మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

పరిశుభ్రత, సుపరిపాలన కోసం ప్రత్యేక ప్రచారం 2.0 నిర్వహించిన మత్స్య శాఖ

Posted On: 12 SEP 2023 6:09PM by PIB Hyderabad

రికార్డ్ మేనేజ్‌మెంట్, పరిశుభ్రత (ఇండోర్ & అవుట్‌డోర్), ఆఫీస్ స్క్రాప్ తొలగించడం, నిబంధనలను సడలించడం/స్థలాన్ని ఖాళీ చేసే ప్రక్రియలు మొదలైన లక్ష్యంతో ప్రత్యేక ప్రచారం 2.0 నిర్వహించింది మత్స్య శాఖ. ఆ శాఖలో స్వయంప్రతిపత్త సంస్థలైన కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ (సిఏఏ), నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్ఎఫ్డిబి), దాని సంస్థలు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అండ్ ట్రైనింగ్ (ఎన్ఐఎఫ్పిహెచ్ఏటిటి), సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ నాటికల్ అండ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ (సీఐఎఫ్ఎన్ఈటి), ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఐ), సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కోస్టల్ ఇంజనీరింగ్ ఫర్ ఫిషరీస్ (సిఐసిఈఎఫ్) ఈ కార్యక్రమాలను చేపట్టాయి. క్యాంపెయిన్  చేపట్టడానికి డిఓఎఫ్  కింద సబార్డినేట్‌లు, అనుబంధ కార్యాలయాల నుండి మొత్తం 15ప్రదేశాలను లు గుర్తించారు. 

మత్స్యశాఖ, అన్ని సబార్డినేట్‌లు, అనుబంధ కార్యాలయాలతో పాటు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. దేశంలోని వివిధ తీర ప్రాంతాల్లోని మత్స్యశాఖ అన్ని విభాగాలు/డివిజన్/హాల్/రికార్డ్ రూమ్, సబార్డినేట్ & అటాచ్డ్ కార్యాలయాల స్థలాల తనిఖీ/సందర్శన చేపట్టారు. ప్రచార సమయంలో, ఆ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ 21 అక్టోబర్ 2022న చెన్నైలోని జోనల్ కార్యాలయాల్లో రెండు ప్రదేశాలను సందర్శించారు. పురోగతిని సమగ్ర పద్ధతిలో సమీక్షించారు. ఎఫ్ఎస్ఐ, సీఐఎఫ్ఎన్ఈటి జోనల్ కార్యాలయాలు సాధించిన పురోగతి విజయాల పరిశీలన కోసం 20 అక్టోబర్ 2022న వైజాగ్‌లోని మత్స్య శాఖ కార్యదర్శి మూడు ప్రదేశాలను సందర్శించారు. 26 అక్టోబర్ 2022న న్యూ ఢిల్లీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. 'క్లీన్ డెస్క్, క్లీన్ సెక్షన్, క్లీన్ కారిడర్స్‌పై దృష్టి పెట్టారు 'ప్రత్యేక ప్రచారం 2.0'. జెఎస్ (ఐఎఫ్) కొచ్చి కార్యాలయాన్ని 29 అక్టోబర్ 2022న సందర్శించగా, జెఎస్ (ఎంఎఫ్) తనిఖీ కోసం ఎన్ఎఫ్డిబి , హైదరాబాద్ కార్యాలయాన్ని సందర్శించారు.

ప్రచారంపై దృష్టి కేంద్రీకరించడానికి, అవగాహనను వ్యాప్తి చేయడానికి, వ్యాప్తిని మెరుగుపరచడానికి, 40 సోషల్ మీడియా పోస్ట్‌లను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ పేజీ, లింక్డ్‌ఇన్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో డిఓఎఫ్ సోషల్ మీడియా బృందం రూపొందించిం అప్‌లోడ్ చేసింది. @PMOIndia @HMOIndia @DARPG_GoI @swachhbharat @SwachhBharatGov @mygovindia @FisherySurveyOI, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిషరీస్ ఇన్‌స్టిట్యూషన్స్ మరియు స్టేట్స్/యుటిల సోషల్ మీడియా హ్యాండిల్స్ వంటి వీక్షకుల సంఖ్యను మెరుగుపరచడానికి తగిన ట్యాగ్‌లు ఉపయోగించారు. స్వచ్ఛత ప్రచారం 2.0లో చేసిన కార్యకలాపాలను ప్రదర్శించడానికి చిన్న వీడియోలు (2 నిమిషాల) ప్రదర్శించారు. 

"ప్రత్యేక ప్రచారం 2.0" లో భాగంగా అధికారులందరి అంకితభావంతో, 250 ఫైళ్ల పరిశీలన లక్ష్యానికిగాను 550 ఫైళ్లకు పైగా సమీక్షించారు, వాటిలో 290 ఫిజికల్ ఫైల్‌లు, దాదాపు 77 ఇ-ఫైళ్లు పరిష్కరించి, 43 ఇ-ఫైళ్లు మూసివేశారు. మత్స్యశాఖలో ప్రచారం కారణంగా 250 చదరపు అడుగులకు పైగా స్థలానికి కూడా విముక్తి కలిగింది. 

 

****



(Release ID: 1956896) Visitor Counter : 91


Read this release in: English , Urdu , Hindi , Tamil