ శాఖ మరియు బొగ్గు పీఎస్ యూ లు  పరిశుభ్రత మరియు సుస్థిరమైన పద్ధతులను అంకితభావంతో కొనసాగిస్తున్నాయి. పర్యావరణ బాధ్యత, కార్యస్థలాలు మరియు సామాజిక నాణ్యతను పెంపొందించడం పట్ల మంత్రిత్వ శాఖ యొక్క నిబద్ధతను ఈ కార్యక్రమాలు నొక్కి చెబుతున్నాయి.

 

అక్టోబర్ 2022లో ప్రత్యేక ప్రచారం 2.0 సమయంలో మంత్రిత్వ శాఖ సాధించిన కొన్ని విజయాలు ప్రశంసనీయమైనవి. ప్రచార సమయంలో మంత్రిత్వ శాఖ 3,023,788 చదరపు అడుగుల విస్తీర్ణంలో శుభ్రపరిచి శుభ్రమైన పని వాతావరణానికి తన నిబద్ధతను ప్రదర్శిస్తుంది.

పర్యావరణ స్పృహతో కూడిన ప్రయత్నంలో, 5,409.5 మెట్రిక్ టన్నుల చెత్త ను పారవేయటం అమ్మటం తద్వారా రూ. 48.5 కోట్లు సంపాదించింది.

 

కొత్తగూడెం ఏరియా, ఎస్ ఎస్ సీ ఎల్ , హైదరాబాద్‌లోని చెత్త కుప్ప యార్డ్‌ను ఉత్పాదక పంట భూమిగా మార్చడం, సుస్థిరమైన భూ వినియోగానికి దోహదపడడం వంటి వినూత్న కార్యక్రమాలు అమలు చేసింది. చెత్త, పారవేయబడిన వస్తువులు, టైర్లు, పైపులు మరియు బండ్ల నుండి "కచ్రా ఉద్యాన్" యొక్క సీ సీ ఎల్ యొక్క ఈ  ఆలోచన విస్తృతంగా ప్రశంసించబడింది. ఇది 3ఆర్ (రిడ్యూస్-రీయూజ్-రీసైకిల్) యోజన మరియు స్థిరమైన వ్యర్థాల నిర్వహణకు బలమైన నిబద్ధతను ప్రదర్సించే ఈ చొరవ ప్రతిపాదిత ఎకో-పార్క్‌లు మరియు ఇతర బొగ్గు కంపెనీ ప్రాంగణాల్లో విస్తరణ కోసం ఉద్దేశించిన పైలట్ ప్రాజెక్ట్ గా నిలుస్తుంది.

 

తదుపరి కార్యక్రమం (జనవరి నుండి ఆగస్టు 2023):

కొనసాగుతున్న స్వచ్ఛతా పఖ్వాడా ప్రయత్నాలలో భాగంగా 2023 జనవరి నుండి ఆగస్టు వరకుబొగ్గు మంత్రిత్వ శాఖ మరియు పీఎస్ యూ లు   సాధించిన విజయాలు:

అధిక ప్రమాణాల శుభ్రతను పాటించడం, 6,929,401 చదరపు అడుగుల స్థలాన్ని శుభ్రపరచడం.

 

10,266 మెట్రిక్ టన్నుల చెత్తను బాధ్యతాయుతంగా పారవేయడం, ఫలితంగా రూ. 70 కోట్లు ఆదాయం.

 

బ్యానర్‌లు, సందేశ ప్రదర్శనలు, నుక్కడ్ నాటకాలు (వీధి నాటకాలు), సెమినార్‌లు మరియు కౌన్సెలింగ్ సెషన్‌లతో సహా పరిశుభ్రత కోసం విస్తృతమైన అవగాహన ప్రచారాలు.

 

వర్షపు నీటి సంరక్షణ కోసం నీటి సంరక్షణ ప్రయత్నాలకు దోహదపడే"ఇంకుడు బావులు" నిర్మించడం.

 

సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ (SUP) వాడకాన్ని అరికట్టేందుకు అవగాహన కల్పించడం మరియు పర్యావరణ అనుకూలమైన జనపనార/బట్టల సంచులను పంపిణీ చేయడం.

 

బ్లాక్-8 సమీపంలో థాయ్ మూగంబిగై ఆలయం దగ్గర దాదాపు 108,900 చ.అ.ల వ్యర్థ భూమిని హరిత వనం గా మార్చడం, దట్టమైన పొదలను తొలగించి,  చెట్ల పెంపకం మరియు హరిత వనం అభివృద్ధి కోసం పునర్నిర్మించబడింది.

 

బహుళ ప్రయోజనాల కోసం ఖాళీ స్థలాలలో పార్కింగ్, రికార్డ్ రూమ్‌లు, సిట్టింగ్ ప్రాంతాలు, టాయిలెట్ల నిర్మాణం, గార్డెనింగ్, ప్లాంటేషన్ కోసం ఉపయోగించడం మరియు గని ప్రాజెక్టులను విస్తరించడం.

 

"స్వచ్ఛత పఖ్వాడా 2023" లోగోతో మంత్రిత్వ శాఖలోని అన్ని విభాగాలలో  వాయు శుభ్రత జాతి చిన్న మొక్కలను ఉంచడం ద్వారా పని వాతావరణాన్ని మెరుగుపరచడం.

 

కొనసాగుతున్న ఈ కార్యక్రమాలు పరిశుభ్రత, సుస్థిరత్వం మరియు బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్వహణను పెంపొందించడంలో బొగ్గు మంత్రిత్వ శాఖ మరియు పీఎస్ యూ ల యొక్క దృఢ నిబద్ధతను ప్రతిబింబిస్తాయి. అందరికీ పరిశుభ్రమైన, పచ్చటి మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి వారి అంకితభావానికి నిదర్శనంగా స్వచ్ఛతా పఖ్వాడా 2023 పనిచేస్తుంది.

 

***


(Release ID: 1956997)