మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
ఐసిఎఆర్- సిఐబిఎ రొయ్యల రైతుల సమ్మేళనం -2023 రెండవ ఎడిషన్‌ను 14 సెప్టెంబర్ 2023న నవసారిలో ప్రారంభించనున్న కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి శాఖ మంత్రి శ్రీ పర్షోత్తం రూపాల
ఈ సమ్మేళనం సందర్భంగా సిఐబిఎ, ఎన్ఎఫ్‌డిబి మధ్య, సిఐబిఎ & గుజరాత్ ఎఫ్ఎఫ్‌పిఒల మధ్య అవగాహనా ఒప్పందం అమలు
Posted On:
12 SEP 2023 2:32PM by PIB Hyderabad
ఐసిఎఆర్- సిఐబిఎ రొయ్యల రైతుల సమ్మేళనం -2023 రెండవ ఎడిషన్‌ను 14 సెప్టెంబర్ 2023న నవసారిలోగుజరాత్ శాసన సభ సభ్యుడు శ్రీ ఆర్‌సి పాటిల్, ఎంపీ సిఆర్ పాటిల్, రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక,గో పెంపకం, మత్స్య, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రాఘవ్‌జీ భాయి హన్సరాజ్‌భాయ్ పటేల్‌ల సమక్షంలో కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి శాఖ మంత్రి శ్రీ పర్షోత్తం రూపాల ప్రారంభించనున్నారు.
సిఐబిఎ, జాతీయ మత్స్య అభివృది్ధ బోర్డు (ఎన్ఎఫ్‌డిబి) మధ్య; సిఐబిఎ & గుజరాత్ మత్స్యరైతు ఉత్పత్తి సంస్థ (ఎఫ్ఎఫ్‌పిఒ) మధ్య అవగాహన ఒప్పందాలను చేపల పెంపకంలో పంట బీమాను అమలు చేసేందుకు ఉద్దేశించింది. ఇందులో ఎన్ఎఫ్‌డిబి ప్రీమియం సబ్సిడీని, సాంకేతికత మద్దతును ఎఫ్ఎఫ్‌పిలకు అందించడాన్ని సమావేశం సందర్భంగా అమలు చేయనున్నారు. దీనితో పాటుగా భారత వ్యవసాయ బీమా కంపెనీ లిమిటెడ్ ఉత్పత్తి అయిన రోయ్యల పంట బీమాను కూడా ప్రారంభిస్తారని భావిస్తున్నారు.
రొయ్యలకు సంబంధించి ప్రస్తుత ఎగుమతి పరిస్థితి, దాని తక్షణ అవకాశాలు, ముఖ్యంగా సూక్ష్మ ఫంగస్ (ఎంటరోసైటోజూన్ హెపటోపెనీయ్ (ఇహెచ్‌పి) కారణంగా సంక్రమించే హెపటోపాంక్రియాటిక్ మైక్రోస్పోరిడియోసిస్ (హెచ్‌పిఎం) ప్రస్తావనతో వ్యాధుల నిరోధం, నిర్వహణ, రొయ్యల పెంపకానికి పంట బీమా, జన్యుపరంగా మెరుగుపరిచిన భారతీయ శ్వేత రొయ్యలు (పెనియస్ ఇండికస్), మడ్ క్రాబ్,ఏషియన్ సీబాస్ ఫిష్‌లతో ఉప్పునీటి మత్స్య సేద్యాన్ని వైవిధ్యపరచడానికి ప్రణాళికలను సిద్ధం చేయడంపై సాంకేతిక సెషన్ జరుగనుంది. చేపలు, రొయ్యల ప్రత్యక్ష ప్రదర్శన, పుస్తకాలు, ప్రచురణల విడుదల, రైతులకు మత్స్య విత్తనాల పంపిణీని కూడా ఏర్పాటు చేశారు.
మత్స్య పంట బీమాపై ప్రత్యేక సెషన్‌తో పాటుగా అంతర్ విభాగ అధికారుల భాగస్వామ్యంతో రొయ్యల విత్తనాల నాణ్యత, రొయ్యల ధర, విస్తరణ, వైవిధ్యీకరణ, విద్యుత్ ధర తదితరాలపై ప్యానెల్ చర్చను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
నవసారి గుజరాత్ రీజియనల్ సెంటర్ ఆఫ్ ఐసిఎఆర్ -- సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్‌వాటర్ ఆక్వాకల్చర్ (ఐసిఎఆర్- సిఐబిఎ), చెన్నై డైరెక్టర్ ఐసిఎఆర్- సిఐబిఎ డాక్టర్ కుల్దీప్ కె. లాల్ పర్యవేక్షణలో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
వ్యవసాయ బీమా కంపెనీ లిమిటెడ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి గిరిజా సుబ్రమణియన్, ఐసిఎఆర్ డెప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఫిషరీస్), డాక్టర్ జె.కె. జీనా, నవసారీ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ జెడిపి పటేల్, కోస్తా ఆక్వాకల్చర్ అథారిటీ మెంబర్ సెక్రెటరీ డాక్టర్ వి. కృప, గుజరాత్ ప్రభుత్వ మత్స్య కమిషనర్ శ్రీ నితిన్ సంగ్వాన్, జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు డాక్టర్ ఎల్ నరసింహ మూర్తి ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాక, రైతులు, ఇతర భాగస్వాములతో ముఖా ముఖి సంభాషించనున్నారు.
గుజరాత్ ఆక్వా ఫీడ్ డీలర్స్ అసోసియేషన్, గుజరాత్ ఆక్వా ఫార్మర్స్ అసోసియేషన్, ఎస్‌సి/ ఎస్‌టి పథకాల లబ్ధిదారులు, ప్రజా ప్రతినిధులు, అభివృద్ధి విభాగపు అధికారులు, టెక్నీషియన్లు, బ్యాంకర్లు, బీమా అధికారులు, అధ్యాపకులు, విద్యార్ధులు సహా దాదాపు మూడు వందలమంది మత్స్య రైతులు, భాగస్వాములు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
***
(Release ID: 1956765)
Visitor Counter : 170