సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
సామాజిక న్యాయం సాధికారత శాఖల కార్యాలయాల్లో సుందరీకరణ, పెండింగ్ అంశాల పరిష్కారం
- 2 అక్టోబర్, 2022 నుండి 31 అక్టోబర్, 2022 వరకు ప్రత్యేక కార్యక్రమం 2.0 నిర్వహణ
Posted On:
11 SEP 2023 7:10PM by PIB Hyderabad
అక్టోబరు 2 నుండి పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారించాలంటూ ‘అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ (డి.ఎ.ఆర్.పి.జి)’ నుండి అందిన ఆదేశాల సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ, ప్రత్యేక కార్యక్రమం 2.0 నిర్వహించింది. 02.10.2022న 2022 నుండి 31 అక్టోబర్, 2022 వరకు దీనిని నిర్వహించింది. సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ దాఖలు చేసిన యూనిట్లలో పెండింగ్‌లో ఉన్న అంశాల (ఎస్.సి.డి.పి.ఎం) పరిష్కారం కోసం ప్రత్యేక కార్యక్రమం 2.0ని చేపట్టింది. రెండు దశల్లో దీనిని అమలు చేసింది. 14.09.2022 నుండి 30.09.2022 వరకు సన్నాహక దశగాను.. 02.10.2022 నుండి 31.10.2022 వరకు అమలు దశగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ క్రింది అంశాలపై ప్రత్యేక దృష్టి సారించే విధంగా రెండో దశ ముందుకు సాగింది.: -
• పెండెన్సీని తగ్గించడం: సీపీజీఆర్ఏఎంల పబ్లిక్ గ్రీవెన్స్ డిస్పోజల్, ఐఎంసీ: ఈఎఫ్సీ/ఎఫ్సీఐ/క్యాబినెట్ నోట్, రాష్ట్ర ప్రభుత్వ సూచనలు, పార్లమెంట్ హామీలు మొదలైనవి;
• డిజిటలైజేషన్: 100% ఈ-ఆఫీస్ అమలు, 100% భౌతిక ఫైల్లు మరియు రసీదుల డిజిటైజేషన్ (భౌతిక ఫైల్లను ఇ-ఆఫీస్లోకి మార్చడం);
• ఆఫీస్ ఆవరణమును యొక్క సమర్ధవంతమైన నిర్వహణ: ఉపయోగించని ఫైల్లు/పాత పేపర్లు/ఫైల్ కవర్లు/ఫైల్ బోర్డులు/కంప్యూటర్లు/ప్రింటర్/ఫర్నిచర్ వంటి సేవలందించని వస్తువులను స్క్రాప్ చేయడం;
• పర్యావరణ అనుకూల పద్ధతులు: 100% గో గ్రీన్ (పేపర్లెస్ వర్కింగ్ + "వన్-టైమ్ ప్లాస్టిక్ వాడకం + పేపర్లెస్ వర్కింగ్ మొదలైనవి), ట్రాష్ ద్వారా నగదు పొందడం మొదలైనవి;
• క్లీన్లీనెస్ డ్రైవ్: ఈ కార్యక్రమం చేపడుతున్న సమయంలో ప్రతి అధికారి/ అధికారి ద్వారా వారంలో 03 గంటలు స్వచ్ఛతకు ప్రాధన్యతనివ్వడం.
• డిపార్ట్మెంట్లో స్వచ్ఛతను సంస్థాగతీకరించడం.
ఈ విషయంలో, (i) డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ (డీఏఐసీ) (ii) డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ (iii) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ (ఎన్.ఐ.ఎస్.డి) (iv) నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్ఎఫ్డీసీ) వంటి కార్పొరేషన్లు/స్వయంప్రతిపత్తి సంస్థలు , (v) నేషనల్ సఫాయి కరంచరీస్ ఫైనాన్స్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్.ఎస్.కె.ఎఫ్.డి.సి),(vi) నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ & డెవలప్మెంట్ కార్పొరేషన్, (ఎన్.బి.సి.ఎఫ్.డి.సి) డిపార్ట్మెంట్లోని అన్ని విభాగాలకు అదనంగా ఎంపిక చేయబడ్డాయి.
ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఫలితాలు క్రిందివి: -
• 3440 ప్రజా ఫిర్యాదులు పరిష్కరించబడ్డాయి.
• 05 రాష్ట్ర ప్రభుత్వ సూచనలు క్లియర్ చేయబడ్డాయి.
• 250 కంటే ఎక్కువ ఫైల్లు సమీక్షించబడ్డాయి మరియు 233 ఫైల్లు తొలగించబడ్డాయి.
• ఫర్నిచర్ మరియు కంప్యూటర్లు స్క్రాప్ చేయబడ్డాయి మరియు రూ. 53000/- ఆదాయం లభించింది.
• స్క్రాప్ చేయగల వస్తువులను తొలగించడం, కార్యాలయాల్లో చేపట్టిన పునరుద్ధరణ పనులు ద్వారా 1500 చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి వచ్చింది.
• డిపార్ట్మెంట్లోని పద్ధతులను సంస్థాగతీకరించడానికి 100% గో గ్రీన్ (పేపర్లెస్ వర్కింగ్ + "వన్-టైమ్ ప్లాస్టిక్ వాడకం తగ్గించడం), రెగ్యులర్ పరిశుభ్రత కార్యకలాపాలు మరియు 100% ఈ-ఆఫీస్ అమలు వంటి పర్యావరణ అనుకూల పద్ధతులపై దృష్టి సారించబడింది. ప్రత్యేక ప్రచారం 2.0 కొనసాగించబడినందున, ఈ విభాగం శాఖ కార్యాలయాల్లో పీజీ పెండెన్సీని తగ్గించడానికి ప్రయత్నాలు జరిగాయి. 01.11.2022 నుండి 11.09.2023 వరకు మొత్తం 5418 పీజీ కేసులు పరిష్కరించబడ్డాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, ప్రత్యేక కార్యక్రమం 3.0 చేపట్టనున్నారు. ఇది 15.09.2023 నుంచి అమలు చేయబడుతోంది.
*****
(Release ID: 1956524)