వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతదేశం, సౌదీ అరేబియాలు ఉభయ దేశాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేయాలని న్యూఢిల్లీలో జరిగిన ఇరు దేశాల ఇన్వెస్ట్ ఫోరమ్ సమావేశం నిర్ణయించింది.


భారతదేశం-సౌదీ అరేబియా స్టార్టప్/ఇన్నోవేషన్ బ్రిడ్జ్ ప్రారంభించబడింది, ద్వైపాక్షిక పెట్టుబడులను పెంచడానికి 45 అవగాహన ఒప్పందాలు సంతకాలు జరిగాయి

Posted On: 12 SEP 2023 12:57PM by PIB Hyderabad

సౌదీ అరేబియా యువరాజు మరియు ప్రధాన మంత్రి, గౌరవ మహ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ భారతదేశ పర్యటన సందర్భంగా డిపార్ట్‌మెంట్  లీడర్స్ సమ్మిట్‌లో భాగంగా ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్య మండలి,  భారత వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య అభివృద్ధి,  మరియు సౌదీ పెట్టుబడి మంత్రిత్వ శాఖ నిన్న న్యూఢిల్లీలో ఇండియా-సౌదీ అరేబియా ఇన్వెస్ట్‌మెంట్ ఫోరమ్ 2023 (“ది ఫోరమ్”)ను నిర్వహించాయి.

 

ఫోరమ్‌కు భారతదేశం మరియు సౌదీ అరేబియా నుండి 500 కంటే ఎక్కువ కంపెనీలు హాజరయ్యారు. భారతదేశం మరియు సౌదీ అరేబియా మధ్య జరిగిన సదస్సులలో ఇది మొదటిది. భారత ఆర్థిక వ్యవస్థలోని విభిన్న రంగాలలో సుమారు $100 బిలియన్ల పెట్టుబడులు పెట్టడానికి సౌదీ క్రౌన్ ప్రిన్స్ చేసిన ప్రకటనకు ఇది కొనసాగింపు.

 

భారతదేశం-సౌదీ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరమ్ 2023 యొక్క మినిస్టీరియల్ సెషన్‌కు కేంద్ర వాణిజ్యం పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మరియు సౌదీ అరేబియా పెట్టుబడుల మంత్రి, గౌరవ  ఖలీద్ ఎ. అల్ ఫాలిహ్ లు అధ్యక్షత వహించారు.

 

వ్యాపార సమావేశంలో సంయుక్తంగా ప్రసంగించిన ఇద్దరు మంత్రులు, స్టార్టప్‌లు, డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, రెండు దేశాల వ్యాపార మరియు పెట్టుబడిదారుల పర్యావరణ వ్యవస్థల మధ్య సహకారాన్ని పెంచడం రెండు దేశాల పెట్టుబడుల అభివృద్ధి సంస్థల మధ్య మరియు పెట్టుబడుల అభివృద్ధి కార్యాలయాల ఏర్పాటు, సౌదీ సావరిన్ వెల్త్ ఫండ్‌లు భారతదేశంలోకి ప్రత్యక్ష పెట్టుబడులను పరిగణలోకి తీసుకునేలా ప్రోత్సహించడం ద్వారా ప్రస్తుత పెట్టుబడుల ద్వారా వచ్చే పెట్టుబడులు మరియు ఉమ్మడి ప్రాజెక్టుల అవకాశం వంటి వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించే మార్గాలు మరియు విధానాల గురించి చర్చించారు. 

 

వ్యూహాత్మక భాగస్వామ్య మండలి యొక్క ఆర్థిక వ్యవస్థ మరియు పెట్టుబడులపై కమిటీ ఫుడ్ ప్రాసెసింగ్, రవాణా మరియు మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్యుత్ శక్తి ముఖ్యంగా పునరుత్పాదక విద్యుత్ శక్తి, నైపుణ్య అభివద్ధి, అంతరిక్షం, ఐసిటి, స్టార్ట్-అప్‌ల రంగాలలో ముఖ్యంగా డిజిటల్ రంగం లో సంభావ్య పెట్టుబడి సహకారాలను కూడా మంత్రులు వివరించారు. భాగస్వామ్య అవకాశాలను త్వరితగతిన అందిపుచ్చుకోవడం పై మంత్రివర్గ చర్చలో కొన్ని  కీలక ఫలితాలు వచ్చాయి. 

 

పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రమోషన్ విభాగం కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్ ఫోరమ్‌లో స్వాగత వ్యాఖ్యలలో, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యతను ఎత్తిచూపారు మరియు రెండు దేశాల మధ్య ఆర్థిక మరియు సాంస్కృతిక సంబంధాలను పెంపొందించడం ద్వారా పరస్పర వృద్ధిని నొక్కి చెప్పారు.

 

ఫోరమ్ ఇన్వెస్ట్ సౌదీ, ఇన్వెస్ట్ ఇండియా, సౌదీ అరేబియా ఆర్థిక నగరాలు మరియు ప్రత్యేక మండలాల అథారిటీ, గిఫ్ట్ సిటీ, ఐ ఎఫ్ ఎస్ సి (ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్), సౌదీ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు ఫిల్మ్ కమీషన్ మరియు నేషనల్ సెంటర్ ఫర్ ప్రైవేటైజేషన్, సౌదీ అరేబియా భారతదేశంలో మరియు సౌదీ అరేబియాలో సమృద్ధిగా ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరణాత్మక ప్రదర్శనలను కూడా ఇచ్చింది. 

 

 ఐ సీ టీ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్; రసాయనాలు ఎరువులు; శక్తి, సుస్థిరత్వం; అధునాతన తయారీ; మరియు ఆహార భద్రత వంటి పలు రంగాలలో సంభావ్య ద్వైపాక్షిక సహకారంపై  బ్రేక్‌అవుట్ సెషన్‌లు చర్చలు నిర్వహించబడ్డాయి. ఈ రంగాలలో నైపుణ్యం మరియు ఆసక్తి ఉన్న ఇరు దేశాలకు చెందిన సంబంధిత వ్యాపారాలు ఆయా రంగాలలో మెరుగైన సహకారానికి తమ అభిప్రాయాలను ఈ  సమావేశంలో పంచుకున్నారు.

 

అంతకుముందు రోజు, జీ 2 బీ మరియు బీ 2 బీ ఫార్మాట్లలో ఇరుపక్షాల మధ్య 45 కంటే ఎక్కువ అవగాహన ఒప్పందాలు (ఎంఓయులు) కుదిరాయి. ఈ అవగాహన ఒప్పందాలు ఇరుపక్షాల మధ్య ఆర్థిక బంధాలను మరింతగా పెంచుతాయని మరియు ఇరుపక్షాల మధ్య పెట్టుబడి ప్రవాహాలను వేగవంతం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

 

***


(Release ID: 1956605) Visitor Counter : 178