ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ప్రత్యేక ప్రచారం 3.0

Posted On: 11 SEP 2023 7:11PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత అయిన స్వచ్ఛ భారత్‌కు కొనసాగిస్తూ, తన కార్యాలయాల్లో పరిశుభ్రత పాటించడానికి, పాలనలో జాప్యాన్ని తగ్గించడానికి, ప్రజల భాగస్వామ్యాన్ని (జన్‌ భాగిదారి) పెంచడానికి కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.

సుపరిపాలన & స్వచ్ఛతను పాటించడం కోసం, కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రచారం 2.0లో పాల్గొంది. శాఖ కార్యాలయాల్లో పరిశుభ్రతను విధుల్లో భాగంగా మార్చడం, ప్రభుత్వ కార్యకలాపాలలో జాప్యాన్ని తగ్గించడంపై దృష్టి సారించింది. 2022 అక్టోబర్ 2న ప్రారంభమైన ప్రత్యేక ప్రచారం 2.0 గడువు 2022 నవంబర్‌లో ముగియాల్సి ఉన్నా, 2023 ఆగస్టు వరకు కొనసాగింది.

భారత ప్రభుత్వం చేపట్టిన ఈ చొరవను మరింత ముందుకు తీసుకువెళ్లేలా, మంత్రిత్వ శాఖ తన తన 10 సంవత్సరాల స్వచ్ఛ భారత్‌ అంకితభావాన్ని కొత్త శిఖరాలకు చేరుస్తోంది. 2023 అక్టోబర్‌లో ప్రారంభమయ్యే ప్రత్యేక ప్రచారం 3.0లో మరిన్ని పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టబోతోంది.

ప్రత్యేక ప్రచారం 2.0 సమయంలో, ఈశాన్య రాష్ట్రాల్లోని వివిధ ప్రదేశాల్లో ఉన్న క్షేత్ర స్థాయి కార్యాలయాలపై మంత్రిత్వ శాఖ దృష్టి పెట్టింది. మంత్రిత్వ శాఖ కార్యాలయాలు, ఎన్‌ఈసీ, ఎన్‌ఈడీఎఫ్‌ఐ, ఎన్‌ఈహెచ్‌హెచ్‌డీసీ, ఎన్‌ఆర్‌ఏఎంఏసీ, ఎఈసీబీడీసీ కార్యాలయాలు సహా గుర్తించిన 34 ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ప్రచారంలో ఉద్యోగులు, ప్రజలు విస్తృతంగా పాల్గొన్నారు.

ప్రత్యేక ప్రచారంలో సాధించిన ప్రధాన విజయాలు:- 313 ఈ-ఫైళ్లను పరిష్కరించారు, 550 భౌతిక దస్త్రాలను తొలగించారు. 2022 అక్టోబర్‌లో 34 ప్రాంతాలను శుభ్రపరిచారు. అదే నెలలో, వ్యర్థాలను అమ్మిన ఎన్‌ఈడీఎఫ్‌ఐ, ఎన్‌ఈసీ రూ.1,07,697 ఆదాయం సంపాదించాయి. 2022 డిసెంబర్‌లో, మంత్రిత్వ శాఖ రూ.50,000 ఆదాయం సంపాదించింది. 2022 నవంబర్ నుంచి 2023 ఆగస్టు వరకు మంత్రిత్వ శాఖకు చెందిన కొన్ని గదులను శుభ్రం చేశారు/పునరుద్ధరించారు.

WhatsApp Image 2023-09-11 at 17.22.25.jpeg WhatsApp Image 2023-09-11 at 17.24.53.jpeg

త్వరలో ప్రారంభం కాబోయే ప్రత్యేక కార్యక్రమం 3.0 ఒక ముఖ్యమైన మైలురాయిగా మారుతుంది, గత దశాబ్దం కాలంగా మంత్రిత్వ శాఖ చేపట్టిన స్వచ్ఛత కార్యక్రమాలకు సమాంతరంగా సాగుతుంది. అందరు వాటాదార్ల క్రియాశీల భాగస్వామ్యంతో, రాబోయే సంవత్సరాల్లో అమలు చేయబోయే కార్యక్రమాలతో ఈ ప్రచారం అసాధారణంగా ఉంటుందని మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది.

కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి, సహాయ మంత్రి శ్రీ బి.ఎల్. వర్మ మార్గదర్శకత్వంలో, ప్రత్యేక ప్రచారం 3.0 కింద చేపట్టే కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడానికి మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. పరిశుభ్రత మంత్రిత్వ శాఖ, దాని పరిధిలోని సంస్థల్లోని ప్రతి అధికారి రోజువారీ విధిగా మారేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

***



(Release ID: 1956515) Visitor Counter : 147